నా మనసు ఆలోచనలన్నీ అమృతం తాగాయేమో అస్సలు చావట్లేవు Sep 1 - 2011
17, నవంబర్ 2011, గురువారం
16, నవంబర్ 2011, బుధవారం
15, నవంబర్ 2011, మంగళవారం
ప్రపంచం నలుమూలల కేవలం రంగు రూపు అనే ముసుగులేసుకొని ఎంత వేలాడుతున్నా... ఏ వ్యక్తుల మూలల్లో తొంగి చూసిన అచ్చంగా అవే భావాలూ, అవే ఆలోచనలు, అవే కోరికలు, అవే ఆవేదనలు, అవే జ్ఞాపకాలు, అవే గమ్యాలు, అవే మధురానుభూతులు, వేరిసి మానవత్వం అనే దారం తో ప్రేమ అనే తీపి సూదితో స్నేహం అనే పూలతో చివరికి మనమంతా అల్లుకున్నం.
అందుకేనేమో లోకం చాల చిన్నదంటారు... Aug 8 - 2011

-సన్యాసం పుచ్చుకున్న ఓ వ్యక్తి కషాయాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు గడించి. తన దేహాన్ని వదిలాడు. బ్రతికున్నంతకాలం ఎంత సుఖ పడ్డాడో తనకే తెలియాలి. అన్నివివరాలు తెలిసిన ఏమి చేయలేక ముక్కున వేలేసుకొని కునుకు తీస్తున్న మన గౌరవనీయులైన పెద్దలు.
మీడియా వాళ్ళు కూడా మరీను, తీగ లాగారు, డొంకను మరిచారు. వారైనా ఎంతని సాగదీస్తారు.. Aug 6 - 2011

ప్రతి రోజు శుబోధయమే.
డోర్ తీసి బయటికి రాగానే తులసి దర్శనం, దమనం గుబాళింపు, మూడు రంగుల చామంతులు, మొన్ననే ఇగురందుకున్న మంధర మొక్క, తన కౌగిట్లో కి తీసుకునేందుకు ఇంటిని కప్పుతున్న మామిడి చెట్టు, ఓరకంట చూసే సపోటా, ఈ స్వచ్చమైన గాలి తనదే అంటూ వేప చెట్టు, ఇంపుగా కనిపించే గడ్డిపూలు. అందుకేనేమో ఆఫీసు కి దూరమైన పర్వాలేదు కానీ ఈ శుబధయానికి దూరం కావాలని లేదు.. Aug 5 - 2011

మనసు చివుక్కుమంది పాత పేపర్లు కొనే తోపుడు బండ్లో భగవద్గీత ని చూసి.
అదే పనిగా చూస్తుంటే ముప్పై రూపయలికిస్తనన్నాడు.
100 రూపాయలు చేతిలో పెట్టి తీసుకున్నాను.
బరువెక్కిన మనసుతో భగవద్గీత ని సంచి లో పెట్టుకుంటూ నేను.
బరువు తక్కువైన నోటుని జేబులో పెట్టుకుంటూ తను. థాంక్ యు సార్ అంటూ వెళ్ళిపోయాడు. July 27 - 2011

సాగర సంగమం సినిమా చివర్లో స్టేజి పైన ముసలి వాడైన ఒక ఫైల్యులర్ ఆర్టిస్ట్
"ఆ బాలసుబ్రమణ్యం నేనే" అని చెప్పడంతో హాలు మొత్తం చప్పట్లతో మారుమోగుతుంది.
ఆ క్షణంలో పట్టలేని లేని ఆనందం తన కంట నీరు తెప్పిస్తుంది.
అలాంటి సన్నివేశమే నాకు ఈ రోజు {29 July 2011) హైదరాబాద్ సీలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటో ఎగ్సిబిషన్ లో నేను తీసిన ఈ ఫోటోను పలువురు పెద్దలు ప్రశంసిస్తుంటే కలిగింది.

ఫోటోగ్రఫి అనగా
ఒక వస్తువు, ఒక విషయం, ఒక స్థలం ఏదైనా కాని దానిలో బాహ్య మరియు అంతర్లీనంగా దాగిన పాత్ర (కారెక్టర్) ని గమనించి, ఆ పాత్రా యొక్క విశిష్టతని గొప్పతనాన్ని దానిలో దాగిన మహత్యాన్ని అనూభూతి చెంది, ఆ పిమ్మట సరికొత్త ఆలోచనతో సరికొత్త తరహాలో ఇతరులు ఊహించని విధంగా, భిన్నంగా అందరు ఒప్పుకునేలా చూపెట్టగలగడమే ఫోటోగ్రఫి.
Photography is Observing the outer & inner character of a Object, Subject, Place.
And feel its essence, Then come up with different approach & Present in a different way which is acceptable, convince most of the People.
ఎవరు ఏ ఫోటోని తీసిన అనుభూతి చెందే తీస్తారు అని మీరు అనొచ్చు. అలా అయితే ఈ మధ్య కాలంలో ఆరు వందల రూపాయల మొబైల్ ఫోన్ నుండి పాతిక లక్షల DSLR ప్రొఫెషనల్ కెమెరా వరకు మనకు లబిస్తున్నాయి. LKG చదువుతున్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు అందరు కూడా క్లిక్ మనిపిస్తున్నారు. ఇలా క్లిక్ మానిపించడమేన ఫోటోగ్రఫి అంటే.
అందరికి ఇష్టమే క్లిక్ మనిపించడం అల అయితే ఒక వాణిజ్య ప్రకటన కోసం తీసే ఫోటో కి ఆ ఫోటో ని తీసిన వ్యక్తికి ఆయా కంపెనీలు లక్షల్లో (నిజంగా లక్షల్లో) ఎందుకు పారితోషకం ఇస్తున్నారు.
మరి తేడా ఏంటి. ఇక్కడ మనం ఆలోచించ వలిసింది వ్యక్తినా? పరికరన్నా? పేరునా? డబ్బునా?
అన్నిటి కన్నా ముఖ్యమైనది సృజనాత్మకత. అదే గనక లేక పోతే, ఇవ్వన్ని ఉన్న ఏవి పనికిరానివే. ఎవరు కూడా సృజనాత్మకతని నేర్పించారు. అది ప్రతిఒక్కరిలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. దానిని ఎలా వెలికి తీయాలో నేర్పడమే గురువు యొక్క పని.
మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు మన మస్తిష్కం లో నీగూడంగ దాగి ఉన్నాయి.
మన కళ్ళతో చూసిన విషయాన్ని మనసు ద్వారా ప్రతిస్పందించి మెదడుకి ఉన్న అవగాహనతో నిర్ణయానికి వస్తుంటాం.
ఇది ప్రపంచం మొత్తం లో సాధారణంగా ప్రతి మానవునిలోను జరుగుతుంటుంది. ఈ అవగాహన మరియు ప్రతిస్పంధనల కార్యక్రమం అంత కూడా ఉన్న స్థలం మరియు పరిసరాల పై ఆధారపడి, కట్టుబడి, ప్రతి ఒక్కరికి వేరు వేరు గ ఉంటుంది.
ఉదాహారణకి ఒక కవి తన కంటికి కనిపించే అందాలని మనసుతో ఆస్వాదించి. తనకు ఉన్న సృజనాత్మకమైన కళతో, అవగాహన తోడుతో, దానికి అందమైన భాషనీ జోడించి కవిత రూపం లో వ్యక్త పరుస్తాడు. అది గనక ఎక్కువ మొత్తం ప్రజలని ఆకర్షింప చేస్తూ, ఆలోచింప చేస్తూ, ప్రభావితం చేయగలిగితే ఆ కవిత మరియు కవితని రాసిన వ్యక్తి కొన్ని కాలాల వరకు గుర్తుండి పోతారు.
అదే విధంగా మన కళ్ళతో చూస్తున్నదంత కూడా నిజంగా భ్రమే, మన కళ్ళకు కనిపించని మరో విషయాన్నీ, అంతరంగ కనులతో చూడగలిగి, అనుభూతి చెంది, మనకి మనం అంతర్లీనంగా ఒక గొప్ప శక్తిని పొందగలిగిననాడే, మనం మన ఆత్మతో యధార్ధాన్ని చూస్తున్నామని లెక్క. అప్పటి వరకు ఈ సాధారణ కనులతో చూసేది ఏదైనా భ్రమే.
ప్రతి వస్తువుని కూడా ఓ ఆత్మగ పరిశీలించి మనసుతో సంబాషించ గలిగిన నాడే మన ఆత్మ ప్రకృతితో లీనమైనట్టు. అదే అనుభూతికి భాషనూ చేర్చి పరికరం ద్వారా బంధించ గలిగాలి.
ప్రపంచానికి మనం అనుభవించి, అనుభూతి చెందిన విషయాన్ని చెప్పకనే ఆ చిత్రం చెప్పి చూపెట్టగలగాలి. ఆలా పలికే దృశ్యాలు ఎంత ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగితే అంత బాగా మనం ఫోటోను తీయగలిగామని అర్ధం.
"ఫోటోగ్రఫి అనుకున్నంత సాధారణ విషయమేమీ కాదు. అది ఓ అధ్బుతమైన కళ."
"ఒక కవికి, కళాకారుడికి, కళా పోషకుడికి మాత్రమే తెలుసు. నిజమైన కళ విలువ. ఆ విధంగానే ఈ ఫోటోగ్రఫి కళా పోషకులు కూడా ప్రపంచం మొత్తంలోనే కోకొల్లలు. మనసుని కొల్లగొట్టే చిత్రాలని లక్షలు పెట్టి కొనడానికి ఎప్పుడు సిద్దమే."
సరే అనుభూతి చెందాం. ఇతరులకు కనిపించని విషయం మన మూడో కంటికి కనిపించినదనుకుందాం. మరి దానిని ఇతరులు కూడా చూడగలిగి అనుభూతి పరచడం ఎలా?
ఒక అందమైన కవిత రాయడానికి భాష, పెన్ను, పేపర్ ఎలా ఉపయోగపడుతాయో.
సృజనాత్మకతతో కూడిన ఫోటోగ్రఫి అనే కళకి కూడా కెమరా అనే భాష తెలుసుకోగలగడం ముఖ్యం. ఆ భాషను పలికించే పరికరం సహాయంతో వ్యక్తపరచవచ్చు.
ఆ భాషకి ముందు భావం ముఖ్యం. అలాగే ఫోటోగ్రఫి నేర్చుకోవడానికి ముందు మనం భావాన్ని పసిగట్టగాలగాలి.
ప్రతి వస్తువులో, ప్రతి కణంలో, అణువణువులో కూడా అంతర్లీనంగా దాగిన విషయాన్నీ గమనించడం.
ప్రతి వస్తువుకి కూడా ఒక వేళ ప్రాణం ఉన్న వ్యక్తి అయితే అది ఎలా ఉంటుంది. దాని పనితనం, స్వభావం ఇంకా ప్రవర్తన, ఇలా బిన్న తరహాలో ఆలోచించడం మొదలు పెట్టాలి.
వస్తువుతో లీనం అయి. అది ఏ కోణంతో చూస్తే మనం ఊహించిన పాత్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రకంగ మనం చూసే విధానంలోనే మార్పు తెచ్చుకోగలిగితే మనకు తెలియకుండానే మనలో ఉన్న సృజనాత్మకత మేలుకుంటుంది.
ఒక విషయం మనం తెలుసుకుంటున్నామంటే ఆ విషయం లాజికల్ గ మన మెదడుని మనసుని సంతృప్తి పరచగలగాలి.
అప్పుడే ఆ విషయం చాల రోజులు వరకు మనలో ముద్ర వేసుకుంటుంది.
అదే విధంగా మనం తీసే ఫోటో కూడా లాజికల్ గ అటు మనసుని మెదడుని వీలైతే ఆత్మని కూడా సంతృప్తి పరచగలగాలి.
అప్పుడే మనం తీసే ఫోటోకి ఓ జీవితం దొరికుతుంది.

నిశీధ
నిశీధ నల్లని చీకట్లలో
సాయం సంధ్యాకాలంలో
మౌనంగా దాగిన నిశ్శబ్దాలలో వినిపిస్తున్నది కమ్మని గీతం.
ఆ గీతాల్లో రాగం సంగీతం, లయ, తాళం, పల్లవి, ఏవి లేవు, అయిన వినిపిస్తున్నది ఒక మౌనగీతం..
కనులు మూసినా, కనులు తెరిచినా అంతా చీకటి సర్వం చీకటి.
నాకు ఈ చీకటి తప్ప ఎం కనిపించట్లేదు ఈ క్షణంలో..
ఆలోచనలు మనసు అంచుపొరలను చీల్చుకుంటు మరి మరి పరుగెత్తుకుంటూ ప్రత్యక్షమవుతున్నాయి..
పెను తుఫానుల వేడి పవనాల గాలులతో ఆలోచనలు కలిసి చీకట్లతో యుద్ధం చేస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి ఆ మౌనగీతంలో.
కాని ఎటు చూసిన ఏమి లేదు. మళ్ళీ నిశ్శబ్దం మళ్ళీ శూన్యం.
మెల్లిగా మరోసారి కనులు మూసి ఏదైనా ఊహించేందుకు ప్రయత్నించా.
క్షణకాలపు ఊహ తెగిపోయింది మెల్లిగా తెరిచిన కను రెప్పతో.
దూరంగా అటునుండి ఏదో మేఘం మెల్లిగా పుట్టింది.
కొద్ది కొద్దిగా పురోగతి చెందుతూ పెద్దగా మారి పాయలు పాయలుగా చీల్చుకుంటు నిండుగా ఆకాశమంతా ఆవహించింది.
చిన్నగా మొదలై..
పెద్ద పెద్ద వెలుతుర్ల మెరుపులతో భయపెడుతున్నది.
చిత్రంగా ఉంది నేను భయపడలేదు.
చేతి మీద ఏదో పడ్డట్లనిపించింది, చూస్తే చిన్న చిన్న చినుకులు.
మెల్లిగా మొత్తం చినుకులమయమైంది.
కాళ్ళ కింద ఏదో పాకినట్టయింది.
కిందికి చూస్తే ఆశ్చర్యం. నీళ్ళు.. ఆ నీళ్ళల్లో మునిగిపోయాయి నా పాదాలు.
చిన్న చిన్న చినుకులు పోయి పెద్ద హోరుతో కుంభ వర్షం కురుస్తుంది.
కొద్ది కొద్దిగ నీరు పై పైకి వస్తోంది.. చూస్తుండగానే మోకాళ్ళనుండి నడుము వరకు చేరాయి.
వాటినే పరీక్షిత దీక్షతో మౌనంగా చూస్తున్నాను, చూస్తుండగానే మళ్లీ భుజాల వరకు, ఇంకా ఇంకా మీదకు వస్తూనే ఉన్నాయి.
అయిన మౌనంగానే చూస్తున్నా..
దూరంగా ఎవరో పిలిచినట్టు వినిపించింది.
అదేమి పట్టించుకోలేదు.
ఇంకాస్త పెద్ద స్వరంతో పిలుపు వినిపించింది.
కొద్దిగా స్తిమితపడ్డాను.
ఆకస్మికంగా నా భుజాలపై ఎవరివో చేతులు,
గుండెజల్లుమంది.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచా, ఆశ్చర్యం అపుడే తెలవారింది...

