నా మిత్రుడు ఒక అమ్మాయిని మూడేళ్ళ నుండి ప్రేమించి క్రితేడాది పెద్దలు లేకుండా పెళ్లి చేసుకున్నారు.
అందరికి తెలిసేలాగే కాపురం పెట్టుకున్నారు.
పర్వాలేదు నాలుగు చేతుల సంపాదన చెప్పుకోవడానికి వారికి సమయమోకటే తక్కువ కాని ఆర్ధికంగా ఎలాంటి ఆపదలు వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి. ఏమైనా అయితే ఇరువైపులనుండి ఆదుకోవడానికి పెద్ద మొత్తం లోనే ఆస్తిపరులైన ఇరువురి తల్లిదండ్రులు.
ఇక్కడి వరకు ఇక బాగానే ఉందనుకుంటుండగానే....
ఎప్పుడో గాని గుర్తుకురాని నన్ను ఉన్నపళాన రమ్మని ఫోన్ చేయడంతో ఇక వెళ్లక తప్పలేదు.
చినుకు చినుకు కలిసి గాలి వానయినట్టు. ప్రతి అనవసరమైన విషయాలన్నీ వారి అవసరమైనట్టు గులకరాళ్ళు వారికి కొండరాళ్ళ కనిపిస్తున్నట్టున్నాయి. అందుకే ఎక్కడలేని తూఫనంత వారివురి నడుమే.
ఇక ఇదే సందన్నట్టు "పోనీ లేరా ఇది కాకపోతే ఇంకొకతి దీనికన్నా మంచి పిల్లనే తీసుకొచ్చి పెళ్ళిచేస్తా వోదిలేయరా!" అని ఆడి అమ్మ ఆజ్యం పోసింది. ఇక వాళ్ళ అమ్మ ఏమైనా తక్కువ తిన్నదా "అబ్బో ఇగ నువ్వు చేస్తావు నేను చూడాలి. పోనిలేవ్వే నీకోసం పిలగాడు ఇప్పటికి రెడీ గ ఉన్నాడు నిన్ను చేసుకోవడానికి పదవే పదా....." అంటూ వాళ్ళమ్మ పొగలో కిరసనయిలేసి సెగ పెట్టింది.
ఇక నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికొచ్చి రేపోమాపో బంధం పుటుక్కుమనేలా ఉంది.
చదివిస్తే ఉన్నమతి చెడినట్టు అనే మా అమ్మ నోట విరివిగా వినపడే సామెత గుర్తొచ్చింది. నిజమే చదువుతో మేధావి తనంతో పాటు బంధాలను భలపరుచుకోవాలనే విషయం ఎందుకు నేర్చుకోరో... అసలు నేర్పిస్తే కదా.....
ఏంటో బంధాలు ఇంత భలహీనమైనవా?
నాలుగు ముచ్చట్లు, రెండు షికార్లు, ఒక సినిమా, సందు దోరికేతే పార్టీలు, స్ట్రెస్ కి ఫీలయితే కాస్త ఉపశమనానికి, విషయానికి ఓ తోడు.
ఇంకాస్త దూరంగా ఆలోచిస్తే ప్రేమ ఆ తర్వత వీలైతే పెళ్లి లేకుంటే సహజీవనం. ఏదైతేనేమి అన్ని ఇన్ స్టంట్ వ్యవహారాలు ఇన్ స్టంట్ జీవితాలు. చదువు వల్ల ఉద్యగం వల్ల కాస్త ఇండి విజ్యువాలిటి పెరగడమే దీనంతటికి కారణమా? నా బతుకు నేను బతక గలను నా పరిధిలోకి నువ్వు నీ పరిధిలోకి నేను రాకుండా, నీ స్వతంత్రం నీది నా స్వతంత్రం నాది, అయిన నువ్వంటే ఇష్టం, సర్వస్వం, మనమెప్పుడు ఇలానే కలిసుందాం. సమస్య వొస్తే పరిష్కారించుకుందం.
కాని......... నా గమ్యాలు అవి, నా లక్ష్యాలు ఇవి. వీటికి నీకు అభ్యంతరం లేనంతవరకు మనం ఇలా కొనసాగుధం....
ఏంటో నవ్వొస్తుంది. పదాలకి అర్ధాలు మారుతుంటే..
ఎక్కడికేల్తున్నాయో మానవ సంబంధాలు, స్వచ్చమైన అనుబంధాలు, ఆప్యాయత అనురాగాలు, పాపం ఈ పదాలన్నీ చదువుకోవడానికి, వినడానికి, కథల్లో, కవితల్లో ఉపోయోగించుకోవడానికే మిగిలిపోయేలా ఉన్నాయి.
తప్పెవరిది అని అడిగితే ఓ..... పెద్ద పెద్ద మైకులేసుకొని తెగ లెక్చర్లు ఇవ్వడానికి లగేత్తుకొని వస్తారు.