తెల్ల బూట్లు
సాఫీగా సాగుతున్న నా స్కూల్ ప్రయాణంలో ఆ గంబీరమైన రోజు రానే వచ్చింది.
"పిల్లలు ప్రతి శుక్రవారం వైట్ డ్రెస్, వైట్ షూస్ వేసుకొని రావాలి. మీ పేరెంట్స్ కి చెప్పి వెంటనే కుట్టించుకోండి. సరేనా.. "
"సరే.. టీచర్" అని నేను కూడా వంత పాడాను అందరు పిలగాండ్లతో...
ఇదే విషయం అమ్మకు చెప్పాను. "తెల్ల బట్టలా.." అని వెలితిగా చూసింది.
ఆ.. అవును తెల్ల బట్టలే.. వేసుకెల్లకపోతే పనిశుమెంటట..
చెప్పిన ఐదారు వారాలకు గాని కుట్టించలేదు. నాకు మా అక్కకి.
అప్పటి దాక శుక్రవారం వొస్తుందంటేనే ఎదోల అనిపించేది.
తెల్ల బట్టలైతే వేసుకొన్నాను. కాని తెల్ల బూట్లు మాత్రం రాలేదు.
ఒక సారి మాములుగా నిల్చోబెడితే మరో సారి గోడ కుర్చీ వేయించేవొళ్ళు. అప్పటి వరకు ఎప్పుడు పనిష్మెంటు అంటే ఎరుగని నాకు నా పరిధిలో లేని బూట్ల విషయం కోసం వేయల్సోచ్చింది.
అమ్మ కి అంతకు ముందే చెప్పాను, తెల్ల బూట్లు కావాలని. ఒక సారి చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్పడమెందుకని చెప్పలేదు.
గోడ కుర్చీ విషయం అమ్మ కి తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఇది కూడా చెప్పలేదు.
తెల్ల బూట్ల కోసం అందరు చూస్తుండగా దుఖ్ఖం దిగమింగుకొని తప్పు చేసినోడిలా తల కిందికేసుకొని గోడ కుర్చీ వేసేవోన్ని.
అప్పట్లో నాకు అర్ధం కాని విషయం నా పక్కన కూసునే వోల్లందరికీ వచ్చినట్టు నాకెందుకు రాలేదా ఈ తెల్ల బూట్లు అని.
సాధారణంగా శుక్రవారమంటే నాకు ఇష్టం. మా పాత స్కూల్ (ఏడో తరగతిలో స్కూల్‌ని మచిలిబజార్ నుండి ఉజిలిబెస్ కి మార్చినారు. ఇది ఐదో తరగతి నాటి మాట) ఎదురుగా కూలిపోయిన గోడలు ముళ్ళ చెట్లు దాని వెనకాల కాలి స్థలం అది మాబోటి పిలగాండ్లకి ఆటస్థలం. మట్టి గోడల పక్కనే మసీదు ఉండేది. ప్రతి శుక్రవారం మధ్యానం పూట నమాజు కోసమనే గల్లిలల్ల ఉన్న ముస్లీములంత లాల్చి పైజాములు వేసుకొని వొచ్చేటోల్లు. మొదటి అంతస్తులో మా క్లాసు. ప్రతి శుక్రవారం నమాజు, మైకు గొట్టం నుండి పెద్దగ వినపడేది. కిటికీ లోనుండి తొంగి చూస్తూ నమాజుకోచ్చిన జనాలని, దూరంగా ఉన్న గుట్టలని, కొంచెం వంగి చూస్తే రెండు చెట్ల గుట్ట (పెద్దవిగ ఉండడంతో ఆ పేరొచ్చింది. ఆ చెట్ల గురించి చాల కథలు కథలుగా చెప్పుకునే వారు), దానికి అనుకోని ఉన్న ఓ పెద్ద రాయి, వినాయకుడిని పెట్టె చోటు, అన్ని చూస్తూ ప్రశాంతంగ వీస్తున్న గాలి సవ్వళ్ళను ఆస్వాదిస్తున్న నాకు. రఘు వైట్ షూస్ వేసుకురాలేద అనడంతో చటుక్కున మెలకువ వచ్చి మల్లి దడ మొదలయింది. ఈ బూట్ల గొడవ తగిలిన కాడి నుంచి మనసు మనసులోనే లేదు. అనుకుంటూ, లేదు టీచర్ వేసుకురాలేదు. అని చెప్పాను, ఇంకేవరెవరు వేసుకు రాలేదు. అందరు వచ్చి గుంజీలు తీయండి. అని చెప్పడం తో నాకు తోడుగా మూడు డబ్బాల కాడి హరి, శంకర్ వచ్చాడు.
తల ఇరవై గుంజీలు తీసి, నాలో నేను కుంచించుకు పోతు గబుక్కున వచ్చి నా జాగా లో కూర్చున్న.
బెల్లు మోగడంతో పరుగుపరుగున అందరితో బాటు పుస్తకాల మూటని బుజాలకేసుకొని నిక్కరు సరి చేసుకుంటూ గబా గబా మెట్లు దిగి కింది కొచ్చి అక్కయ కోసం చూస్తూ నిల్చున్న..
కళ్ళలో నీళ్ళు తెచ్చుకుందేమో ఎదోల ఉంది. ఏమి మాట్లాడలేదు. ఇద్దరం కలిసి ఇంటి ముఖం పట్టాం. ఇంట్లో అడుగు పెట్టాకా గాని నోరుతేరవలేదు అక్కయ. ఉన్నపలానా ఏడుపందుకుంది. వైట్ షూస్ వేసుకురలేదని టీచర్ కొట్టిందని.
ఈ ఆదివారం చౌరస్తాకి బోయి కొందాం ఊరుకో అని చెప్పడం తో ఊరుకుంది. అక్కయతో పాటు నాక్కూడా కొనిస్తుంధిగా మళ్లీ నేనేడవడం ఎందుకు అనుకున్నాను.
తెల్లారితే శనివారం. ఆదివారం గురించి, చౌరస్తా గురించి, ఆలోచిస్తూ ఒక్క పూట గడిచిపోయింది. ఎందుకో నాకు ఊహ తెలిసినప్పటి నుండి హన్మకొండ చౌరస్తా అంటే ఎక్కడలేని అభిమానం నాకు, కొత్త బట్టలకి, కొత్త పుస్తకాలకు, మా చిన్నమ్మని బస్సు ఎక్కించేందుకు, స్టౌ బర్నాల్ రిపేరుకు, పళ్ళు కొనుక్కోవడానికి, గాజులు, వంట గిన్నెలు, ఇలా రకా రకాల కోసం చౌరస్తాకి మా అమ్మ నన్ను తోలుకుబోయేది.
ఎప్పుడైనా చౌరస్తాకు బోతున్నాం అని చెప్తే చాలు, మొఖం కడుక్కోచ్చుకొని చిన్నగా గుండ్రటి డబ్బాలో ఉన్న పౌడర్ని దూది పువ్వుతో మొఖానికి రాసుకొని తయారయ్యేటోన్ని.
అనుకున్నట్టుగానే ఆదివారం వచ్చింది. మొన్న మొదలయిన నా సంబరం, ఈ రోజుకి పెరుగుతూ పెరుగుతూ నాలుగింతలు ఎక్కువైంది. ఈ రోజు కొనే బూట్లని వేసుకెల్లడానికి శుక్రవారం ఎప్పుడేప్పుడువొస్తుంద అనేకాడికి చేరుకుంది నా సంబరం.
ఎప్పటి లాగే రోడ్డుకిరువైపు జరుగుతున్న, కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ, ఏవేవో ఆలోచిస్తూ, అమ్మ వేలుని గట్టిగ పట్టుకొని నిక్కరు సర్దుకుంటూ మూతి ముక్కు తుడుచుకుంటూ, నడుచుకుంటూ, ఇరవై నిమిషాలకు గాని చేరుకోలేదు చౌరస్తాకి.
ఎప్పుడు వెళ్ళే గడ్డం మూసలయన ఉండే చెప్పుల షాపుకి వెళ్ళాం. నా ముప్పై రూపాయల పారగన్ చెప్పులు, నా నల్ల బూట్లు వాటికి కట్టుకొనే దారాలు సాక్సులు గీడనే కొనుక్కున్నాం.
ముందు అక్కయ్య కోసమని చుపెడుతున్నాడు. చూస్తున్న కొద్ది ఎప్పుడెప్పుడు నాకు చూపిస్తాడ అని, నా చెప్పులు పక్కన విప్పి కాలి కాళ్ళతో నిల్చుని చూస్తున్న. అన్ని చూసిన కాసేపటికి ఒకటి సెలెక్టు చేసుకుంది అక్కయ.
ఇక నావంతుగ వెళ్లి పొట్టి బల్లపై కూర్చున్న అన్ని చూపిస్తున్నాడు. ఒకటి వేసుకున్నాను. ఆ మంచిగున్నాయ్ చాలు. అని చెప్పి, డబ్బల బెట్టి కవర్లో పెట్టి ఇవ్వు అని చెప్పి లేచాను.
ఎత్తు పట్టీల చెప్పుల వైపు చూస్తూ అక్క, నా సంబరం లో నేను, బెరమాడడంలో అమ్మ.
నాకు ఏమి వినిపించలేదు ఆ బేరాలు, కాని చివరకి ఒకటి మాత్రం చక్కగా వినపడింది. "ఆ చిన్న బూట్లు తీసేయ్ ఇప్పుడు డబ్బులు లెవ్వు" అని అమ్మ అనడం.
అప్పటి వరకు ఉన్న సంతోషమంత చప్పున ఆగిపోయింది. ఎం జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. కాని నన్ను మురిపిస్తూ ఊరించిన తెల్ల బూట్లు నాకు సొంతం కాలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క సారిగా అన్ని గుర్తొస్తున్నాయి. వెక్కిరిస్తూ గుంజీలు తీయమంటున్న టీచర్, ఒరిగి కూర్చున్న గోడ కుర్చీ, అదే బయంతో దడ పుట్టించే శుక్రవారం. ఎప్పుడొస్తుంద అనే ఎదురుచూపులు, క్షణంలోనే అయ్యో మళ్లీ వస్తుందా అనేస్తాయికి నేట్టుకున్నాయి నా ఆలోచనలు.
వేలాడదీసిన తెల్ల బూట్లు నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నాయి.
ఏంటో చిన్నప్పటినుండి "సరోజనమ్మ పిల్లలు చూడు తల్లి చెప్పినట్టుఇంటరు" అని వాడ వాడ మొత్తం కలిసి ఇచ్చిన బిరుదుని మోసుకుంటూ ఉన్న నాకు అది గుర్తుకురావడంతో ఎక్కడ ఆ బిరుదుని పొడగోట్టుకుంటానో అని, అమ్మ మా టీచర్ కొడుతది నాక్కూడా కావలి తెల్ల బూట్లు అని నోరు తెరిచి అడగలేక పోయా..
ఆయినా తనకి తెలియదా నాక్కూడా కొనాలని, డబ్బులు సరిపోలేదు అని నాకు నేను సర్దిపుచ్చుకుంటున్న కూడా,
లోలోపల దుఖ్ఖం తన్నుకుంటూ వస్తుంది.
వస్తున్న దుఖ్ఖంని దిగ మింగుకుంటూ బారంగా పడుతున్నాయి నా అడుగులు.
అమ్మ బుధరకిస్తూ ఏమోమో చెప్తుంది కాని ఒక్కటి కూడా వినపడట్లేదు.
అన్ని గల్లిలూ మూల మలుపులు తిరుగుతూ లక్కాకుల పద్మారావు దుకాణంకు ఆనుకొని ఉన్న ముసలవ్వ డబ్బా కిరాణంలో బెల్లంతో చేసిన ప్యాలాల ముద్దలు ఓ ఆరు కొని ఒకటి నాచేతి కిచ్చి మిగతావి దస్తి (కచ్చిఫు) లో మూట కట్టి, నడుచుకుంటూ వెళ్తుంటే, అరచేతిలో నిండిన ప్యాలాల ముద్ద కొరికాను, ఎందుకో రుచించలేదు, క్షణనికొకసారైన వోద్దన్న బయటికోస్తున్నాయి కన్నీళ్ళు.గబా గబా తుడుచుకుంటూ వెళ్ళాను. దుప్పటి ముసుగులో కన్నీళ్ళతో యుద్ధం చేస్తూ ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో తెలియలేదు.
మళ్ళీ శుక్రవారం రానే వచ్చింది. ఆ రోజు అర చేతిని తిప్పి మట్టెల మీద రూలు కర్రతో రెండు దెబ్బలు వేసింది టీచర్. ఉన్నపలానా బయటపడ్డాయి దిగామింగుకున్న కన్నీల్లన్ని. ఎవరికి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితికి సమాధానంగ కన్నేల్లె మిగిలాయి. ఇదే అవకాశంగ బావించి ఉన్న దుక్కన్నంత బయటికి కక్కాను. కక్కిన తర్వాత కాని మనసు కుదుట పడలేదు. ఈ సంగటన తర్వాత దుక్కన్ని దిగామింగుకోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురవుతుందేమోనని ఇప్పటి వరకు దేని పైన ఆశ పెట్టుకోలేదు.
అదే రోజు సాయంత్రం మా పిలగాండ్లంధరిని ఆటలాడించడానికి కాలి అట స్థలానికి తీసుకెళ్ళారు, తెల్ల బూట్లు లేని మమ్మల్ని వొదిలేసి.
సాధారణంగానే నేను ఆటలకి దూరం, ఆరోజుతో నాకు ఆటలంటేనే విరక్తి కలిగింది.
ఇంటికొచ్చాను దేని గురించి కూడా అమ్మకు చెప్పలేదు. అనాసక్తిగానే అన్ని పూర్తి చేసుకున్నాను. అక్కయ అన్నయతో పాటే బైరిశెట్టి సమ్మయ్య వాళ్ళింటికి టీవీ లో వచ్చే చిత్రలహరి చూడడానికి వెళ్ళాను. అది కూడా నచ్చక పోవడంతో ఇంటికొచ్చాను. త్వరగా ఇంటికి తాగొచ్చిన బాపుతో భయంతో గడపలేక గ్లాసుడు మంచినీళ్ళు తాగి మళ్లీ టీవీ కాడికెళ్ళ. చిత్రలహరి అయిపోయినాక ఇంటికెళ్ళేసరికి బాపు పడుకున్నాడు.
పుస్తకాల సంచిని ముందేసుకొని చూచి రాతలు పూర్తి చేసుకుంటుండగా గుర్తొచ్చింది. వారం క్రితం స్కూల్లో అడిగిన ప్రశ్న "పిల్లలు ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. మీరు మీ మీ లక్ష్యలేంటి" అని అడిగిన ప్రశ్నకు ఎవరికి తోచ్చినట్టు వారు డాక్టర్, లాయర్, పోలీసు అని చెప్తుంటే నేను మాత్రం ఇంకా ఏమి అనుకోలేదని చెప్పా. అది గుర్తొచ్చి అప్పుడు నిర్ణయించుకున్నాను "నా జీవిత లక్ష్యం తెల్ల బూట్లు కొనుక్కోవడమని". ఎక్కడ మరిచిపోతనోనని చూచి రాత నోట్ బుక్ లో రాసుకొని భద్రపరుచుకున్న ఆ లక్ష్యాన్ని ఆ బుక్కుని.
మా అమ్మ స్కూలుకొచ్చి ఫీసు కట్టినప్పుడు ప్రిన్సుపాల్ మాడంతో ఎం మాట్లదిందో ఏమో అప్పటినుండి ఏ టీచర్ కూడా తెల్ల బూట్ల గురించి అడగలేదు. స్కూల్ చదువు పూర్తయేంతవరకు కూడా తెల్ల బూట్లు కొనుక్కున్న దాకలాలు లేవు.
**
మొన్నీ మధ్య ఆ చిన్న నాటి చూచి రాత బుక్ తీసి చూసా.
బుక్ చివర్లో "తెల్ల బూట్లు కొనుక్కోవడమే నా జీవిత లక్ష్యం" అని రాసుకున్న మాటలు, ఇప్పుడు నవ్వు తెప్పించాయి.
ఆ తెల్ల బూట్లతో జీవితంలో చాల నేర్చుకున్నాను.
-దేని పై ఆశలు పెంచుకోకపోవడం,
-ఒకరిస్తారు అని ఎదురుచూడకుండా కష్టపడి సంపాదించుకోవడం.
-ఏదైనా ఉచితంగా దొరికితే, అంతే విలువైనదేదో నా నుండి దూరమైంధనో లేక దూరం కబోతున్నధానో అని నిర్ణయించుకోవడం.
-కోరుకున్న ప్రతీది తప్పక తీరుతుందనే ధైర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేర్చుకున్న..
సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత గడిచిన ఇన్నేళ్ళలో ఎన్నో తెల్ల బూట్లను నా కాళ్ళతో కసితో తోక్కేసిన, మొదటి సారి తొడిగినా ఆ తెల్ల బూట్లు కాసేపు మదిలో వేలాడి వెక్కిరించాయి..
Thursday, September 15, 2011 at 6:54pm

స్మరణ - My Second Short Story.
ఏదో అలజడి, అంతా చీకటి
కళ్ళు మూసుకునే ఉన్నాను.
మెల్లిగా కళ్ళు తెరిచాను అయినా చీకటే.
రెప్ప మూసినా చీకటే రెప్ప తెరిచిన చీకటే.
ఘడ నిశ్శబ్దం. నా శ్వాసే బిగ్గరగా అరుస్తున్నది నా చెవుల్లో.
ఈ నిశ్శబ్దం ఈ రోజుది కాదు, ఇది కొన్ని సంవత్సరాలనుండి అనుభవిస్తున్నదే.
ఇది నేను సృష్టించుకున్నదే.
గడిపిన క్షణాలన్నీ కాలం చేతిలో ఇంకి పోతు.
అన్ని క్షణాలు జ్ఞాపకాల పేరుతో మనసు వలలో చిక్కుకొని ఓ సారి గిలిగింతలు పెడితే మరో సారి మౌనంగా భాధపెడుతున్నాయి.
మనసు అంచులలో ఎన్నెన్ని అనురాగాలు. స్పురించే ఒక్కొక్కటి.
మొదట అమ్మ వొడి
నాన్న బిగి కౌగిలి
అమ్మమ్మ తాతయ్యల చెక్కిలి ముద్దులు
అన్నయ్య అక్కయ్యల దాగుడు మూతలు
బాబాయి పిన్నమ్మల ఆటవిడుపులు.
బుడి బుడి అడుగుల పరుగులతో
భయలుదేరిన పాటశాల ప్రయాణం.
మొదటి సారి కొత్తగా తెలుసుకున్న పదం స్నేహం.
ఊహ తెలియని తొలి తప్పుతో తొలి కన్నీటి చుక్క టీచర్ గారి బెత్తం దెబ్బ.
చిన్నగ మొదలు పోటి తత్వం,
నేను గొప్పా? నువ్వు గొప్పా?
కాదు నేనే గొప్పా..!
చెడుగుడు పందాలు. మొట్టమొదటి భాహుమతి ఒళ్ళంతా పులకింత.
నేనే సర్వమనే గర్వం.
అది తప్పు.. వివరించిన ఓ పెద్ద నేస్తం
నువ్వు జీవించే ప్రపంచం నీది కాదు.
ఇదే సర్వస్వం కాదు, ఇదే శాశ్వతం కాదు, ఇంకా ఏదో ఉంది. తపించు దానికి అని పలికే ఆ నేస్తం.
మమ్మల్ని వీడిపోయిన మనసులో మమ్మల్ని
గుర్తుపెట్టుకో అని రెండోసారి మనసు లోతుల నుండి వద్దనుకున్న వచ్చిన కన్నీటి చుక్కలతో వీడ్కోలు పలికిన
ఫేర్వెల్ డే..
కళాశాల అదొక కళల శాల
ఏదో పెద్దవన్నయ్యాననే గర్వం
అన్ని కళల కు నాంది.
అప్పుడే మొదలు ప్రతి ఒకటి
ఎంతో మంది కొత్త మిత్రులు,
గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలు పుస్తక రూపంలో పరిచయం.
వేష భాషలు, వినోద యాత్రలు, కాలక్షేపాలు,
చెడు తిరుగుళ్లకు మందలించిన మాష్టారు.
డిగ్రీ మధ్యలో స్కూల్ కెళ్తే.
హార్దికంగా చూపులతో
ఆర్ధికంగా నవ్వులతో పలకరింపులు.
అయినా పాటశాల రోజులే గొప్ప అని తెలుసుకున్న క్షణాలు.
చదువు అంతా పోటి, తట్టుకోలేనంతగా, ఊపిరి తీసుకోలేనంతగా, ఉరుకులు పరుగులు,
ఎంతకి అర్ధంకాని ప్రశ్న ఎంత దూరం ఈ ఉరుకులు పరుగులు.
ఒక్కసారే తళుక్కుమంది మెరుపుల తార నా తార.
సన్నటి నవ్వులు చిన్నగా పలకరింపులు మనసు మమతలతో
ఒకరి భావాలు ఒకరితో. ఎన్నో అందమైన క్షణాలు మా ఇరువురి దోసిల్లో
ఎన్నో మధురానుబుతులు పెనవేసుకున్నాయి మా ఇరువురి చిలిపి ఊహల్లో.
మేమే సర్వస్వం ఈ జగమంతా.
ఏకమవుదాం అనుకున్నాం. అప్పుడే అడ్డు కులమతాలు పట్టింపులు వ్యతిరేకత గొడవలు
మా ఈ జీవితం వ్యర్ధం అనిపించి ఇక్కడే ముగిద్ధామనుకున్నం.
ఛీ... మీరింత పిరికి పందలా ప్రశ్నించిన గొప్ప వ్యక్తి.
ఆర్ధిక సహాయం అంది మరో రోజు
ట్రైనెక్కాం... ఒక కొత్త చోటుకి...
కాస్త బిడియంతో కాస్త మౌనంగా
బొంబాయిలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్
కొత్త సంసారం, ఒక కుటుంబం
మొదలయింది నా వేట చిన్న ఉద్యోగం. చిన్న సంపాదన భారి ఖర్చులు.
పొదుపు పాటిస్తూ వెల్ల బుచ్చడం. చుట్టూ కొత్త బాష అంత కొత్తగా ఉంది.
నాకు తెలిసిన విద్యలతో రోజు ఏదో ఒకటి చేస్తూ నాతో పాటే నా భాగస్వామి..
నటన, వ్యాపారం రెండు సమపాళ్ళలో కలిపి చేసిన వంటకు ప్రతిరూపంగా నాలుగేళ్ళలో బొంబాయి లో సొంత ఫ్లాట్ అదొచ్చిన మరో యేడుకు ఓ బాబు.
ఇప్పుడు నా ఇళ్లోక నందనవనం.
చిత్ర సీమలో వేసిన నా అడుగులు మున్దేకే తప్ప వెనక్కి తీసే అవకాశం ఎన్నడు రాలేదు.
అంచలంచెల పేరుతో లెక్కలేనన్ని ఆస్తులు భూములు, షేర్లు, వ్యాపారం వాటితో పాటే శత్రువులు సెక్యురిటి.
నాకు తెలియకుండానే రకరకాల వేషాలతో నేను పరకాయప్రవేశం చేస్తూ నా మనసుకు నేను ఎప్పుడో దూరమయ్య.
ఆ క్షణంలో.
ఒకసారి నా వాళ్ళను వేత్తుక్కుంటూ నేను, తార, బాబు, సొంత ఇంటికి పయణం.
మసకగా చూసే నాన్నకి మసగ్గానే కనిపించింది క్షణకాలం పాటు గుర్తుకు రాని నా కొత్త రూపం.
అక్కున చేర్చుకొని రోదించింది అమ్మ..
మళ్ళీ ఆ ఇంట్లో ఆనందం. చుట్టాలు, బంధువులు, చిన్నమ్మలు, బాబాయిలు, అత్తమ్మ, మామయ్య, అన్నయ్యలు, అక్కయ్యలు, బావలు, మరదళ్ళు, అల్లుల్లు ఒకటే సందడి.
రెండు నెలలు, ఒళ్ళంతా పులకరింతలతో పండగలతో ఎంత సంతోషమో ఆ క్షణాలు.
ఇంత ఆనందానికి ఎందుకు దూరంయ్యననే నా ప్రశ్నకు సమాధానం నీ నిస్సహాయత అని బదులు పలికింది నా మనసు.
తోచిన సహాయం చేసి తిరిగి నా ప్రాపంచిక గృహానికి ప్రయాణం.
మార్గ మధ్యలో గోరా ప్రమాదం అయినా క్షేమంగా ఆసుపత్రుల్లో.
చుట్టూ పత్రికల హోరు, జర్నలిస్టులు, ఒకటే నలత.
నెల రోజుల్లో నిర్ణయానికొచ్చా సినిమాల నుండి వైదొలిగి, సేవ కార్యక్రమాలకే ఈ జీవితం అని ప్రకటించా. తార కూడా ఒప్పుకుంది.
మిత్రులే వద్దన్నారు. అయిన వినలేదు.
అబ్బాయి పై చదువులకు పొరుగు దేశానికెళ్ళాడు. తర్వాత డాక్టర్ అయి అక్కడే జీవిత బాగ్యస్వామిని ఎంచుకొని నా వద్దకు వచ్చి అంగీకారం తెలుపమన్నాడు.
వాడికి నాలాగా నా అనుకున్నవ్యక్తులందరు దూరం కాకూడదని ఒప్పుకొని పెళ్లి ఘనంగా అనుకున్న రీతిలో గొప్పగా చేశాను.
వాడి ఆలోచనలతో వాడికి తోచిన విధంగా జీవితాన్ని ఎంచుకోమన్నాను.
పది సంవత్సరాలు తీర్ధయాత్రలకు మరో పదేళ్ళు స్కూళ్ళు, ఆశ్రమాలు కట్టడానికి గడిచాయి.
ఉంది కాబట్టి పూర్తి చేసానన్న త్రుప్తి.
ఆయినా వెలితి
అంత అందరికే అన్నట్టుగా మేము ప్రశాంతం అనుకున్న చోటులో రోజులో గడుపుతున్నాము.
రాజకీయాలు నన్ను ప్రోత్సహించాయి.
ఆయినా వాటికి దూరంగానే ఉన్నా.
ఒకానొక అశుభ సమయాన తారకు గుండె నొప్పి రావటమే ఆలస్యంగా త్వరగానే నా ఒళ్లో కళ్లు మూసింది.
గుండెలో ఏదో భాద.
మూడోసారి నా కంటి నుండి రాలిన మూడ వేదన భాష్పాలు.
మరో కొత్త చోటు కొత్త లోకం మొదలు.
ఎక్కడి దాక ఈ జీవితం ప్రశ్నించుకుంటూనే ఆధ్యాత్మికం.
ఎందరివో గొప్ప వ్యక్తుల ప్రవచనాలు ఎంతగా నన్ను ఆకట్టుకున్నాయో.
భక్తి ప్రవర్తులతో పూజలు ధ్యానం నా జీవితం అయినవి.
నా అనుకున్న మిత్రులు బంధువులు కాలం చెల్లుతున్నారు. వారిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. నా టర్నేప్పుడో అని.
ఆయినా కంటి నుండి చుక్క నీరు రావటం లేదు.
అంత సహజం ప్రతీ సారి భగవద్గీత గుర్తుకొచ్చేది.
భంధం, అనుభంధం, చావు, పుట్టుక, ఏది శాశ్వతం కాదు.
అన్ని ప్రాపంచిక విషయాలే అని తోచెను.
చిన్నగా మటం ఏర్పరిచాను.
పాతిక మంది వేద విధ్యార్ధులతో చుట్టూ చెట్లు చేమలతో ప్రశాంతమైన వాతావరణం,
వేద గురువులు, వేద బ్రాహ్మణులూ, పూలు, పళ్ళు, పక్షులు, ప్రక్కనే కృష్ణుడి మండపం,
పండగలకు ఇతర శుభ దినాల్లో పూజలు, వ్రతాలు, అన్నదానాలు, భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్కటి.
నాకంటూ మిగిలిన డబ్బంతా మాటానికే వెచ్చించి రోజులో సగభాగం ధ్యానంలోనే.
మెల్లి మెల్లిగా చీకటి గదిలోకి అడుగుపెట్టా.
జ్ఞాన దృష్టికై ధ్యానం. నాకు తోచిన విధంగా రోజులు వేల్లబుచ్చుతున్నా.
నేను ఏర్పరుచుకున్నదే ఈ ఘాడ నిశ్శబ్దం.
చెదురు మదురు జీవితానికి చివరి రూపం ఏదో కాదు మౌనమే..
అంతా శూన్యం. శూన్యం లోనే ఉంది వెలుగు అదే దైవం కనిపించేదాక మనసులోతుల్లోకి ఆగని నా పయణం.
అందుకే ఈ ఏకాంతం.
నీవు కన్పించే వరకు ఈ చీకట్లే నా సర్వస్వం.
ఓ దైవం అనే రూపమా నీకై వేచి చూస్తూ
ఓ అల్ప జీవి..

శ్యామల
రఘు రఘు
వెనక్కి తిరిగి చూసాను, ఎవరో అర్ధం కాలేదు.
క్షణకాలం కష్ట పడిన చివరికి తన ఉంగరాల జుట్టు, చెవి దుద్దులని చూసి గుర్తుపట్టాను.
చాల కాలం, దాదాపు పదేళ్ళు దాటింది అనుకుంట మళ్ళి కనిపించింది శ్యామల.
పదేళ్ళలో జరిగిన మార్పంతా తన ఒంట్లో కనిపిస్తుంది.
బక్క పలుచగా, ఏమాత్రం కళ లేకుండా మారింది తన రూపం. చాల దీన స్థితి అలుముకుంది తన కట్టుబట్టల్లో.
కుడి చేయి వేలు పట్టుకొని వెంట్రుకలు సరి చేసుకుంటూ లంగా ఓని లో ఏడేళ్ళ పాప, చిముడుముక్కును తుడుచుకుంటూ ఎడం చేయి చంకలో నాలుగేళ్ల పాప తో నాకు ఇలా దర్శనం ఇస్తుందని ఎన్నడు ఊహించలేదు.
నను చూడగానే విప్పారిన కళ్ళతో, సంతోషపు నవ్వుతో ఎలా ఉన్నావ్ రఘు? చాల రోజులయ్యింది.
చాల సన్న బడినట్టున్నావ్. వెంటనే నువ్ కూడా చాల మారవు అన్నాను.
కాసేపాగి మళ్లీ ధర్మేంద్ర ఎలా ఉన్నాడు.
పర్లేదు.
దుబాయిలోన? ఇక్కడ?
ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాం.
కాసేపటికి మళ్లీ చొరవ తీసుకొని అంత క్షేమమే కదా అన్నాను.
చూస్తున్నావ్ కదా ఇలా ఉన్నాను.
ఏమని చెప్పను అంతా మారిపోయింది రఘు,
నాకు సర్వస్వం తానే అనుకున్న ధర్మకి అనుక్షణం నేను లోకువయ్యాను, అని చెపుతూ కర్చిపు తో కళ్ళు తుడుచుకుంది.
పిల్లల్ని చూసుకుంటూ బ్రతకడం తప్ప నాకు ఈ లోకంలో పెద్దగ బ్రతికి సాధించేది ఏమి లేదు రఘు. అని చెప్తూ భుజంపై గోర్లతో రక్కిన గాయాన్ని కొంగు తో కప్పుకుంటు తల కిందికేసుకుంది.
నా కళ్ళు తన ఒంటిపై ఉన్నకొన్ని మానుతున్న, కొత్తగా చేరిన గాయాలపై ఉన్నాయి. నాకు వినపడేలాగా ఇంకా ఏదేదో చెప్పింది కాని నాకు వినపడలేదు.
తనని ఎక్కువ సేపు అలా చూడలేక మళ్లీ కలుస్తానని చెప్పి అక్కడినుండి ముందుకు కదిలిన, నా కళ్ళు మాత్రం తన గాయల్లోనే నిలిచాయి
.
వడి వడిగ నా అడుగులు రేతిఫైల్ 38x 38ex బస్సులు నిలిచెచోటుకు సాగుతున్నాయి. చూపులు మాత్రం తన గాయాల మాటున దాగిన నిజమైన శ్యామల కోసం వెతక సాగాయి.
**
ప్రతి రోజు పట్టు లంగా, ఒత్తుగా పొడుగ్గా ఉండే రింగుల జుట్టుని సగానికి విడతీసి రెండు జడలని పాయలుగా అల్లుకొని మడిచి మాచింగ్ రిబ్బన్లను కట్టుకొని ఒకరోజు కనకాంబరం, మరో రోజు మల్లెపూలు, ఇంకో రోజు చిన్న చామంతులు, గులాబీ లు, మందార, బోడ్డుమల్లె, సెంటుమల్లె ఇలా ఏ రోజు కూడా తలలో పూలు లేకుండా కనిపించేది కాదు.
నుదుట టిక్లీ దానికింద రెండు బొమ్మల మధ్య చిన్నగా కుంకుమ, నుదురు మధ్యన అడ్డంగా చిన్న తెల్ల బొట్టు, కను రెప్పల నిండుగా చిక్కని కాటుక, చెవులకు దుద్దులు, ఒక్కోసారి ఊగుతూ ఉండే చిన్న కమ్మ బుట్టాలు చూపు తిప్పుకోలేని సుందర లావణ్యం తన రూపం, పేరు శ్యామలే కాని రంగు ఎరుపే. ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నననే గర్వం తన నానమ్మ చెప్పే మాటలతో తెచ్చుకుంది. మీసాల నరిసింహులు గారి ఒక్కగానొక్క కూతురు. ఎప్పుడు డాబు దర్పం చూపిస్తుండే వారు. దాదాపుగా పువ్వుల్లో పెరిగిందనే చెప్పుకోవాలి. తాతా గారి సంగీత కౌశల్యం శ్యామలని లక్ష్మి గారి ఎదురుగా సంగీత పీటమీద కూర్చోబెట్టింది. అందరితో ఎలా ఉండేదో ఏమో తెలియదు కాని, తను, నేను, శ్రావణి, హరీష్ మేమంతా కలిసుండేవాళ్ళం.
ఓ రోజు హరీష్ అరేయ్ రఘు శ్యామలని పెళ్లి చేసుకోవాలనుంది రా.
తనకి చెప్పావా,
చెప్పే ధైర్యం నాకు లేదు రా,
అని చెప్పడం తో తెలిసింది వాడికి ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదని.
నేను మరికొందరు ఇచ్చిన ధైర్యంతో ఓ రోజు భద్రకాళి గుళ్ళో ధైర్యం చేసి చెప్పాడు. ఎంత ప్రేమగా చెప్పాడో అంతకు వ్యతిరేకంగా సమాధానం వచ్చింది.
నువ్వంటే నాకు ఇష్టం లేదు హరీష్, నువ్వు నాకు సూట్ అవుతావ? సారి హరీష్ నాకు ధర్మ అంటే ఇష్టం. తను దుబాయి కి వెళ్లి కొన్ని రోజులకు నన్ను తీసుకెళ్తడంట.
నువ్వు కనీసం హైదరాబాద్ కూడా వెళ్ళలేవు. నన్నెలా చూసుకుంటావు.
ఇలాంటి బాధ పెట్టె మాటలతో భాధ పెట్టి, నిన్ను భాధ పెట్టినందుకు ఐ యాం సారి అని చెప్తూ వెళ్లిపోయింది.
పాపం నాకు ఆ క్షణంలో తప్పు ఎవరిదో నిర్ణయించలేక పోయింది నా మనసు.
ధర్మ వెళ్ళిన రెండేండ్లకు కాని తిరిగి రాలేదు. రెండేండ్ల వరకు హరీష్ శ్యామల కోసం తనను తాను మార్చుకొని తనకోసం తనకు తెలియకుండా ఎన్నో చేసాడు తన జ్ఞాపకాల తోడు తో.
చిన్న నాటి చూచి రాతల కానుండి, వాడి పోయిన పువ్వుల వరకు,
ఊడిపోయిన పక్క పిన్ను కానుండి, వెంట్రుకల వరకు బద్రంగా దాచుకునే వాడు, సినిమాల్లోలాగా.
నేను ఎన్నో సార్లు చెప్పి చూసాను వినలేదు. రెండేళ్ళ తర్వాత మళ్లీ తనపై ప్రేమను చంపుకోలేక అడిగాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని.
వద్దు హరీష్ ధర్మ నెల రోజుల్లో వస్తున్నాడు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని.
నేను చదువుకోవడానికి లండన్ వెళ్తున్నాను. నువ్వోప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మీ నాన్న ని ఒప్పిస్తాను నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను.
చాల మౌనం తర్వాత
వద్దు హరీష్, ఇప్పటికి నా మనసులో ధర్మ నే ఉన్నాడు.
తన తో మౌనంగా గడిపిన జ్ఞాపకాలను మూట గట్టుకొని హరీష్ లండన్ కెళ్తే,
ఏదో సాధించానన్న గర్వం తో వచ్చి వాలాడు ధర్మ దుబాయి నుండి.
హాయ్ రా ధర్మ ఎలా ఉందిర దుబాయ్?
దుబాయ్ కేంధిర మామ మస్తుగుంది. గీడేముంది సున్నా ఆడైతే మస్తు డబ్బులు. అని చెప్తున్నా వాడిని చూస్తే బహుశ మనసెందుకో వీడు చాల మారిపోయాడు అని చెప్పింది. ప్రతి మాటలో డబ్బు తప్ప ఇంకేం కనిపించలేదు.
కాంట్రాక్టు ఐపోయింది మామ పెళ్లి చేసుకొని మళ్లీ వెళ్దామని వచ్చాన్ర.
శ్యామలకి నువ్వంటే ఇష్టం రా, ఎందుకు ఇష్టం ఉండదు. ఎంతైనా దుబాయి లో ఉంటున్న కదా. పెళ్లి చేసుకుంట వీలైతే తీసుకెళ్త.
వీలైతే తీసుకెళ్త అనే మాటల్లోనే తెలిసిపోయింది శ్యామల మీద ప్రేమ ఎంత ఉందో.
చూడ్డానికి మంచి అందాగాడు, పొడువు కు తగ్గ శరీరం, బయటికి కనిపించే అందం మనసులో లేక పోవడంతో ఇప్పటికి వాడంటే నాకు సదాబిప్రాయం లేదు.
బక్క పలుచగా దొడ్డు కల్లద్ధాలుండే హరీష్ ని శ్యామలే కాదు ఏ అమ్మాయి ఎందుకు ఇష్టపడదో నాకు అర్ధమైంది. అలా అని అందరు ఆడవాళ్లు శ్యామలలాగ ఉంటారని కూడా చెప్పలేను.
ఒకానొక రోజు ధర్మ శ్యామల ఇంటికెళ్ళి పెళ్లి విషయం ధైర్యంగానే అడిగాడు. కుల పట్టింపులతో ఛి కొట్టాడు. ఏమనిపించిందో ఏమో. అంతే కోపంతో మరుసటి రోజు భద్రకాళి గుడి లో సమావేశం నేను ధర్మ, శ్యామల మరో కొందరు మిత్రులు,
మేము లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నం. అని చెప్పాడు ధర్మ.
ఈ నిర్ణయం ప్రేమతో తీసుకున్నాడ లేక ఎమోషనల్ గ తీసుకున్నాడో నాకు అర్ధం కాలేదు.
ఇప్పుడు లేచి వెళ్లి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పడానికి ప్రయత్నించలేక పోయా..
తనే సర్వస్వం అనుకుని బ్రతుకుతున్న శ్యామల కళ్ళల్లో తెలియని ఆనందం నా సలహాని చంపేసింది.
ధర్మాని ఒంటరిగా కలిసి అడిగాను నిజంగా నీకు తానంటే ఇష్టమేనా అని
ఇష్టమే మామ పెళ్లి చేసుకుంటాం. పెళ్ళైన మూడు నెలలకి నేను దుబాయ్ కెల్తాను వెళ్ళిన మరో రెండు నెలలకి తనని కూడా తీసుకెళ్తాను.
ఓ వారం తర్వాత శ్రావణి చెప్పే వరకు కూడా నాకు తెలియలేదు వారిద్దరు లేచి పోయి పెళ్లి చేసుకున్నారని. ఈ విషయం విని ఆశ్చర్యపోయాను. ఎం జరిగిందో ఎలా జరిగిందో నాకు కూడా తెలియక పోవడం నిజంగా ఆశ్చర్యమే.
**
దాదాపు మళ్లీ పదేళ్ళ తర్వాత తనని ఇలా చూస్తాననుకోలేదు.
నాకు వినపడేలా చెప్పిన మాటలని ఇప్పుడు మెల్లిగా వినపడసాగాయి.
గుళ్ళో పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో వాళ్ళ పిన్ని వాళ్ళింట్లో ఉంచి తను దుబాయ్ కి వెళ్ళాడు,
రెండు నెలలు కాదు గాధ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేసాడు.
ఉన్న డబ్బులతో బిజినెస్ బిజినెస్ అని తిరుగుతుండగా శ్యామల తల్లి చనిపోయింది, తను పోవడమే ఆలస్యంగా వారి నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు.
ధర్మ కలలకు విరుద్దంగా శ్యామల నాన్న కాని వీడి ఇంట్లో కాని ఎలాంటి ఆదరణ లేదు. ఎంత గొప్ప దుబాయ్ కరెన్సీ ఐన సమయమొస్తే కరగక మానదని చాల త్వరగానే తెలుసుకున్నట్టున్నాడు. ఎం లాభం అప్పటికే ఓ పాపా. పాపా వచ్చిన సంతోషంతో డబుల్ బెడ్రూం నుండి రెండు గదుల రూముకి ప్రమోషన్ తెచ్చుకున్నాడు. పెరుగుతున్న పాపకు సాక్ష్యం గ ఇరువురి మధ్య ప్రేమ అనే పదానికి అర్ధం తెలియకుండా గడపడం మొదలయ్యింది.
ఊహించని మార్పులకు గురైన ధర్మ తన మనసుతో యుద్ధం చేస్తూ తన అసహనాన్ని ప్రదర్శించే స్వాతంత్రం కేవలం శ్యామల దగ్గరే దొరికినట్టుంది. పాపం స్వాతంత్రం పేరుతో వ్యక్తపరిచిన తన భావాలు గాయాల రూపాన కంటికి ఇంపుగా కనపడసాగాయి శ్యామల ఒంటిపై.
పాపం తాను గీసుకున్న వృత్తానికి మంటలు అంటుకొని బయటికి రాలేక కాలిపోతు శ్యామల మరో బిడ్డకి జన్మనిచ్చింది.
అదే వృత్తంలో తనతో తో పాటు తన పిల్లలు. ఇక పిల్లలతో పాటు తను కాలిపోతు దీనంగా గడపడం తప్ప ఏమి చేయలేకపోతు, అగ్నికి ఆజ్యం పోస్తూ వీలుదోరికినప్పుడల్లో కొత్త గాయాలని పరిచయం చేస్తూ ధర్మ.
ఇక చివరికి ఈ సున్నయే గతి అన్నట్టు ఏదో కూల్ డ్రింక్ కంపనీలో ఓ నాలుగు వేల జీతానికి పనిచేస్తూ ఖర్చులకు తగ్గట్టుగా రెండు రూముల గదిని ఒక్క రూముకి కుధించుకొని కంపెనీ కి దగ్గరలో నే ఉంటున్నారు.
ఇరవైనాలుగేల్లలోనే జీవితమంతా అనుభవించిన శ్యామల జీవితం ఇక ముందైన సాఫీగా గడిచేలాగా దీవించమని భగవంతున్ని కోరుతూ ఇంటికి చేరుకున్నాను..