హు.. మూలలే సరిగా లేనపుడు ఇప్పుడేదో వెలగబెడదాం అనుకోవడం కూడా బ్రమే.
ఏమి రఘు ఏమ్ మాట్లడట్లేదేంటి నీ ఫ్రెండు కదా అని గుర్రుమంటూ చూస్తూ వెటకారంగా గయ్యిమన్నంత లెవిల్లో మా వాడి అమ్మ అరిచేసరికి తేరుకున్నాను (సాధారణంగా ఆవిడని పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తుంట. వాడి తరువాత నను కొడుకుల చూసుకునేది. ఆమె అంత కోపిష్టెం కాదు గాని ఇక వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి వీడితో పాటు నన్ను కూడా పురుగుల చూస్తున్నది. అందుకే అటువైపు వెళ్ళడమే తగ్గిపోయింది.) ఇక అరిచిన అరుపుకి విషయం నా వైపుకు మళ్ళింది అక్కడికి నేనేదో పొడిచేస్తాను అన్నట్టు.
బెదురు బెదురుగా పనమ్మాయి గ్లాసులో నీళ్ళు తెచ్చిస్తే తాగేస్తూ, నేను కిక్కురుమనలేదు. అనడానికి కూడా నా దగ్గర ఏమి లేదు కాబట్టి. ఏదో అలోచిస్తున్నోడిలా మొహం పెట్టి కూచున్న. కాసేపటి గొడవ తర్వత ఇక ఇది తెగేలా లేదని వాడ్ని బయటికి తీసుకొచ్చి కార్లో బయల్దేరాం..
విషయమంత పూర్తిగా విన్న..
ఇరువైపులా నుండి ఆలో చించాక అర్ధమైన విషయం ఏవిటంటే..
-వారు విడిపోవడానికి కారణం కలిసుండాలనే ప్రేమ లేక పోవడమే.
-అనుక్షణం పని ఒత్తిడి.
-ఎప్పుడు గమ్యాలపై ఆధారపడి, ఆలోచనలు లక్ష్యాలను గురిచేస్తు, కాలం ఇరువురి మధ్యన ఒక ప్రేమ బంధం ఉందనే విషయాన్నే అనిచివేసింది.
ఇక నేను తనను జాబు మాన్పించు. లేదా నువ్వు జాబు మానేయ్ అని సలహా ఇచ్చాను.
నా సలహాకి వెర్రిగా నవ్వుతు.
నేను జాబ్ మానేసి తన మీద ఆధారపడాల తనని జాబ్ మానేయ్ మనే ధైర్యం లేదు. తన జాబ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని పెళ్ళికి ముందే కట్టుబడి ఉన్నాం అని.
మరి ఎం చేద్దాం అనుకుంటున్నావ్ రా...
ఎం లేదురా బ్రేక్ అప్ అంతే.
మరి ప్రేమ?
తనకే లేనపుడు ఇక నా ప్రేమతో పనేముంది.
తనేమంటుంది?
తను కూడా ఫిక్స్ అయ్యింది. స్టేట్స్ కి వెళ్ళాలని. నేను వద్దన్నాను. అది తనకు నచ్చలేదు. నేను కోరుకున్న కెరీర్ ఇది కాదని వాదిస్తుంది. పైగా ఆరేడు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు.
పోనీ నువ్ కూడా వెళ్ళు.
వెళ్ళడం నాకిష్టం లేదు రా..
ఇక నాదగ్గర మాటల్లేవు ప్రశ్నల్లేవు. కాసేపటి తరువాత కారు భయటికి దిగి వాడిని వెళ్ళమని మెల్లిగా నడుస్తూ ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.
మనుషుల్ని సాశిస్తున్నది సమాజమా? జీవనశైలియ? ఆలోచన విధానాల? అభిప్రాయాల? ఎంచుకున్న లక్ష్యాల? చదివిన చదువా? కుటుంబమా? తల్లి దండ్రులా? ఏంటో...
ఒక దానితో ఒకటి ముడి పడి గందరగోళంలో ఇరుక్కొని కొట్టు మిట్టడడమే "ఒత్తిడా!!"
ఆ ఒత్తిడి కి కాస్త ఊరడింపే ఈ పరిచయాల? ఏమో... అవునో... కాదో...
ఎన్ని అనుకున్న ప్రతి దేహానికి ఓక కెమిస్ట్రీ ఉంది. రసాయనిక చర్య ఉందని ఏదేదో చెప్తారు. కాని మనసుందని అది మానసికంగా ఒకరి తోడు కోరుతుందని ఎవరికీ వారికి తెలిసిన. తెలిసే పరిచయాలు మొదలవుతాయి అది ఆకర్షణ అని అనుకునే తావు కూడా మనసుకు రాదూ.
అర్ధంలేని ఒత్తిడికి ఆ పరిచయాలు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆ బంధం అప్పటికి అల ముడి పడుతుంది.