నా డైరీ లో ఓ చాప్టర్ - పాండిచెర్రి
చాల కాలం తర్వాత ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న తరుణం లో హైదరాబాద్ వీక్ ఎండ్ షూట్స్ ఆధ్వర్యం లో ఫోటోగ్రఫి ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది.
ఫ్రెంచ్ దేశపు సంప్రదాయం, తమిళ వంటకాల గుబాళింపులు, అంతకు మించిన సముద్ర తీరం, చక్కని ప్రశాంతత, ఇవ్వన్నిఒక ఎత్తైతే, ఒంటరిగా "నేను వేరు ప్రపంచం వేరు" అని భావించే నా మనసుకు మొదటి సారి కొందరి వ్యక్తులతో అది నాకు నచ్చి నేను మెచ్చే ఫోటోగ్రఫిని ఇష్టపడే వ్యక్తులతో కలిసివెల్తున్నాననే బలమైన కారణాలు నన్ను కూడా పాండిచేరి (పుడుచెరి) ప్రాంతానికి వెళ్ళడానికి ఉసిగొల్పాయి.
శుక్రవారం సాయంత్రం చార్మినార్ ఎక్ష్ప్రెస్స్ లో ప్రయాణం అని నాగరిగిరి కిషోర్ చెప్పడం తో ముందు రోజే కావాల్సిన (చాల తక్కువ బరువు ఉండేలా చూసుకోవడం నాకు ముందునుండే అలవాటు ఈసారి కూడా కేవలం భుజాలకు వేసుకొనే ఒక్క బాగ్ లోనే కెమేరాతో పాటు బట్టల) లగేజ్ సర్దుకున్నాను.
19th Aug 11 - Friday :
యధావిదిగానే ఆఫీసుకు చేరుకున్నాను. అడపాదడప ఉండే పనులతో మధ్యాహ్నం రెండు దాటింది. అప్పటికే వర్షం తన ప్రతాపాన్ని చూపడం తో కొంచెం గుబులుతో కూడిన దిగులు కలిగింది. మూడు గంటల ప్రాంతానికి ఎక్కడ లేని పనోక్కటి బాస్ నా నెత్తిన పెట్టడడం తో గంట సేపు ఎక్సెల్ లో కుస్తీలు పడి పూర్తి చేశా. అప్పటికే వికాస్ మొండెదుల రెండు మూడు సార్లు కాల్ చేసి
ఏమైంది బాబు ఎక్కడున్నావ్ అంటూ అవతలినుండి ప్రశ్న.
పని అనే సాలేడు వలలో చిక్కుకున్నాను. వలను దాదాపు తెంపేసుకోవడం ఐపోయింది. ఇక బూజుని దులుపుకొని రావడమే ఆలస్యం అని చెప్పి త్వరగా పని ముగించుకొని, మా ఆఫీసు కుడి పక్క KFC ని అనుకోని ఉన్న రోడ్ లో రెండో ఎడమ వైపు వీధి సందులో వికాస్ రూం కి చేరుకొన్నాను. అప్పటికే తార్నాక నుండి జొన్నలగడ్డ రాకేశ్ ఫోన్ చేసి నేను సికింద్రబాద్ రైల్వే స్టేషన్ కి బయల్దేరాను స్టేషన్ బయట రేతిఫైల్ బస్సు స్టాప్ దగ్గర వెయిట్ చేస్తాను అని.
వికాస్ దగ్గరికి చేరుకోగానే కెమెరా, లాప్ టాప్, లేన్సేస్, డ్రెస్సులతో ఓ అతి పెద్ద బాగ్ సిద్దం చేసుకున్నాడు. ట్రైపాడ్ ఒకటి చేతిలో పట్టుకొని హడావిడిగా ఆటో లో ఐదు గంటల ప్రాంతాన బయల్దేరాం. ట్రాఫిక్ చెధను చీల్చుకుంటూ సాగిన మా ప్రయాణంతో ఆరున్నర ప్రాంతాన చేరుకున్నాం సికింద్రబాద్ స్టేషన్ కి.
నాంపల్లి లో ఎక్కిన కొందరు, సికింద్రబాద్ లో మేము మిగతా వాళ్ళం రెండు మూడు స్లీపర్ గూడుల్లో అడుగుపెట్టాము. నాతో పాటు ఇరవై మంది. కొందరిది హైదరాబాద్ అయితే మరికొందరు వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన వ్యక్తులు అందరుకూడా సరైన సమయానికి చేరుకోవడానికి చాల కష్టపడినట్టు కనిపించింది. ఒకరిద్దరు తప్ప అందరుకుడా పాతిక నుండి ముప్పై లోపు యువతీ యువకులం, కావలసిన భోజనపు సరుకులతో మాకు కేటాయించిన బోగిల్లో కూర్చున్నాం. మెల్లిగా కదిలిన చార్మినార్ రైలు తో పాటు, ప్రయాణం అయ్యాయి మా ఆలోచనలు పాండిచేరి అందాన్ని ఊహిస్తూ.
నా పేరు రఘు మందాటి అని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ చంద్ర శేకర్ సింగ్ వారి సతిమని, కిషోర్ నగరిగిరి వారి సతిమని, శివ శంకర్ రావు, వికాస్ మొండెదుల, హేమంత్, రాకేశ్ జొన్నలగడ్డ, దర్శన్ ఖన్నా, హర్ష మిట్టల్, చైతన్య, సంగీత, విజయ్ బండారి, సందీప్ వేముల, ఆశిష్ నూకల, వంశీ ఆర్థం, సతీష్ లాల్ అందేకర్, నాగరాజు, అవినాష్ కాలే.
మూడు బోగిల్లో వ్యక్తులమంత ఒకే చోట చేరి ఒకటే అల్లరి కేరింతలు, పాపం వయసుమరిచి చేసిన మా కేరింతలు పక్కవారికి కాస్త ఇబ్బంది కలిగించిన కాసేపటిలో అందరు ఎంజాయ్ చేసారు.
నేను మాత్రం వీడియో కెమెరాను మెడలో వేసుకొని అందరి హావభావాలను రికార్డు చేస్తూ, ఎప్పటిలాగే ప్రతి ఒక్కరిని లోతుగా గమనించడం మొదలు పెట్టాను. ఎన్నో చిత్ర విచిత్ర విషయాలు నా మనసును దోచాయి. ఒక్కొక్కరి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రతి ఒక్కరు తమ మనసు మాటకు విలువ ఇచ్చి తమ మనసుకు ఆనందం కలిగించే విషయం కోసమే ఆరాటపడడం. ఇరుకు జీవితపు రణగోణ కాలం లో ఒక్క రోజైన మనసుకు నచ్చే విధంగ ప్రశాంతంగా గడపాలనే కోరిక వారందరిలో కనిపించింది.
బయటికి అందరితో కలివిడిగా ఉన్న అంతరంగాన ఎన్నెన్నో మధుర భావాలతో కూడిన సృజనాత్మకమైన ఆలోచన సంద్రాల సమూహం ప్రతి ఒక్కరిలో కనిపించింది, ఏ ఒక్కరిని కదిలించిన, మనసుకు నచ్చే మరియు నాకు తెలియని ఎన్నో నిగూడ విషయాలు, వారి వారి ఆలోచనలు అన్ని కూడా చూస్తుంటే ఒక సామెత గుర్తొచ్చింది. ఒకే జాతి పక్షులు ఒక గూటికి చేరుతాయి. మేమందరం కూడా ఈ స్లీపర్ గూడులో ఒకర్నొకరం కలుసుకున్నాం.
తెచ్చుకున్న బిర్యాని ప్యాకిట్లు విప్పి తింటుండగా, ట్రైన్ వరంగల్ లో ఆగింది. సందీప్ వేముల పుణ్యమా అని వారి అన్న గారు తీసుకొచ్చిన బోజనాన్ని అందుకొని వేజిటేరియన్ వ్యక్తులం అంత కలిసి తినేసాము, కేరింతలు ముగిసిన కాసేపటికి ఒక్కొక్కరం నడుం వాల్చాం.
20 Aug 11 - SATURDAY :
ఇప్పటికి చాల సార్లు వెళ్ళాను చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కి. చూసిన ప్రతిసారి ఎందుకో కొత్తగా అనిపిస్తుంటుంది. బహుశ చెక్కు చెదరని గోతిక్ కట్టడపు విధానం రాజభవనంలా తలపించే వంపు స్థంబాలు. అల చూస్తూ బయటికోస్తుండగా శరవన్ హోటల్ మా ఆకలి జిహ్వని ప్రేరేపించడంతో ఆగకుండా నేను మాత్రం సాంబార్ ఇడ్లీ, మేతి ఇడ్లీ, లాగించాను, ఎవరికీ వారు వారికి నచ్చిన వాటితో అల్పహారాన్ని పూర్తి చేసారు.
బయటికొచ్చి పక్కనే ఉన్న బస్సు స్టాప్ లో బస్సు ఎక్కాం పుడుచేర్రి(పాండిచేరి) బస్సు దొరికే చోటుకి (సెంట్రల్). కిక్కిరిసిన బస్సు కిటికీ గుండా వెనక్కి వెళ్తున్నతమిళ వీధుల్ని రోడ్డుని, ఇరుపక్కన ఉన్న దుకానాలని, షాపింగ్ మాల్స్ ని చూస్తూ సాగింది మా ప్రయాణం. దాదాపు అరగంట ప్రయాణంలో నేను చెన్నై లో కాకా హైదరాబాద్ లో ఓ లోకల్ బస్సులో ఉన్నాననే భావనే కలిగింది.
ఒక AC బస్సులో సీట్లని వెనక్కి నెట్టి ఆసీనులమవుతుండగా రజినీకాంత్ తమిళ్ మూవీ శివాజీ తో మొదలైన మా ప్రయాణం మధ్య మధ్యలో ఎడమవైపున మా చూపులను బంధించిన సముద్రం. ఒక చోట ఆగి స్నాక్స్ తీసుకొని మళ్లీ సినిమా పూర్తయ్యాక గాని చేరుకోలేదు పాండిచేరి.
దాదాపు నాలుగున్నర ప్రాంతాన చేరుకొని, ఒళ్ళు విరుచుకొని, లోకల్ టాక్సీ తోడుతో మిషన్ స్ట్రీట్ కుడివైపు సందులో హోటల్ కొరోమండల్ కి చేరుకున్నాం. ఫ్రెంచ్ కట్టడపు గుబాళింపు, అందమైన రంగు రంగు వర్ణ చిత్రాలతో, కరెంటు దీపాల వాలు సెట్టు తో, కళాత్మకమైన చెక్క బొమ్మతో, మనసుకు ఇంపుగా కలిగింది, మెట్లెక్కి 202 నెంబర్ రూంలో కాస్త సేద తీరి, మెల్లిగా బయటికొచ్చి హోటల్ లో ప్రతి గదిలో ప్రతి గోడకి, ఇవతల అవతల దాదాపు పాతికకు పైగా ఉన్న అందమైన వర్ణ చిత్రాలను చూసి అబ్బురపోయాను. గత కొన్నేళ్లలో నేను విడిది చేసిన హోటల్స్ కి దీనికి చాల తేడా ఉంది. ఆ తేడా నను అమితంగా ఆకట్టుకుంది. బాల్కని లో గాలి తగిలే విధంగా ఏర్పాటు చేసిన పూల కుండీలు, కుర్చీలు, టెర్రస్ పైనుండి చూస్తే కనిపించే చర్చి, అతిపెద్ద వీధి దీపపు స్థంబం. చెప్పుకుంటూ పోతే హోటల్ లో మేము గడిపిన ప్రతి క్షణం మరిచిపోలేనిది.
కాస్త వేడి ఎక్కువగానే ఉన్న చికాకు మాత్రం కలగలేదు.
అందరం ఐదున్నర ప్రాంతాన బయటికొచ్చి మా కెమరాలకి పని పెడుతూ వీధులన్నిటిని తెరపాగా చూస్తూ కుడి పక్కన సెయింట్ సి.ఎస్.సి. చర్చి కు ఎదురు విక్టర్ సిమోనేల్, రోమన్ రోలాండ్ పేరు గల వీధులను చూస్తూ చెప్పులు కుట్టే వ్యక్తులు, ఆటో రిక్షాలను చూస్తూ, ఆడ మగ, వయసు తో తేడా లేకుండా అందరు సైకిల్ నే ఆశ్రయించిన తీరు బాగా నచ్చింది, విశాలమైన చక్కని వీధి దారులను, పార్కుని దాటుతూ, నాలుగు వీధుల మూల మలపులు తిరగ్గానే చేరుకున్నాం సముద్ర తీరానికి. దానికి అనుకోని ఉన్న "లే కాఫీ" పేరుగల హోటల్ ఒకటి రోమన్ మరియు ఫ్రెంచ్ కట్టడం ల తలపిస్తుంది. సముద్ర తీరాన రక రక ల వయసు వ్యక్తులు, ఒక్క క్షణం నేను ఇండియా లో లేను అని తలపించేలా విదేశీయుల సమూహం, చుట్టూ ఉన్న జనాలను, తీరానికి అనుకోని ఉన్న బ్రిడ్జ్ చివర్లో, స్నాక్స్ అమ్ముతూ కనిపించే చిల్లర కొట్లు, పిల్లలు, ప్రేమ జంటలు, యాత్రికులు, ఇక ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సముద్ర అలల తీరాన్ని మౌనంగా చూస్తూ ఆనందించడం తో మాకు తెలియకుండానే వీధి దీపాలు వెలిసాయి. మేము ఇరవైమంది ఎవరి తోచిన చోటుకి వేరు పడి తొమ్మిదిన్నర ప్రాంతాన వెనుతిరిగి మిషన్ స్ట్రీట్ లో ఎవరికి తోచిన హోటల్ లో వారు బోజనాలు కానించారు . నేను మాత్రం రెండు పరోటలు ఒక చపాతీ లాగించి తిరిగి హోటల్ గది కి చేరుకున్నాం. పదిన్నర ప్రాంతాన కురిసిన వాన జల్లులతో వాతావరణం అంత హాయి గోలిపింది.
వర్షంలో పిల్లల్లాగా తడుస్తూ గేన్తులేస్తూ డాన్సు చేస్తున్న దర్శన్, హర్ష్, సందీప్ లను కాసేపు కెమెరా లో బంధించి నేను గదిలో నిద్రకు ఉపక్రమిస్తుంటే కొందరు మాత్రం ఈ చల్లని హాయి లో కాఫీ రుచిని ఆస్వాదించల్సిందేనని లే కఫ్ఫే కి బయల్దేరారు. ఆప్పటికే అలిసిన నేను నిద్రలోకి జారుకున్నాను.
21st AUG 11 - SUNDAY :
రాకేశ్ లేపడంతో ఇప్పుడేగా కళ్ళు మూసాను అప్పుడే తెలవారిందా అనుకుంటూ లేచాను. అప్పటికే మా కోసం సిద్ధం చేసిన బస్సులోకి ఐదున్నర ప్రాంతాన అందరం చేరుకోవడంతో మొదలైన మా ప్రయాణం కిటికీ వారగా చూస్తూ నిలువెత్తు వింత వింత రాజకీయ కటౌట్ లు చూసి వెర్రిగా నవ్వుకుంటూ,
మనస్సులో స్థానం మనుషుల్లోకేల్లి వారి కోసం ఏమైనా చేస్తే సంపాదించుకుంటారు అంతే కాని అడుగడుగు వింత వింత హావ భావాల్లో రంగులు పూసుకొని పోజులిచ్చిన కటౌట్ లు రోడ్డు కిరువైపులా పెడితే దొరకదన్న విషయం వారికి ఎపుడు తెలుస్తుందో.
దట్టంగా కమ్ముకున్న మేఘాల ముసుగులో భానుడు దాక్కోవడంతో ఇంకా చీకట్లు ముసురుకొనే ఉన్నాయి. సముద్ర తీరానికి కొంచెం దూరం లో మా బస్ ఆపడంతో చల్లగాలుల్ని సముద్రపు అలల్ని వీక్షించేందుకు బస్సు దిగి నెమ్మదిగా అడుగులేస్తూ పాదానికి ఇసుకకు అడ్డంగా ఉన్న చెప్పులని విడిచి మెత్తగా తగులుతున్న ఇసుకలో అడుగులేస్తూ, కుడి పక్కన నల్లగా నిగనిగ లాడుతున్న రాళ్ళు ఎడం పక్కన విశాలమైన సముద్రం దానికి అనుకోని ఉన్న తీరం అన్నిటిని అలవోకక చూస్తూ వీస్తున్న చల్లని గాలులు నా చెవుల్లో గిలిగింతలు పెడుతుంటే ముసురు చీకట్లో మెరిస్తున్న నీలి వర్ణం మనసుని హత్తుకుంది.
తీరానికి చేరుకుంటున్న తెప్పలు, అలలతో దోబుచులాడుతున్న పిల్లలు, సముద్రంపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న జాలర్లు, ప్రశాంత జీవనాన్ని కోరుకొని పోరుగుదేషలనుండి వచ్చి సేద తీరుతున్న విదేశీయులతో వాతావరణం అంత వింత హాయిగా తోచింది.
కాసేపటికి బస్సు లోకల్ గ దొరికే ఏదైనా వంటకాలను రుచి చేద్దామని ఓ కాకా హోటల్ దగ్గర నిలిపాడు. ఇష్టమైన పొంగల్ ని కడుపార తినేసి, మెల్లిగా సాగుతున్న మా ప్రయాణం పారడైస్ బీచ్ కి చేరుకుంది. అది ఇంకా తెరుచుకోలేదు, సముద్ర తీరానికి చేరుకోవాలంటే, మధ్యలో ఓ నది తీరాన్ని దాటాలి అది ఓ పడవ ద్వారా, పడవలు నిలిచే చోటు ఓ అందమైన గార్డెన్ మరియు పిల్లలు ఆడుకునే ఆట స్థలంకి అనుకోని ఉంటుంది. అదే గార్డెన్లో కాసేపు పిల్లల లాగా ఆడుకొని సమయం కావడంతో అందరం కూడా బోటు లో ఎక్కి మెల్లిగా నదిని దాటుతూ, దూరం గ ఉన్న దట్టమైన చెట్ల పొదళ్లను చూస్తూ పరిగెడుతున్న బోటు వెలుపలకి చేయి పెట్టి నీళ్ళను అందుకుంటూ ఆడుకుంటూ, నది ధాటి ఒడ్డుకు చేరుకున్నాం. విశాలమైన ఇసుకప్రాంతాన్ని దాటుతూ సాగర తీరానికి చేరుకున్నాం. అందరం తమ తమ లగేజిని ఒక పక్కన పెట్టి ఇసుకపై ఆటలాడుతూ కేరింతలు కొడుతూ పరగులు పెడుతూ అలలను డీకొడుతూ ఆడుతుంటే ధృశ్యాన్నంత బంధించడం ఇక నా పనైంది.
కాసేపటికి ఆగని మనసు కోరికను ఇక ఆపుకోలేక, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిలువెత్తు అలలని డీకొనాలని యుద్ధానికి సిద్ధమైన యోదిడిలా అలతో తలపడేందుకు పరుగులుపెడుతూ దుమికాను, చిన్న పిల్లాడి రెక్క పట్టి పక్కన కుర్చోబెట్టినట్టు నన్ను ఆ సాగరం ఒక్క అలతో చాల సునాయాసంగా తీరం వైపుకు నెట్టింది.
ఉప్పు నీటిని తొలిసారి ఆస్వాదించాను. నేను ఈ ప్రకృతికి లీనమైనట్టు నా మనసు ప్రకృతిలో సగాభాగమై నా ఆణువణువూ సాగరంలో లీనం చేస్తూ, నాకు సాగరానికి మాత్రమే తెలిసిన ప్రణయ కలాపాలతో జరిపిన చిలిపి యుద్దాలు మాటలకు అందనివి.
మూడు నాలుగు గంటల మా ఆటలు ఆకలికి చేరువడంతో ఆపక తప్పలేదు. స్నానాలు కానించి బట్టలు మార్చుకొని తీరానికి ఆనుకోని ఉన్న పెద్ద గుడిసెలో అందరం కూర్చొని భోజనాలు కానించాం. కేసర్ స్వీట్ కాస్త నచ్చింది. వెన్నక్కి తిరిగి మరి సాగరానికి టాటా చెపుతూ నదిని దాటుతూ మల్లి బస్సులోకొచ్చి కూర్చునే సరికి పన్నెండు దాటింది. అటునుండి నేరుగా రూం కి చేరుకొని మల్లి ఫ్రెష్ అయి బాల్కనీ లో జర్మనీ నుండి విచ్చేసిన ఫ్రైడరిక్ మరియా తన మిత్రురాలితో జరిగిన సంబాషణలో రంగు రూపు వేరైనా నా లాగే ఆలోచించడం నాకు బలే అనిపించి పేస్ బుక్ లో తనని ఆడ్ చేసుకొని. వడి వడి గ అందరం కిందికి దిగి మల్లి బస్సులోకి చేరుకొన్నాం.
మతం ఒక వ్యక్తికి సంబంధించిందా? మనసుకు సంబంధించిందా? మెదడుకి సంబంధించిందా?
ఆధ్యాత్మికం అంటే నన్ను నేను తెలుసుకోవడమే నన్ను నేను గుర్తిన్చుకోవడమే కానీ మరొకటి కాదనే నా ఆలోచనలను బ్రేక్ వేస్తూ బస్సు అరబిందో ఆశ్రమానికి చేరుకుంది.
కెమెరా, సెల్ ఫోన్ కి అనుమతి లేదనడంతో బస్సులోనే పెట్టి చెప్పులనుకుడా వదిలి, నిశ్శబ్ధమైన ఆశ్రమం వీధిలోకి వెళ్తుంటే సముద్రం చివరన దొరికే పూసలు, రకరకా చిప్పలతో తయారు చేసిన దండలని విదేశీయులను ఆకర్షించడానికి వాటి గురించి వివరిస్తూ అమ్ముకునే వాళ్ళు విరివిగా కనిపించారు. ఆశ్రమం లోకి అడుగుపెట్టగానే కమ్మని సుగంధం ఆకట్టుకుంది కుడివైపునుండి ఇరుపక్కల చక్కగా పెరుగుతూ గలగలా నవ్వుతున్న పూలమొక్కలని చూస్తూ యోగి సమాధిని చేరుకున్నా, అందంగా పూలతో తీర్చిదిద్దారు ఆ చోటు మొత్తం.
ప్రశాంతం ఆవహించినా ఆచోటులో పది నిముషాలు నన్ను నేను ధ్యానం లో ముంచేసుకున్నాను.
మెల్లిగా కళ్ళు తెరిచి నిశబ్దంగా అడుగులువేస్తూ, పుస్తకాలగధిని, చిత్ర పటాలున్న గదిని, చూస్తూ పక్కనే ఉన్న విన్జెంజ్ అనే జర్మన్ వ్యక్తి తో పరిచయం తనకు ఆశ్రమానికి పాండీ కి ఉన్న అనుబంధం నను ఆకట్టుకుంది. నలబై ఏళ్ళుగా ఇక్కడే మిషన్ స్ట్రీట్ రెండో విధిలో ఉంటున్నామని, సునామిని తన కళ్ళ ఎదురుగా చూశానని, అంత పెద్ద సునామి ఈ ప్రాంతాన్ని ఏమాత్రం హాని చేయకపోవడం వెనకాల దాగిన మర్మాన్ని చాల ఉద్విగ్నంగా చెప్పుతున్న తీరుతో ఆ చోటు మరింత అందంగా తెలియని ఓ అధ్బుత రహస్యంగా తోచింది.
ఈ చోటు మీకెందుకు నచ్చింది అనే ప్రశ్నకు సమాధానం "ఐ లైక్ ఇట్" అని చెప్పాడు అంతే.
బయటకు అడుగుపెడుతుంటే ఆరడుగుల ఆజానుబాహుడు త్రిస్టన్, తనకన్నా అంగుళం తక్కువున్న అనస్తాసీ అనే యువతీ పరిచయం అయ్యారు.
వారితో గడిపిన అతి కొద్ది సంబాషణ నాకు చిత్రం గ తోచింది.
వారికి రంగు, రూపు, దేశం, మతం, అనే భావనలు లేవు అంత ఒకటే ఏ సరిహద్దు తమని కట్టడి చేయలేవు.
పెళ్లి గురించిన చర్చకు, పెళ్లి అనేది కేవలం ఒక తంతు మాత్రమే కలిసి కాపురం చేయవలసినవి రెండు మనసులు. పదిహేనేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చాం అప్పటి నుండి మేము ఇప్పటి వరకు కలిసే ఉంటున్నాం ఉంటాం. అని పలుకుతున్న మాటలకి చక్కని పలువరుస పట్టుకుంటే కంది పోయే పాల చర్మంతో నవ్వుతు కనిపించింది అనస్తాని. తను కూడా తనతో ఏకీభవించి యస్ మేము కలిసే ఉంటాం. అని మెరుస్తున్న కళ్ళకి అడ్డుపడుతున్న సన్నని కురులని పక్కకు నెడుతూ చెప్పింది.
మీరు ఇక్కడ ఉండడానికి కారణం అనే ప్రశ్నకు వారిద్దరు ఇచ్చిన సమాధానం వీ లైక్ ఇట్.
ఆశ్చర్యం.. నా చుట్టూ ఉన్న ఒక్కొక్కరు, ఒక్కో రకంగ ఉన్న చివరికి ప్రతి ఒక్కరు కోరుకుంటుంది కేవలం మనస్త్రుప్తి.
పరి విధాల ఆలోచనలతో బస్సులో లో ఉన్న కెమరా ని మేడలో వేసుకొని ఏదో తీయడానికి ప్రయత్నించా కాని కెమరకి చిక్కని అందమేదో ఆ వీధుల్లో ఉంది. దాన్ని బందించలేక పోయా.
ఆశ్రమం మొత్తం ఫ్రెంచ్ కట్టడాన్ని తలపించిన భారతీయ వాస్తు సువాసనలు ఆణువణువూ వెదజల్లుతున్నాయి.
బయట వీధిల్లో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఆపి ఇది వి ఐ పి లు ఉండే చోటు ఇక్కడ ఫోటోలు తీయకండి అని వారించారు.
పాపం వి ఐ పి అనబడే వారు నా కెమరాని మాత్రమే ఆపగలరు, నా మనసు కన్నుని కాదనే విషయం బహుశ పోలీసు వారు తెలుసుకోలేకపోయారు.
షాపింగ్ లో బిజీ ఐపోయి ఆలస్యంగా బస్సు దగ్గరికి చేరుకున్న రాకేశ్ రాకతో అందరం బస్సు ఎక్కడంతో మొదలైన ప్రయాణం వీధుల్ని, రహదారులని, సిటీ ని దాటుకుంటూ, చిన్న పల్లెని టౌన్ లని చూస్తూ ఆరోవెల్లి వైపుకు సాగింది.
పాత సీసకు కొత్తరంగు పులుముకున్నట్టు, వంద రెండు వందలకు అద్దెకు దొరికే మోటార్ సైకిల్, మోపెడ్, లూన, బ్యాటరితో నడిచే స్కూటర్ ల పై విదేశీయుల ప్రయాణం కొంచెం వింతగా కనిపించింది.
సందీప్ వేముల తీసుకొచ్చిన జంతికలతో, మిగతా వాళ్ళు తీసుకొచ్చిన స్నాక్స్ తో, జోకులతో, నిద్రతో సాగుతున్న ప్రయాణం మధ్యలో మత్రిమందిర్ మెడిటేషన్ చాంబర్ వద్ద ఆగింది. కొన్ని ఎకరాల్లో ఏర్పాటైన ఆ ప్రాంతం అంత పచ్చని చెట్లతో, చక్కని వాతావరణం తో నిండింది. పిల్ల దారిలో నెమ్మదిగా అడుగులేస్తూ లోపలికేల్తుంటే మధ్యలో ఆధునాత కట్టడాడంలో మత్రిమందిర్ కట్టడానికి సంబంధించిన విశేషాలతో ఏర్పాటు చేసిన ఫోటో మ్యుజియం బావుంది. దానికి ఎదురగా ఫ్రెంచ్ హోటల్ షాపింగ్ స్టాల్ , గేలరీ, పాతకాలపు కట్టడం, ఇవి దాటుతూ కాస్త ముందుకెళితే చిన్న టీ, జ్యూస్ సెంటర్, దాని పక్కనునున్న దారి గుండా ఒక ఇరవై నిముషాలు నడిస్తే గాని రాలేదు గోళాకారంలో ఉన్న మత్రిమండపం. గ్రామం యొక్క ఆత్మ (SOUL OF THE CITY) గ పేరుగాంచిన ఈ ప్రదేశం లోపలికి వెళ్లలేకపోయాం కాని బయటినుండే చూసాం అధ్బుతంగా ఉంది.
తిరిగి ఫ్రెంచ్ హోటల్ లో పాత కట్టడంలో పిల్లితో ఆడుకుంటున్న పిల్లలతో కాసేపు గడిపి తిరిగి బస్సులో కూర్చొని ఆరోవెల్లి చేరుకోనేసరికి చీకటి పడటంతో వెనుదిరిగి మధ్యలో షాపింగ్ కార్యక్రమాలు చేసుకుంటుంటే. రాకేశ్, చంద్ర శేకర్ సింగ్ గారి మధ్యలో జరిగిన సంభాషణతో తెలుసుకున్న శేకర్ గారి పాజిటివ్ దృక్పధాన్ని.
షాపింగ్ అంత పూర్తి చేసుకొని హోటల్ రూం కి చేరుకునే సరికి తొమ్మిది దాటింది.
కాసేపు విశ్రాంతి తీసుకొని బిజీ లెక్కలతో దర్శన్ ఖన్నా, తీసిన ఫొటోస్ అన్ని లాప్ టాప్ లోకి పంపిస్తూ వికాస్ ఇలా ఎవరి పనుల్లో వారు ఉండగా మేము వెజిటేరియన్ బృందం నేను, రాకేశ్, వికాస్, హర్ష్, సందీప్, దర్శన్ బయటికొచ్చి మిషన్ స్ట్రీట్ లో కాసేపు నడిచిన తర్వాత కుడి వైపున ఆనంద్ భవన్ ఇండియన్ ఫుడ్, ఎడమ వైపున డన్జేలేనియ ఇటాలియన్ ఫుడ్, ఇంత దూరం వచ్చాం. కొత్త వంటలని ట్రై చేద్దాం అని ఇటాలియన్ కే వోటు వేసాం.
పేరు తెలియని నోరు తిరగని వంటకాల పేర్ల లిస్టు ముందు పెట్టి అందర్ని పరిచయం చేసుకున్నాడు ఆ హోటల్ ని నడిపిస్తున్న మాక్స్. తన సలహా ప్రకారం మూడు వంటకాలని రుచి చేసాం. తీర చూస్తే మైదా, చీజ్, ఆలివ్ ఆయిల్ తో చేసిన (పాస్తా) వంటకాలు, చాల బావున్నై మధ్యలో మాక్స్ తో సంబాషణ, తనకు ఫోటోగ్రఫి పై ఉన్న మక్కువ, ముప్పై ఏండ్ల నుండి పాండి లోనే గడుపుతుండడం. అన్ని పంచుకున్న తర్వాత, ఇక్కడే ఎందుకు ఉండాలనిపించింది అనే ప్రశ్నకు సమాధానం "ఐ లైక్ ఇట్". భోజనం పూర్తి చేసి బ్రేవులు తీస్తూ తిన్నగా మల్లి గదికి చేరుకున్నాం.
ఇక మాంసం ప్రియులేమో టెర్రస్ పైన బోజనాలు కానిస్తుంటే మరి కొందరు గదుల్లో బిజీ అయ్యారు. నేను రాకేశ్ వికాస్ మెట్లపై కూర్చొని, మనసు, మెదడు, సమాజం, బంధం, అనుబంధం లాంటి చర్చలతో బిజీ ఐపోయాం.
పదకొండున్నర ప్రాంతాన మెలకువతో ఉన్నవాల్లమంత సాగర తీరాన ఉన్న లే కఫ్ఫే కి వెళ్ళాం. అక్కడికి చేరుకోగానే, ఇంకా విదేశీయులు బైక్ ల పై తచ్చడ్డం. ఆ సమయంలో కూడా జనాలు తిరగడం అక్కడి సాధారణ విషయం.
కొందరు కోల్డ్ మరికొందరు హాట్ కాఫీ ఆర్డర్ లిస్తే నేను మాత్రం రెండు బిస్కెట్ లతో సరిపుచ్చుకున్న.
ఇక అక్కడినుండి మొదలైన ఎస్ ఎస్ రావు గారి జోకుల పర్వానికి కడుపుబ్బా పడి పడి నవ్వుతు అర్ధరాత్రి రెండు గంటల వరకు వీధుల్లో తిరిగి గదికి చేరుకున్నాం. బహుశ చాల కాలం తర్వాత అందరు మనస్పూర్తిగా నవ్వుకున్నాం ముఖ్యంగా నేను.
ఆ జోకులను నెమరువేసుకుంటూ దుప్పటి కప్పుకొన్నాను.
22nd AUG 11 - MONDAY :
ఇదే చివరి రోజు
ఎందుకో లేట్ గ లేచాను. అప్పటికే కొందరు సాగరతీరాన సూర్యోదయాన్ని ఆస్వాదించి వచ్చామని చెప్పారు. నేను మిస్ అయ్యననే భావన కలిగింది. ఈ రోజు స్ట్రీట్ ఫోటోగ్రఫి చేద్దామని నిర్ణయించుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కో వీధికి వెళ్తే నేను వికాస్ మరో వీధికి వెళ్ళాం. కనిపిస్తున్న మాకు కొత్తగ అనిపించినా ప్రతి కట్టడాన్ని బంధిస్తూ, అరబిందో ఆశ్రమ వెనుక వీధుల్ని చూస్తూ, సునామీకి కోల్పోయిన సన్నిహితులను తలచుకుంటూ కాలం గడుపుతున్న ముసలి వాళ్ళను, జాలర్ల ఇళ్ళను చూస్తూ, చేపల మార్కెట్, రద్దీగా ఉన్న మార్కెట్, స్కూల్, కాలేజీ, సభ జరుగుతున్న మిషినరీ చర్చిని తమిళ, తెలుగు, ఫ్రెంచ్, ఇటాలియన్, జర్మనీ రక రకాల దేశాల వ్యక్తుల్ని చూస్తూ, అక్కడక్కడ కనిపిస్తున్న దేశ విదేశపు వంటకాల హోటల్స్ ని, రెస్టారెంట్లని చూస్తూ నడుస్తున్న నాకు మాత్రం. ఆ సమయం లో బిజీ బిజీ గ రద్దీగా ఉన్న వాతావరణానికి బదులు ప్రతి వ్యక్తి కూడా నాలాంటి వాడే అనే తలపుతో అడుగులు పడసాగాయి.
గమ్మత్తైన మనసును దోస్తున్నా ఎన్నో విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. అందుకేనేమో నా లాంటి వాడు ఎప్పుడో ఒక్కసారైనా తన మనసుకు తన గురించి ఆలోచించడానికి కాస్త సమయం అవసరం. అందుకే ఇలాంటి ప్రయాణాలు నాకు చాల అవసరం అని తెలుసుకున్నాను.
నా మనసుని ఎంతగానో మార్చింది.
బహుశ ఇలాంటి అనుభవమే అందరికి కలిగిందేమో ఎవరికి ఈ ప్రాంతాన్ని వొదిలి రాబుద్దికాలేదు.
బలవంతంగా మమ్మల్ని లాగేస్తున్నట్టుగా తిరిగి గదుల్లోకి చేరుకొని, అన్ని సిద్ధం చేసుకొని, రెండు ఆటోల్లో "మమ్మల్ని వదులుకోలేక తన ప్రేమ కౌగిల్లో దాచుకున్న ఈ సాగర తీరాన్ని బలవంతానా వదిలేసి" బస్సు స్టాప్ కి చేరుకున్నాం.
రోజులు ఇంత త్వరగా ఎలా గడిచాయో ఇప్పటికి ఎవరికి అర్ధం కాని అంతు చిక్కని ఓ ప్రశ్నగ మిగిలింది. నా మనసు మాటలు రాకేశ్ కి వినపడినట్టున్నాయి అందుకే మరో కొద్ది రోజుల్లో పది రోజుల కోసం వస్తాను ఇక్కడికి అన్నాడు. ఎందుకు అని అడిగిన ప్రశ్నకి సమాధానం ఐ లైక్ ఇట్ అనడంతో అర్ధం చేసుకో గలిగాను లైక్ కి అర్ధం ఏంటో.
నాకు మళ్లీ రావాలనుంది. తప్పక వస్తాను అని చెప్పను. ఎందుకు అని ప్రశ్నించిన నా మెదడుకు మనసు చెప్పిన సమాధానం "ఐ లైక్ ఇట్" ఎందుకు లైక్ అంటే నా మనసుకు కలిగిన దాహాన్ని తీర్చే చోటుల అనిపించింది కాబట్టి లైక్ అని సమాధానం ఇచ్చుకున్నాను.
ఆటో ని బస్సు ని మారుస్తూ ఆరు గంటల ప్రాంతాన మళ్లీ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం. అప్పటికి గాని గుర్తుకు రాలేదు ప్రొద్దున నుండి ఏమి తినలేదని, ఆకలిగా ఉన్న నాకు మళ్లీ శరవన్ హోటల్ ప్రేమగా పిలిచింది.
అధ్బుతమైన సాంబార్ రైస్ తో పాటు బనానా చిప్స్ మరో కొన్ని రోజులవరకు గుర్తుండి పోయే రుచిని ఆస్వాదించాను. వెంటనే పెరుగన్నంతో పూర్తి చేసి, ట్రైన్ ఎక్కి గడిచిన మధుర క్షణాలను నెమరువేస్తూ తిరిగి నా ప్రాపంచిక గృహానికి పయన మయ్యాయి నాతోపాటు నా ఆలోచనలు.
ఈ ప్రయాణం లో చివరికి తెలుసుకున్న విషయం నేను ఈ ప్రపంచం వేరు కాదని. అంత ఒకటే అనే భావనతో రేపటి నా రోజు మొదలవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిన విషయం.
మనసు పుస్తకంలో ఈ నాలుగు రోజుల చాప్టర్ మరిచిపోలేనిది. నాకే కాదు నాతో వచ్చిన ప్రతివారికి ఇదే భావన కలిగి ఉంటుందని నా భావన. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు..

పంద్రా ఆగస్టు - జెండా పండగ
ఇగో పంద్రా ఆగస్టు వస్తోంది.
ఈ క్లాసు మొత్తం చమ్కీలతో చమ్కాయించాలి.
మస్తుగా ఎంజాయ్ చేయాలి అని లియాకత్ అలీ చెప్పడంతో.
ఏడు, ఎనమిది, తొమ్మిది తరగతోల్లమంత తల ఐదు రుపాయలేసుకుంటే చౌరస్తా బుక్ స్టాల్ లో రంగు రంగు కయీతాలు మేరుపు చమ్కీల కవర్లు మస్తు వస్తాయి అని మా క్లాస్ రవి గాడు చెప్పడంతో అందరం ఊ కొట్టాం. మా స్కూల్ లో మా క్లాసు లో కొంచెం నాకు మంచి పేరే ఉంది. డెకరేషన్ పనులు ఇంకా ఆ రోజు ప్రోగ్రాములు గట్రా నాకు అప్పచేప్పటోల్లు. ఇక మా రవిగాడికి పెద్ద సైకిల్ ఉండేది.
స్కూల్ మొత్తం లో మా పిలగాడ్లంత ఆడి బుజలకాడికి ఉండేటోల్లం అందుకే పొడుగు రవిగాడు అని పిలిచేటోల్లం. అప్పటికి నాకు సైకిల్ తొక్కటం రాదూ అది వాడికొచ్చు అందుకే నాకు తోడుగా డెకరేషన్ సామాను తేవడానికి మా ప్రిన్సిపాల్ మాడం పంపించేది.
ఇగ మా క్లాసు లో కూడేసుకున్న పైసల్తో మేము చౌరస్తాలో రవి బుక్ స్టాల్ అనే షాపులో అన్ని పట్టుకోచ్చేటోల్లం.
మా స్కూల్ టీచర్ లు చెప్తూ ఉంటె మా క్లాస్సులల్ల ఉండే ఆడోల్లంత పింకు రంగు కయీతలని చిన్న చిన్న గ కత్తిరించుకోని మల్లె పూల దండలాగ కాయితాల దండల్ని అల్లే వాళ్ళు అదంతా రెండు రోజులు కూచుంటే గాని అన్ని క్లాసు రూముల్లోకి సరి పడ దండలు తయారయేవి.
ఇక మేము పిలగండ్లమంత పెళ్ళిలకు అతికించే రంగు రంగు కాగితాలను కత్తిరించి క్లాస్‌లో అతికించే పనుల్లో ఉండేవోల్లం. ఇగ పోటిలుపడి ఎవలి క్లాస్సు వాళ్ళే అందంగా తీర్చి దిద్దే వాళ్ళం.
సంత్సరానికి రెండు సార్ల పనికొచ్చే కర్ర బొంగు వెనక క్లాసు పై రేకుల మీద ఉండేది. దాన్ని రవి గాడు అమ్జాద్ తీసేవోల్లు. నేను ఆరిఫ్ మూడు రంగుల కయీతలని బొంగు చుట్టూ అతికించడానికి కత్తర్లతో అందంగా కత్తి రించటోల్లం. మా ఆయ గిన్నెలో వేడి వేడి లయ్యి పిండి పట్టుకొచ్చేది. చిన్న బకిట్లో నీళ్ళు తీసుకొచ్చి కర్ర బొంగుని శుబ్రంగా కడిగి లయ్యి పిండిని పూస్తుంటే వెంటనే కత్తిరించుకోని పెట్టుకొన్న కాషాయం, తెలుపు పచ్చ, రంగు కయీతలని, అందంగా అతికించేవోల్లం.
వారం ముందునుండే అబ్బో ఎంత హడావిడి చిన్న తరగతులలో ఉండే ఇంగ్లీష్ మీడియం పిల్లలంతా దేశ భక్తి పాటలు, డాన్సులు ప్రకటిస్ చేసేవోల్లు.
హిందీ టీచర్ నాతోని పట్టుబట్టి హిందీలో ఉపన్యాసం ప్రాక్టిసు చేపించేది. బహుషా క్లాసు లో ఫస్టనో లేక హిందీ బాగా మాట్లాడడం అనో తెలియదు కాని మాట్లాడాలని పట్టుబట్టేది.
ఏందో రెంద్రోజులసంది మస్తు ప్రాక్టీసు చేసుకునేవొన్ని ఇగ రేపనంగా ప్రిన్సిపాల్ గారు పిలిచి రేపు నీ ఉపన్యాసం తెలుగులో ఇమ్మనేది. హిందీ టీచర్ కి అదే విషయం చెప్పటంతో సరే అని తెలుగులో ప్రాక్టిస్ చేయమనేది.
ఎవలవలివో పెద్ద పెద్ద పేర్లు త్యాగాలు, స్వాతంత్ర్యం, బ్రిటిషు, భారతదేశం, యుద్ధం, డేట్ లు, అర్ధరాత్రి స్వాతంత్ర్యం, నేటి బాలలే రేపటి పౌరులు, ఇంకేందేందో ఉండేది ఆ ఉపన్యాసం లో. తెల్లారితే జెండా పండగ.
రాత్రంతా చదువుకొనే వొన్ని.
అవే ఆలోచనలు ఉపన్యాసం లో ఉన్న కథలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా తమ వంతుగా తాము దేశ స్వాతంత్ర్యం కోసం పాటు పడడం.
ఎవరెలా కష్టపడిన చివరికి దేశ స్వాతంత్రమే ప్రధాన సూత్రంగ పాటుపడడం నాకు చాల ఆశ్చర్యానికి గురిచేసింది.
ఒకరు మౌనంగా సత్యాగ్రహం చేస్తే,
ఇంకొకరు ఎదురు తిరిగి నినాదం చేసారు,
మరొకరు సైన్యాన్ని కూడగట్టుకొని సమ ఉజ్జిలుగా ఎదురుతిరగడం,
ఏవిధంగా మనల్ని కొల్లగోడుతున్నారో అదేవిధంగా మనం వాళ్ళని కొల్లగోడుధమని ఇంకొకరు.
ఎవరు ఏ రకంగ పోరాడిన చివరికి దేశం కోసమే కదా అని నన్ను నేను సర్దిపుచ్చుకునే వొన్ని.
ఇదంతా గతం నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి పంద్రా ఆగస్టులో విన్న మాటలే విన్న చరిత్రలే కావచ్చు కాని ఇప్పుడెం చేయాలి.
ఒక్క రోజు నిల్చున్న జెండా కర్ర మళ్ళి ఐదునెల్ల దాక రేకుల మీదే నడుం వాల్చుతుంది.
సూర్యకిరణలకు చమక్కుమని మెరిసే రంగులతో రెప రెప లాడిన త్రివర్ణ పతాకం ఇస్త్రి చేసుకొని మడత పెట్టుకొని బీరువా అర లో సేద తీరుతుంది.
అప్పుడప్పుడు టీవీ లో క్రికెట్ ఆటలో ఇండియా గెలిచినప్పుడు, మా గల్లి పెద్ద పెద్దోళ్ళంత పట్టుకొని తిరగే టప్పుడు కనిపించేది ఆ జెండా.
నా చిన్ననాడు చాల కాలం వరకు స్వతంత్రం అనే పేరుకు అర్ధం మూడు రంగుల జెండా అని మాత్రమే నాకు తెలుసు.
ఆ జెండా ఎగరడానికి "స్వతంత్రం, గణతంత్రం" అనే రెండు పండుగాలోచ్చాయ్ అని మాత్రమే తెలుసు.
పరి పరి విధాలతో బుర్ర వేడిక్కి ఎన్నో ప్రశ్నలకు సమాధాన పరుచోకోలేక దుప్పటి కప్పుకొని పడుకోంటుంటే అమ్మ నా స్కూల్ డ్రెస్సు నీలం తెలుపు చిన్న చిన్న అడ్డం నిలువు గీతలు గల బుషోటు, నీలం రంగు పైంటు, పైన కింద నీలం మధ్యలో తెలుపు తో అడ్డగీతలున్న నడుం బెల్టు, బ్లాకు సాక్సులతో బూట్లు, అన్ని ఓ పక్కన సర్ది పెట్టేది.
పొద్దున్న ఆరు గంటల ప్రాంతాన, నను నిద్ర లేపేది అమ్మ.
పల్లుతోముకొని వొచ్చి ఉపన్యాసం పేపర్‌ను ముందేసుకొని అక్షరం పోల్లుబోగుండా తెగ బట్టి పట్టేవొన్ని.
ఏమో నేను యధ్రుచికంగా నా మనసుకి అర్ధంకాని చాల విషయాలు బట్టి పట్టక తప్పకపోయేది.
చుట్టూ కరతాళ ధ్వనులు మోగిన ఉపన్యాసం ఇవ్వడంలో ఆనందం ఏ రోజు నాకు కలగలేదు. ఎందుకో మరి నా మనసుకు నా ఆలోచనలను బయటపెట్టే స్వాతంత్ర్యం అప్పటికి నాకు రాకపోవడం వాళ్ళ ఏమో. ఈ సారైనా సాధ్యమవుతుందో అనుకుంటే ఈ సారి కూడా బట్టి పట్టక తప్పలేదు.
కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాగినాయి లే స్నానం చేయిపో. అని అమ్మ చెప్పడం తో కాగుతున్న నా ఆలోచనను ఆర్పేసి, ఉపన్యాసం కాగితాన్ని నా ప్రశ్నలని సంచిలో చరిత్ర పుస్తకంలోకి నెట్టి, ఇంటెనక బాయి కాడ బకిట్లో వేడి వేడి నీళ్ళ గిన్నలో వేపాకులు బకిట్లో పడనీకుండా పోసి గోరువెచ్చగా మారే వారకు కొన్ని చల్లనిల్లను జత చేసి, పెద్ద లైఫ్‌బాయ్ సబ్బు సిద్ధం చేసేది. పెద్ద చెంబుతో గబా గబా పోసుకుంటూ ఒళ్ళంతా వేప వాసన, ఈ ఆకులూ ఎందుకేస్తావ్ అని అడిగితే ఒంటికి మంచిది అని అమ్మ చెప్తుండేది. చేదువసనకు విరుధంగా సబ్బు వాసనా మత్తుగా తోచేది. స్నానం పూర్తవగానే సూర్యునికి దన్నం పెట్టుకొని, వేప చెట్టుకి దన్నం పెట్టుకొని ఒళ్ళు తుడుచుకొని.
బనీను నిక్కరు వేసుకొని ఆరున్నర ప్రాంతాన, పైంటును అంగిని ఒక చేతిలో పట్టుకొని అమ్మ ఇచ్చిన రెండు రూపాయలని నిక్కరు జేబులో పెట్టుకొని రెండ్రుపాయలు బయటికి రాకుండా జేబులో చెయ్యి పెట్టుకొని కుండి కాడినుండి వీరేశం దుకాణం దాటుకుంటూ గుండం వాడ రాజన్న దుకాణం పక్క గల్లిలో చాకలోల్లింటికి ఇస్త్రి చేపించుకోనేందుకు పోయేటోన్ని. అందరకి గీయల్నే గుర్తొస్తది, కాసేపుండు సేసిస్త అని కసురుకుంటోడు. జెల్దిజెయ్ స్కూల్ కు పోవాలి అని అదిరించే వొన్ని. అందరకి జేల్దే, చేస్తున్న గదా జరా సైసు అనేవాడు. కాస్త బయటికొచ్చి అన్ని గల్లిలని చూసేవాన్ని ఇక ఈ రోజు తప్ప ఇంకో రోజు ఇవి కనపడోద్దు అని కరెంటు స్థంబాలను, ఇండ్లను ఆసరాగా తీసుకొంటూ మొత్తం జెండాలను అతికించిన తోరణాలు దట్టంగా నింపేవాళ్ళు.
మెల్లిగా ఇస్త్రి బట్టలను తీసుకొని ఇంటికేల్తుంటే జెండా తోరణాలు నాకు ఆహ్వానం పలుకుతున్నట్టు అనిపించేవి. కుండి కాడ ఆశమ్మ వాళ్ళ ఇంటిదగ్గర మూడు బాటలకాడ జెండా ఎత్తేవోల్లు, ఆడికి పెద్ద పెద్ద వొళ్ళు వచ్చేవోల్లు కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీ కి సంబంధించిన జెండా మన జెండా ఎగిరేసే తుప్పు పట్టిన ఇనుప బొంగు పక్కనే దానికన్నా మూడు మూరల మరింత పొడుగుతో అమర్చిన కొత్త బొంగులో వారి జండాని అమర్చి చాల కాలం వరకు ఎగేరేసారు. అది చూసిన ప్రతి సారి. నా త్రివర్ణ పథకానికి రెండు రోజులే స్వతంత్రం మరి ఈ జెండా కి ప్రతి రోజు స్వతంత్రమా అనే నా ప్రశ్నకు నవ్వును సమాధానంగా ఇచ్చారు. ఆ ఏర్పాట్లను చూస్తూ ఇంటికేల్లెవాన్ని. త్వరగా బట్టలు వేసుకొని అంగిని పైంటు లోకి తోస్తూ బెల్టు పెట్టుకొని అమ్మ ధగ్గరకేల్లగానే, పారాచూట్ కొబ్బరినునే తలకు రాసి ఎడం పక్కన పాపిడ తీసి నున్నగా దువ్వి కొంచెం పౌడర్ ని మెత్తని బూరు పువ్వుతో మోకానికి అద్ది, చిన్న కుంకుమ బొట్టుని పెడుతూ ఈ రోజు జెండా పండగ, బొట్టు తుడుచుకోకు, బట్టలు మాపుకోకు, జెండా వందనం ఐపోగానే ఓ పక్కనుండి జాగ్రత్తగ రా సరేనా! ఊ.. అని అంటూ సాక్సులు తొడుక్కొని బూట్లని పాలిష్ కి బదులు కొంచెం కొబ్బరి నునేను మసిగుడ్డ కు అద్ది మొత్తం రాసేవాన్ని నల్లగా నిగనిగలాడుతున్న బూట్లను చూస్తూ ఆనందపడుతూ దారాలను కట్టుకుంటోన్ని. తెల్ల కడ్చిపుని చేతిలోకి తీసుకొంటూ స్వాతంత్ర్యం వచ్చిన నా బుజాలను నిటారుగా చేసుకొని నా పుస్తకాల సంచి వంక వెర్రిగా చూస్తుంటే ఆ సంచి నా వంక కోపంగా చూచేది. స్వేచ్చగా గుండెలనిండా గాలులను పీల్చుకుంటూ స్కూల్ వైపుకు నా అడుగులు వేసేవి. కుండి కాడ మూలమలుపు తిర్గుతుంటే గుండు పిన్ను సహాయంతో చిన్న కగేతపు జెండాని నా అంగి జేబుకి పెట్టె వారు, అన్న అన్న అబ్బ ఇంకో జెండా ఇవ్వవా. ఎందుకు చిన్న? నా బుక్కులో పెట్టుకుంట ప్లీజ్ ప్లీజ్ అనగానే నవ్వుతూ రెండు జెండాలను చేతిలో పెట్టేవోడు, జాగ్రతగా అంగి జేబులో పెట్టుకోనేవాన్ని. గుండెను అదుముకున్న నా స్వాతంత్రపు జెండాని పదే పదే చూస్తూ మురుసిపోతు స్కూల్ కి చేరుకుంటోన్ని.
పెద్ద పెద్ద పాటకలున్న గేటుకు కుడి బాగాన ఒక్కరు పట్టే విధంగా చిన్న గేటు ఉండేది. లోపలి అడుగు పెట్టగానే నిజమైన ఆనందపు వాకిలి చేరుకున్నాన అని తలపించేది అందంగా ముస్తాబైన మా స్కుల్ని చూస్తుంటే.
అందరం పిల్లలం ఒకరి వెనక ఒకరం కొన్ని వరుసలుగా నిల్చోనేవాళ్ళం నేను రవి గాడు ఇంకా ఆరిఫ్ గాడు ముగ్గురం ప్రిన్సిపాల్ మాడంకు చేరువలో నిల్చోనేవాళ్ళం మాకు ఏమైనా పనులు పురమయిస్తారో అని. అన్నట్టుగానే మాకు పనులు తగిలేవి గాంధీ, నెహ్రు, భగత్ సింగ్, సుబాష్ చంద్ర బోస్ పటాలను శుబ్రం చేసి జెండా కర్ర కింద ఎత్తు తక్కువగా ఉండే వెడల్పు బల్లపై జాగ్రత్త గ అమర్చేవాళ్ళం. టేచర్లు మాకు సహాయం చేద్దాం అని వచ్చేవారు కాని మేము వారిని రాకని చెప్పి పూర్తి చేసేవాళ్ళం. మా ప్రిన్సిపాల్ గారు, పటాల్లో ఉన్న వారికి కుంకుమ దిద్ది కళ్ళు మూసుకొని దండం పెడుతుండగా పిల్లలమంతా అలాగే చేసేవాళ్ళము. రెండు కొబ్బరికాయలను కొట్టి పక్కన పెట్టి మెల్లిగా తాడు సహాయంతో కొన్ని పూలు రంగు రంగు కాగితాలను మూటగా కట్టి ఉంచిన జెండాను కర్ర చివరివరకు చేర్చి, మరో తాడుతో ముడి విప్పడం తో ఒక్కసారిగా రంగు రంగు కాగితాలు జెండా నుండి స్వేచ్చగా బయటకు రాగానే పిల్లలమంతా చేతులలో ఉన్న చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నరంగు రంగు కాగితాలను బలంగా జెండా వైపుకు విసిరేవాళ్ళు, అమ్జాద్ వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చిన ఐదారు పావురాలను కూడా జెండా వైపుకి వోదిలేవారు, ఆగని కరతాళ ధ్వనులతో జరుతున్న సన్నివేశమంతా కన్నులపండగల తోచేది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించేది. తలలన్ని తలెత్తుకొని జెండా వైపుకు చూస్తూ సెల్యూట్ చేస్తూ జనగణమన గీతాన్ని అలపించేవాళ్ళం.
ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారి ప్రసంగంతో మొదలయి టీచర్ల వరకు రాగానే కొద్ది కొద్ది గ వణుకు మొదలయ్యేది నాకు, ఇది ఇప్పటిది కాదు ప్రతి సారి జరిగేదే, గుండె వేగం పెరిగేది. ఆ సమయంలో పిలిచేవారు రఘు అని. గుండెలనిండా శ్వాస తీసుకుంటూ ఎదురుగా ఉన్న పిల్లల వైపు చూస్తూ జెండా కర్రకి కొంచెం పక్కగా ప్రిన్సిపాల్, టీచర్ల ముందు నిల్చొని నా ప్రసంగాన్ని మొదలు పెట్టి పూర్తి చేసే సమయానికి నా కళ్ళు మూతలు పడి ఎవరో నన్ను బలంగా కిందికి అనగాతోక్కుతున్నట్టు భయంతో వణుకుతూ తల కిందికి జారుకునేది. నాకు తెలియకుండానే ప్రసంగం పూర్తయిందని తెలిసేది చప్పట్లు మోగుతుంటే. హమ్మయ్య పెద్ద గండం గడిచింది. అనుకుంటూ తల పైకెత్తి నవ్వుతూ మళ్ళి నా స్థానం లోకి వచ్చేవాన్ని. అందరి ప్రసంగాలు పూర్తయ్యాక, అప్పుడు పట్టుకోచ్చేది ఆయ, ప్యాకింగ్ చేసిన పొట్లాలు. ఇక అందరు కళ్ళు ఆ పోట్లలపైనే.
మేడం ఒక్కొక్కరిగా ఇస్తుంటే ముందు చిన్నతరగతి పిల్లలంతా రెండు చేతులతో తీసుకొని నెమ్మది లోపలి వెళ్ళేవాళ్ళు. అల అందరం పొట్లల్ని తీసుకొని మా క్లాస్‌లోకి వెళ్ళేవాళ్ళం నా కడ్చిపులో ఆ పొట్లాన్ని దాచుకొని జేబులో పెట్టుకొని. ఇక అందరం వెనక క్లాస్ ముందు వెడల్పుగా ఉన్న అరుగు మీద పిల్లలంతా వేషాలు వేసుకొని నాటకాలు, పాటలు, డాన్సు లు వేస్తుంటే. నా ఆలోచనలు మాత్రం రెపరెపలాడే జెండా వెనక దాగిన మరో ప్రపంచం వైపుకు పరుగులు తీసేవి. సమాధాన పరుచుకోలేని ఎన్నో ప్రశ్నలను మదిని తొలుస్తూ, స్వతంత్రం అంటే ఏమిటో అర్ధం కోసం వెతుకుతూ, నేను పుట్టిన గడ్డ పై మమకారం పెంచుకోవడమేనా దేశ భక్తి, ఆటలో గెలిస్తే జెండా పట్టుకొని వీధిల మీద తిరగాడమేనా దేశభక్తి.
భానిస నుండి విముక్తి, ఇప్పుడు ఏవరికీ భానిసలుగా ఉన్నాము.
గాంధీ మహాత్ములు, ఎందరో మహానుభావులు నాకు తెచ్చిపెట్టిన స్వతంత్రం ఇదేనా,
దేశాన్ని వొదిలి పారిపోయి దేశం కోసం ఏదైనా సాధిస్తున్నమా అంటూ ఇక్కడి తెలివినంత పొరుగు దేశాల్లో ధారపోస్తున్నరన్న ఆవేదనని గొత్తు చించుకొని అరుస్తున్న పెద్దవాళ్ళకి, ఇక్కడే ఉన్న వాళ్ళు దాసోహం అంటూ ఎంత మంది పొరుగు దేశపు కంపెనీల్లో పనిచేస్తున్నారో కనిపించడం లేదేమో.
ఇప్పటికి నేను భానిసనే, నా ఆలోచనలన్నిటిని పణంగా పెట్టి ఓ మల్టీ నేషనల్ కంపెనీ (పొరుగు దేశపు) లో పని చేస్తున్నాను కేవలం నాకోసం.
నా కోసం మాత్రమే పనిచేసుకుంటున్నాను.
మరోసారి మనం బావుపడితే దేశం బావుపడుతుందంటున్నారు.
ఏమో దేశం కోసం పాటుపడని "నా" అభివృద్ధి తో దేశం ఏరకంగా వెలిగిపోయిందో నాకు తెలియదు కాని.
ఒక రకంగా వెలిగిపోతుంది అక్రమ సంపాదనతో, బిధరికంతో, ఎన్నో రకాల లేమితో ఎప్పుడు కుంటుతున్న నా భారతం వెలిగిపోతుంది.
గాంధీ సత్యాగ్రహం పాపం స్కూల్ పుస్తకాలకి అంకితమైనది.
యువత ఆలోచనలు పొంతన లేని సొంత అబివృద్దికి, విందుల వినోదాలకి, ఉరుకుల పరుగుల జీవితానికి, గమ్యం లేని లక్ష్యాలకి, ఎటు తోచని ఆలోచనలకి, ఒత్తిడికి, స్వాతంత్రం పేరుతో పబ్బుల్లో విచ్చలవిడితనానికి అంకితమైనది.
బాగా చదువుకున్నోల్లు రెండు పదులు దాటగానే పొరుగు కంపెనీల పుణ్యమా అని ఎక్కడిలేని సంపాదనతో స్వాతంత్రం అనే ఆయుధంతో ఉల్లాసంగా విలాసవంతమైన జీవితం గడుపుతుంటే,
నెహ్రు విసిరినా పావురాయి రెక్కని ఈ జాగా నాది ఆ జాగా వాళ్ళది అని తెగ నరుకుతుంటే రక్తం మడుగులో కొట్టుకుంటోంది.
సుబాషు తాయారు చేసిన సైన్యం తాను ఎన్నడు ఊహించలేదేమో తన దేశపు రేపటి పౌరులని ఎదిరించాడానికే మిగిలిందని.
మీసం మేలేసిన భగత్ సింగ్ రౌశ్యం నా వీధి బాలుని ఆకలి తీర్చలేకపోయిందానే నిజం తనకు ఎవరు చెప్తారు.
ఎవరేక్కడికి పోతే నాకేంటి అనుకోని ఎవరికి నచ్చినట్టు వారు జీవించడమే స్వాతంత్ర్యం అనుకుంటున్నాన నేను. నిజమే కావచ్చు
అందుకేనేమో పాపం కరుణకి అర్ధం చెప్పిన మథర్ తెరిసా ఎంత వేదనకి గురైతే తప్ప కరుణలేని మనసుల లోకంలోకి మళ్ళి నను పుట్టించకు ప్రభువా అని తన డైరీలో ఎందుకు రాసుకుంటుంది.
ప్రక్టికాల్ గ ఉంటూ, ఎం జరిగిన పట్టనట్టు చూసి కూడా మనకెందుకులే అనుకోని అన్ని చంపుకొని చేతులు కట్టేసుకొని,
నా నా నా నా అనే సొంత అభివృద్ధికోసం బానిసనై నా మనసు చేసే అగచాట్లలో,
నా దేశం కోసమే నేను అనే భావన ఎప్పుడు నాకు గుర్తోస్తుందో.
ఎప్పుడు నిజమైన స్వాతంత్ర్యం నా బానిస మనసుకి వస్తుందో.
ఎప్పుడూ ఎగరుతుందో కిందకి దిగని జెండా నా మనసులో ఏమో...
నిజాలు తెలియని, తెలుకున్న, తెలుసుకోనట్టు, నన్ను నేను మబ్యాపెట్టుకుంటూ కల్లోలపు మధనం, నా మనసులో అప్పటి నుండి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది
ఒరేయ్ ఎం చేస్తున్నావ్ రా ఐపోయింది. ఇగ పోదాం పద అనడంతో ఒక్కసారిగా పెద్ద ఆలోచనల సంద్రానికి అడ్డుకట్ట వేసి అతి చిన్న నా అనే భావనలోకి వొచ్చి. ఆ అయిపోయిందా అనుకుంటూ మెల్లిగా లేచి ఒకరివేనకల ఒకరం నెమ్మదిగా బయటికొస్తూ ఒక్క సారి వెనక్కి చూసుకున్న రెపరెపలాడే నా జెండాని, ఎందుకంటే మరో ఐదునెల్ల దాక మళ్ళి కనపడదుగా ఆ దృశ్యం.
ఇంటికి రాగానే ప్లేటులో పొట్లం విప్పి లడ్డు బూంది, నాలుగు బిస్కట్లు, రెండు చాక్లెట్లు, దారిలో వస్తుంటే కుండికాడ పంచి పెట్టిన రెండు అరటి పళ్ళ ముక్కలు, అర్వన్నం, కొబ్బరి ముక్కలు కూడా అదే పళ్ళెం లో పెట్టి ఇంట్లో అందరికి ఇచ్చేవాన్ని నా లాగే మా అక్కయ అన్నయ కూడా..
మెల్లిగా అంగి విప్పుతుంటే జాగ్రత్త గ గుండు పిన్ను తీసి జేబుకు పెట్టిన, జేబులో ఉన్న జెండాలని రాజన్న దుకాణంలో మొన్ననే కొన్న కొత్త రూల్ నోట్ బుక్కుని బయటికి తీసి మధ్యలో కాగితపు జెండాలని బద్రపరచి ముక్కుకి దగ్గరగా పెట్టి కొత్త బూక్కు సువాసనని గట్టిగ పీల్చి. వచ్చే గణతంత్ర దినోత్సపు ఆలోచనలను బూక్కుతో జత చేసి సంచిలో పెట్టుకునే వాణ్ని.
Tuesday, August 16, 2011 at 3:50am

ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా..
భయటికేల్లి ఉమ్ము మింగకుండా తుపుక్కున ఊంచి వచ్చి.
ఒరేయ్ ఇస్కూలు అయినాక మనం మసీదుకు పోదాం. ఇయాల సాయంత్రం "రోజా పొద్దు ఇడిచినక" మాకు తెలిసినోల్లు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. అని నా దోస్తు ఆరిఫ్ చెప్పడంతో.
విందా.. అరేయ్ నేను గూడ వస్తా.
సాధారణంగా అరటి పళ్ళు, ఇంట్లో ఎవలికైన జ్వరం వస్తే తప్ప కనిపించని దానిమ్మ కాయ, అప్పుడప్పుడు దొడ్డు సేమియా(అదే బంబినో) పాయసం.
మా వాడలో, గుండం గల్లిల్లో, అంత ముస్లిములే, మా గల్లిలో ఉన్న ముసలోల్లంత తుర్క వాడ అనేటోలు. మా ఇస్కులు దోస్తులంత ముస్లిం అని పిలువాలి అని మారం సేయడంతో నేను మాత్రం ముస్లిమోళ్ళ గల్లి అని పిలిచేవోన్ని. రంజాన్ పండగోస్తున్దంటే సాలు రకరకాల పళ్ళు, పళ్ళ రసాలు, కజ్జురాలు, మిటాయిలు, ఖీర్ పాయసం, హాలాల్ చేసిన మాంసం, దం బిర్యాని, పుల్క, రుమాల్, తందూరి, నాన్సు రొట్టెలు. ఎక్కడ లేని తిడంత గాన్నే గా ఇఫ్తార్ విందులల్ల ఉండేది. ఎందుకో మాంసం తినకపోయేటోన్ని. కాని నా శక్తి మేర పళ్ళు, రసాలు, కజ్జురాలు, పాయసం ఫుల్లుగా తీసుకొని పొట్టి నేక్కర్లేసుకున్న మేము పెద్దోల్లలాగా ముందు నా పొట్టను పంపిస్తూ వెనకాల నేను నడిచేవొన్ని.
రంజాన్ పండగ రోజైతే చెప్పనక్కర్లేదు, మా గల్లి మొత్తం అత్తర్ గుభాలింపే. నన్ను కలుసుకోవడానికి మా దోస్తులంత దగ్గరున్న వాళ్ళు అబ్జల్, ఇర్షాద్, నయీం, నౌషాద్, లియాకత్ అలీ నడుచుకుంటూ, చాన్దూరం ఉన్నవాళ్ళు సైకల్లెసుకొని, టిఫిను డబ్బాల్లో ఖీర్ పాయసం పట్టుకోచ్చేవోల్లు, ఇంటెదురుగా ఉన్న బేబీ వాళ్ళు, మసూదు వాళ్ళు ఇంకా మా అన్న దోస్తులు అంత పాయసం ఇచ్చేటోల్లు. అందరికన్నా ఆరిఫ్ వొళ్ళ అమ్మ చేసే కద్దు ఖీర్ పాయసం, పోనీ ఖీర్ పాయసం, ఇంకా నెయ్యితో చేసిన స్వీట్లు అంటే మస్తు ఇష్టం అందుకేనేమో పెద్ద పెద్ద గిన్నెలో పట్టుకొచ్చేవాడు మా ఇంట్లోలందరి కోసం.
నేను ఆరిఫ్ ఎంత మంచి దోస్తులమంటే నా చిన్ననాటి సగం దినాలు వాడి ఇంట్లోనే గడిచినాయి. వాళ్ళింట్లో నేను మా ఇంట్లో వాడు కుటుంబ సబ్యులమైనాము. వాళ్ళ నాన్న సాబిర్ పాషా వ్యవసాయశాకలో గోవర్నమెంటు జాబు. ఇద్దరక్కలు వీడొక్కడు. ఏందో మాకు ఊహోచ్చేసరికే ఆ ఇద్దరక్కలకి పెళ్లిలయినాయి.
జుబ్బాలు, కుర్తాలు, లాల్చి పైజాములు, తెల్లని టోపీలు, కొందరు చమ్కీల తో రంగు రంగు అల్లికలున్న బుషోట్లు. కర్రు కర్రు మని శబ్దం చేసే తోలు చెప్పులతో యెడ సూశిన ఒక్కల్నోకలు గలేల్ను కలుపుకుంటూ కౌగిలించుకోనేవోల్లు. నాకడికోచ్చిన మా దోస్తులనంధరిని గలే మిల్ అనుకోని కౌగిలించోకొని రంజాన్ ముబారాక్ అనుకుంటోల్లము.
ఇక మా క్లాస్ లో ఉన్న అడవోల్లు కూడా వాళ్ళ ఇంటికి పిలిచేటోల్లు. మచిలిబాజార్ లో ఉండే రానా, గుండం వాడలో ఉండే సాజియ, రాజియ, ఫాతిమా ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం రంజాన్ ముబారక్ చెప్పడానికి. వాళ్ళు పెట్టె ఖీర్ పాయసం స్వీట్లు ఆరగించడానికి. ఎందుకో ఎప్పుడు బుర్కాల్లో దిగేసున్న ముఖాలకి ఆ రోజు స్వాతంత్రం వచ్చేది, రంగు రంగు హైదరాబాద్ పరికినిలు, మెరుపు తీగల చున్నిలతో ముంబాయ్ నుండి తెచ్చుకున్న మొహలాయి చీరలు, దుబాయి అత్తర్లు, అబ్బో ఎన్నడు లేని సంబరమంత ఆరోజు వాళ్ళల్లో కనిపించేది. ఫాతిమా తాను వేసుకున్న రంగు రంగు మెరుపు అద్దపు గాజులని కిటికీ నుండి వచ్చే వెలుతురు దగ్గర పెట్టి గాజుల అద్దాలలో పడుతున్న కిరణాలకి తళుక్కుమని గోడపై మెరుస్తున్న రంగుల నీడలను చూస్తూ మురిసిపోతూ మా పెద్దన్న చార్మినార్ కాడినుండి తెచ్చిండు అని గర్వంగా చెప్తుండేది. అప్పట్లో చార్మినార్ ని చూడాలనేది మా దోస్తులందరి అతి పెద్ద కోరిక. అందుకేనేమో మొదటిసారి హైదరాబాద్ కొచ్చినప్పుడు పొద్దటినుండి సాయంత్రం వరకు చార్మినార్ వాకిల్లోనే తెగ తిరిగాం నేను ఆరిఫ్.
ఫాతిమా వాళ్ళ ఇంట్లో మొత్తం ఎనమిది మంది అన్నలు, ఆరుగురు అక్క చెల్లెళ్ళు. చాలా పెద్ద కుటుంబం ఇమేధీ పదోకొండో నెంబర్ చిత్రం మా స్కూల్లో కూడా అమెది రోల్ నెంబర్ పదోకొండే తను పుట్టిన తేది కూడా నవంబర్ పదోకొండు ఇలా చాలా విషయాల్లో తనతో పదోకొండో నెంబర్ ముడి పడింది. ఆ తర్వాత కాలం లో నఫీజ్ సుల్తాన నాకు మంచి దోస్తు వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి మాకు రంజాన్ ముబారక్ చెప్పేది.
కాలం తో పాటు నేను కూడా హైదరాబాద్ వాలిన ఇక్కడ కూడా నాతో పెనవేసుకున్న స్నేహాలు ఎన్నో సుల్తాన్ బాజార్ అలీ, చార్మినార్ అక్బర్, ఫయాజ్ హాష్మి, రఫిక్ దిల్సుఖ్ నగర్ జాహిద్, అబిడ్స్ మొహమ్మద్ ముజాహిద్, జుబ్బ సురయ బేగం, దూరదర్శన్ ఫాతిమా, హకీం పెట్ నాజియ టైమ్స్ అఫ్ ఇండియా హుస్సేన్ ఇలా చెప్పుకుంటే పోతే పర్వాలేదు ఈ రంజాన్ కూడా నన్ను ఆనంద పరచాడానికే వచ్చిందా అని అనిపిస్తుంది.
ఒరేయ్ నమాజు టైం ఆయ్యింధిర అనడంతో సైకిల్ బొంగు మీద నేను కుర్చొంటే చిన్న పైడిల్ని భలంగా తొక్కడం తో ఒక్క పరుగున ఉజిలిబేసు మసీదును అందుకునేవాళ్ళం నేను ఆరిఫ్. ఏంటో నాతో పాటు వాడు గుడికొచ్చిన, వాడితో పాటు నేను మసీదుకేల్లిన యధ్రుచికంగానే పిలుస్తున్నది భగవంతున్నే అని అపుడు మా మనసులకి తెలియక పోయిన మా ఇరువురి మతాలు వేరనే భావన ఎవరు మాకు నూరిపోయనందుకు చాల సంతోషంగ ఉంది ఇప్పటికిను.
అల్లాహు అక్బర్ - అల్లాహు అక్బర్ అష్ హదు - అల్లా ఇలాహ్ అంటూ మొదలై అల్లాహు అఖ్బార్ లా ఇలాహ్ - ఇల్లల్లాహ్ అంటూ పూర్తయేది.
మెల్లిగా బయటికొచ్చి సైకిల్ లేసుకొని హన్మకొండ చౌరస్తా, నయీంనగర్ వెనకనుండి గల్లిలన్ని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ కాకతీయ కాలనికి అటు నుండి అలంకార్ టాకీస్ దాటుతూ భద్ర కాలి చెరువు దగ్గర కాసేపు కూచొని, మెల్లిగా కదులుతూ దుదేకులోల్ల రఫీ, అనిల్ ని కలిసి, మూలా మలుపు తిరుగుతూ అమ్జాద్ వాళ్ళింటికి వెళ్లి ఆ తర్వాత ఆరిఫ్ వాళ్ళ ఇంటికి తీసుకేల్లెవోడు. విందు ను పూర్తి చేసుకొని, ముచ్చట్లు పెట్టుకొనే సరికి రాత్రి అయ్యేది. మెల్లిగా ఇంటికొచ్చి రాత్రి బోజనాలయ్యాక చిమ్ని దీపం వెలుతురిని తగ్గించి ఓ మూలాన పెట్టి నేను పడుకుంటూ ఏమేమి చేసామో ఏమేం తిన్నానో ఆత్రంగా చెప్తుంటే గుడ్డి వెలుతురులో అమ్మ తువ్వాలతో నాకు గాలి విసురుతూ ఆశ్చర్యంగా వింటూ ఉండేది.
దాదాపుగా ఇన్నేళ్ళలో యే రంజాన్ కి మేమిద్దరం కలవుకుండా ఉండేవాళ్ళం కాదు. మొదటి సారి కలవలేక పోతున్నందుకు మనసుకు ఇప్పడు తెలుస్తుంది గలేల్ను కలుపుకొంటూ కౌగిలించుకోవడాల విలువా..
"అరేయ్ దిల్ తుజ్సే గలే మిలనేకే లీయే తరస్ రహ రే అని తడారిన గొంతుతో చెప్పి ఫోన్ పెట్టేసాడు దుబాయి నుండి ఆరిఫ్"
మొదటి సారి చిత్రంగ ఉంది మా ఇరువురి మనసుల కోరిక ఒకటే అవడం.
ఇప్పుడు మా ఇద్దరిని కాస్త దూరం చేసిందని గర్వపడుతున్న పిచ్చి కాలానికి తెలియదు పాపం, మేమిద్దరం అనుక్షణం ఇరువురి మనస్సులో కలిసే ఉన్నాం అని.
చిన్ననాటి జ్ఞాపకాల్లో కత్తిరించుకోని పెట్టుకొన్న కవితొకటి గుర్తొచ్చింది.
దోస్తీ హొతి నహి భూల్ జానే కే లియే,
దోస్త్ మిల్తే నహి బిఖర్ జానే కే లియే,
దోస్తీ కార్కే ఖుష్ రహోగే ఇత్నా,
కి వక్త్ మిలేగా ని ఆన్సు బహానే కే లియే.
ఎలాగు నా మనసు మాట వాడికి వినిపిస్తుందని నాకు తెలుసు అందుకే
"ఒరేయ్ ఆరిఫ్ రంజాన్ ముబారక్ రా.."
Sunday, August 14, 2011 at 3:56am