కాని... జీవితాంతం కలిసుండడానికి చివరికి ఎన్నో విషయాలు పరిగనలోకోస్తాయని, ఒకరంటే ఒకరికి ప్రేమలో మమేకమై, ఒకరికోసం ఒకరుగా, ఇరువురు ఒకటిగా అనే తత్వం కలగక పోవడానికి కారణమేంటి???
ఏమో ఇవన్ని ఆలోచిస్తుంటే అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం లో కలిసుంటే అమ్మలక్కలు అదని ఇదని గొడవలోచ్చినా.. ఒకరికొకరు కలిసే ఉండి ఆలోచించుకొని సర్దుకు పోయే గుణం అలవడుతుంది.
అందరి ఆప్యాయతల నడుమ ఏదో ఒక క్షణంలో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ మొదలవుతుంది.
పెళ్ళికి వయసులో తేడా ఉండాలి. పెళ్లి అయి నీ జీవితంలోకి అడుగుపెట్టిన తనని మచ్చిక చేసుకొని మనసు పెట్టి చూసుకునే గుణం నీకు రావాలి, నువ్వంటే గౌరవం తనకు రావాలి.
ఒకరిమీద ఒకరికి కచ్చితమైన, నమ్మకమైన ప్రేమ ఉంటె ఎన్ని గొడవలోచ్చిన ఎవరు విడదీయలేరు రా...
కట్టుబాటు తాడిమట్టలు అని పెద్దలు చెప్పిన ముచ్చట పెడ చెవిన పెడితే ఇగ ఇడాకులు ఇస్తారకులు అని అవ్వ అయ్యల ఇజ్జత్ తీస్తారు. మల్లోచ్చేది, వచ్చే టోడూ కూడా పెళ్ళాన్ని వోదిలేసినోడో మొగుణ్ణి వొదిలేసినదో గతి.
నిజమే... ప్రేమ పుట్టాలన్న బంధం కొనసాగాలన్న ఇరువురికి కావాల్సింది కచ్చితమైన నమ్మకం.
తను ప్రేమించిన వాడే సర్వస్వం అని ఆవిడా,
ఆవిడే నా లోకం ఆవిడే లేక పోతే నేను ఏమి కాను.
అనే అంతర్లీన ఆత్మీయ అనుభూతి కలగనంత వరకు ఏ సంబంధమైన - అది పెళ్ళి పేరుతో ముడి పడిన - ప్రేమ మత్తులో అల్లుకున్న అన్ని నీటిలో బుడగల లాంటివే.
ఒకరంటే ఒకరికి ఆత్మీయ భావన కలిగినపుడు, వయసుతో గాని, ప్రపంచంతో గాని, విషయాలతో గాని సంబంధం లేదు.
అలంటి అనుబంధానికి పెళ్లి అనే కట్టుబాటు తంతు కూడా అవసరం లేదనే నా అభిప్రాయం.
ఇక ఆత్మలు ఒకటయ్యాక విడిపోయే అవకాశమెక్కడుంటుంది. అనుక్షణం ఒకరికోసం ఒకరిగా తపిస్తుండగానే కాలం అల గడిచిపోతుంది.
బహుశా అలంటి ఆత్మీయ బంధాలు ఏర్పడాలంటే ఇద్దరు కలిసుండి ఒకరినొకరు అర్ధంచేసుకోవడానికి పెళ్లి అనే ముడితో కట్టేసి అవగాహన వచ్చేవరకు ఉమ్మడి కుటుంబాలనే వ్యవ్యహారం పనికొస్తుందని మా అమ్మ తత్వం. కావచ్చు..
నా మట్టుకైతే ప్రేమ అనే భావన నిజంగా మొదలైతే అది ఎన్నటికి ఆరిపోదు ఆరిపోతున్నదంటే వెలిగించాలని ఎంత ప్రయతించిన అది ఎవరో ఒకరి భావనని భలవంతంగా లొంగ దీసుకోవడమే అవుతుంది.
ప్రేమతో పెనవేసుకున్న బంధం గట్టిధయితే ఆ ప్రేమ బంధం ఎక్కడ యే పరిస్థితిలో, యే జీవనవిధానంలో ఉన్న ఉన్నంతలో త్రుప్తి పొందుతూ ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతుంటుందని నా అభిప్రాయం.
ఏంటో ఆలోచనలన్నీ అర్ధం పర్ధం లేకుండా పారిపోతుంటే జేబులో మోగుతున్న సెల్లు రింగ్ టోన్ తో ఉన్నపలనా ఆగిపోయాయి. ఫోన్ తీసి చూస్తే తాక్షి....
ఎక్కడున్నావ్? ఇంతకి ఏమైనా తిన్నావా? ఎం చేస్తున్నావ్? బయట తిరగకు ఎండలు మండిపోతున్నాయి.. తొందరగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకెన్ని రోజులు మహా అంటే వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయి............. అవతలి వైపునుండి తన మాటలు సాగుతూనే సూర్యాస్తమయం అవుతుండగా ఇంటిముఖం పట్టా...