పుష్పం
భానుడు తహ తహ లాడుతూ,
వెచ్చని పరువాలనే కాంతి రేఖలను నిచ్చెనలు వేసి మరి మెల్లిగా పంపిస్తున్నాడు ఈ ధరి పైకి,
చేతులు చాచి వాటిని తమ కౌగిల్లో బంధించి ఈ రేయి ఉదయించింది.
ఈ రేయిని నెమ్మదిగా చూస్తున్న సాగరం.
సాగరం బిగి కౌగిలిని ఆనందంగా ఆస్వాదిస్తున్న తీరం.
తీరం ఇసుక తెమ్మల పైపొరలను ఆనుకొని మనుసువిప్పుకొని పడుకొని ఉన్న పచ్చికబయల్లలో, భానుడి కిరణం సుతి మెత్తగా తమను తాకగానే మేల్కొని వెన్ను విరిచి గట్టిగ ఊపిరి పిల్చుకుంటూ అనంధపడుతున్నాయి పుష్పక లోగిళ్ళు.
తన రెక్కలతో ఈ రేయిని చీల్చుకుంటూ వెళ్తున్న తుమ్మెద కళ్ళకి
పుష్పక సొగసు రంగు సరికొత్తగ తోచే,
అది పుష్పక లోగిలియ...?
మౌన సంగీతపు కావ్య తరంగీయ...?
కలుపుగోలు వన్నె ఛాయా, కమలపు చివరి అంచుల రంగుల రాజ్యంలో దాగిన అందాల రాణియా..?
అని సమ్మోహనంతో పరవశిస్తూ జూమ్మని రెండు రెక్కలతో గాలిలో ఈదుతూ దాని వద్దకు చేరెను..
తుమ్మెదని చూసి ఆ పుష్పం సిగ్గులోలుకుతూ
"నా అందాలకి ముగ్ధుడై నా వద్దకు వచ్చేనా ఆహ.. నేను వయోసోచ్చిన పడుచునయ్యనా అని తలిచేను పుష్పం..."
సూటిగా తన కళ్ళలోకి చూస్తూ, తన చేతులతో సుతారంగా రేకులను స్పర్శిస్తూ, తన ముద్దులతో పరవశింప చేస్తూ తనలో దాగిన మన్మధ భానాన్ని పుష్పం గుండెలోకి సుతిమెత్తగా దింపుతూ గట్టిగ కౌగిల్లో తనని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ఊహించని ఇంతటి ఆనందాన్ని ప్రేమని మౌనంగా ఆస్వాదిస్తూ ఆ క్షణంలో పుష్పం వొదిలింది తన మనసుని.
మధుమోహపు మత్తు సుగంధాల పరిమళాలతో తన ఆత్మ సౌందర్యంలో దాగిన మకరంధాన్నంతా తనకే తెలియకుండా మన్మధ భాణంతో మెల్లిగా పిల్చేసాడు.
చూస్తుండాగానే వీరిద్దరికీ తెలియకుండానే భానుడు దుప్పటి కప్పుకొంటు, వెన్నలను మేలు కోల్పాడు. వెన్నల ఆకాశంలో విరబూసి ఈ మౌన గీతపు కౌగిల్ల భంధాన్ని చోద్యంగా చూడ సాగింది.
తన తనువంత తాగి వొదిలి నెమ్మదిగా రెక్కలను కదిలిస్తూ ఎగరడం మొదలు పెట్టింది ఆ తుమ్మెద...
ఎగురుతున్న తుమ్మేదని దీనంగా, మౌనంగా, ఆనందంగా, పరవశంతో, మల్లెప్పుడొస్తవ్ అని అడుగుతున్నది.
తుమ్మద వెర్రిగా నవ్వుతూ, నీకు తిరిగి సౌందర్యం వచ్చాక వస్తాను అంటూ వెనక్కి తిరిగి చూడకుండానే ఆకాశంలోకి ఎగిరిపోయింది.
ఎంతో ఆవేదనతో తన రూపాన్ని తాకి చూచుకుంది.
"ఆశ్చర్యం యవ్వనం మాయమైంది ముసలి చారికలు ఉట్టిపడుతున్నాయ్.."
చుట్టూ విషాదం అలుముకుంది.
గంబీరంగా మారింది ఈ రేయి.
ఎం చేయాలో తోచక నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. తన ఆత్మ తనకే తెలియకుండా పచ్చని పరువాలను, రేయిని, సాగారతీరాన్ని, మసక చీకట్లని వొదిలి వెళ్ళసాగింది. అన్నిటిని వొదులుతూ చివరికి ఆ ముసలి శరీరాన్ని కూడా వొదులుతూ, ప్రయాణం సాగిస్తూ, ఆ ఆకాశ గగనంలోని చల్లని గాలుల్లోకి చిన్నగా మరింత చిన్నగా కొద్దిసేపు కనిపించి మాయమైంది..
జరుగుతున్న తీరుని చూసి భాధతో జాబిలి మేఘాల ముసుగులో మొహం దాచుకొని లోపల లోలోపల భాధపడుతుంది. అది చూసిన మేఘం భాదని దిగమింగ లేక తనలోని భావాన్ని వ్యక్తికరించెందుకు వర్షించడం మొదలు పెట్టింది.
చల్లని గాలులు వర్షపు చినుకులు జతగా కలిసి పులకరింతల హాయి గొలుపుతూ, జంటగా ధరి పైకి చేరి జోరుగా పాతాళలోకం వరకు జల్లుల వారధి కట్టింది..
ఆ చినుకులకి తడిసి ముద్దై నేలంతా తొలకరి కవ్వింతలతో ఈ రేయంత పరువపు సొగసుల సోభగులతో కలగలిసి ఆ తీపి గుర్తులకు చిహ్నంగా చిన్న మొక్కలో పుట్టిచ్చింది పిల్ల మొగ్గని. అది కొద్ది కొద్దిగా పూయసాగింది.
చూస్తుండగానే గల గల నవ్వుతోంది సుందర పుష్పం.
దుప్పటిని తన కాళ్ళతో తన్నిఒల్లువిరుచుకొని తను మేలుకొని ఈ రేయిని కూడా మేలుకోల్పాడు భానుడు.
ఉదయించిన సూర్యోదయాన్ని చూసి పులకరించింది పుష్పం.
ఈ సృష్టి లీల స్వరూపం ఇలాగే కొనసాగుతూ..

బందు
రాజకీయలేందో, తెలంగానేందో, ఆంధ్రదేశామేందో నాకు తెలవదు కూలినాలి చేసు కుంటొన్ని నాకేం ఎర్క నాయన.
ఎవడెడ సత్తేంది, కొంపకు 200 రూపాలతో ఎల్తే గాని కూడు దొరకదు.
దిక్కుమాలిన బందోటొచ్చింది.
రెండు దినాల సంధి అడ్డ మీద మేస్త్రి కాడ్నే కూసున్నం.
ఈరిగాన్ని 500 ఇయ్యిర అని అడుగుతే
లెవ్వు పెద్నయన 200 ఉన్నాయి అని సేతిల బెట్టిండు.
సాయంత్రం అయితే బంధు లేదు గిన్దులేదు అని మోటార్ బండి మీది గిరి గిరి వాసులు కొచ్చేవోడికి
రెండు దినలసంది చిట్టి గట్టలే 100 ఆడే తన్నుక పోతాడు.
పెళ్ళాం ఏమంటుందో ఏమో,
పొద్దున్నే నర్సాక్కోల్లింట్ల కెళ్ళి పావు సేరు పప్పు పట్టుకొచ్చింది.
ఇయ్యాల గడిచింది.
బందని లింగడు గూడ కూరగాయల డబ్బా మూసిండు,
లచ్మి దగ్గరికి పోతే ఇదే సందునకొని దాని ఇష్టమున్నంత సేప్తది రెట్లు.
ఐన ఏంచేద్దాం పెళ్ళాం ఊరుకోదు, కడుపు కాలక మానదు.
ఉన్న వంద కూడా గీయల్నే ఐపోయే.
గీ బంధు రేపు కూడా గిట్లనే ఉంటె ఇగ పొద్దుగడిసినట్టే..
Tuesday, August 9, 2011 at 7:45pm

పుట్నాలమ్మ
ఈ రోజెందుకో 1 నెంబర్ మెట్రో బస్సు చాల సేపు రెతిఫైల్ స్టేషన్ లోనే గడిపింది.
కిటికీని నెమ్మదిగా తీసి బాగ్ ని ఒల్లో పెట్టుకొని కూర్చున్న.
"పల్లి బటాణి, పల్లి బటాణి" అనుకుంటూ ఓ ముసలావిడ. దాదాపు 80 కి పైన ఉంటుంది. ఇప్పటికి ఆ వయసులో పని చేసుకు బ్రతకాలనే తపన మెరుస్తున్న తన కళ్ళల్లో కనబడింది. 50 దాటితే చాలు మమ్మల్ని మా ఆలోచనల్ని ఎవరు కానట్లేధయ్య అంటూ వారి గోడు వెళ్ళబోసుకుంటూ కాలం గడుపుతున్న మా వీధి పెద్దలకు మరియు నాకు ఈ ముసలావిడ మంచి ఆదర్శం అనిపించింది.
ఎంతమ్మ..
రెండు రూపాయలకు చిన్న సీసడు (టానిక్ మూత), మూడు రూపాయలకు పెద్ద సీసడు (పిల్లలు ఆడుకునే చిన్న టీ కప్) బిడ్డ.
చెప్పు ఏ సీసడు కావలి.
చిన్న సీసడు బటానీలు ఇవ్వమ్మా అంటూ పది రూపయలిచ్చాను.
అయ్యో బోని నీదే బిడ్డ, చిల్లెర ఉంటె సూడు.
పర్లేధమ్మ ఉండనివ్వు.
అయ్యో వద్దు బిడ్డ నీ సొమ్ము నాకెందుకు.
ఇంకా మూడు సీసాలు ఇవ్వనా..
సరే ఇవ్వు.
పేపర్లో పోసి పొట్లం గట్టి చేతిలో బెట్టి, చిన్నగా ఊగుతూ, నెమ్మదిగా బొడ్డు సంచిలో పది రూపాయలను బెట్టుకొని, ఆకుపచ్చ రంగు చీర చెంగును సరిచేసుకుంటూ, పయిలం బిడ్డ అనుకుంటూ వెళ్ళింది.
కాసేపటికి ముందుకు కదిలిన బస్సుకి విరుద్ధంగా నా ఆలోచనలు వెనక్కి కదిలాయి.
**
తన పేరు నాకు ఇప్పటికి తెలియదు. కానీ మేము(పిల్లలమంతా) ఓ పుట్నాలమ్మ ఇటు రా మా అమ్మ పిలుస్తుంది. అంటూ పిలిచుకోచ్చేవాన్ని. రోజు కాకపోయినా వారానికోసారైన మా పుట్నలమ్మ మా గల్లికి వస్తుండేది. నాకు బాగా గుర్తు అప్పటికే తన వయసు అరవై ధాటి ఉంటుంది. ఎవరో తాను తెలియదు కాని తనకి మా ఇంటికి మంచి అనుబంధం. మా అమ్మంటే తనకి చాల ఇష్టం. ఎండన బడి వస్తున్న తనని నేను పిలువగానే ఎట్లున్నావ్ సరోజనవ్వ అనుకుంటూ ఇంట్లోకోచ్చేది. మా అమ్మ చేతి సహాయంతో బుట్ట కిందబెట్టేది. నన్ను పెద్ద చెంబులో నీళ్ళు తేమ్మనగానే. గబుక్కున వెళ్లి బింధలో ముంచి తీసుకొచ్చి ఇచ్చేవాన్ని.
"అవ్వో నా బిడ్డే సల్లంగుండు నాయన" అంటూ చెంబును చేతికి తీసుకొని. గడ గడ తాగేది.
"బడి లేదా నాయన". "ఉంది ఒక్క పుటే. పోయ్యోచ్చిన".
నా చూపు మాత్రం మా అమ్మ, పుట్నలమ్మ ముచ్చట్లలో కాకా, పుట్నాలు బటానీల బుట్ట మీదే ఉండేది. పెద్ద బుట్టలో ఒక సంచిలో పుట్నాలు, మరో సంచిలో బటానీలు, ఇంకో సంచిలో కర్రెంటు వైరునీ కాల్చిన తర్వాత బయటపడే రాగి, ఇత్తడి తీగలు, బొమ్మలు ఉండేవి. ఒక పక్కన సద్ది టిఫును, ఒక చిన్న తరాజు, సుతిలి తాడు తో వేలాడదీసిన చిన్న అయస్కాంతం. సాధారణంగ డబ్బుకు కాకుండా, రాగి ఇత్తడి తీగలను తీసుకొని, దోసెడుతో ఇచ్చేది.
నేను ఒక చిన్న గిన్నలో కొంచెం బెల్లం వేసుకొని పుట్నాలు పోసుకొని. ఇంటెనక వేప చెట్టుకింద నా గోనే సంచిని పరుచుకొని. పీటను తల కింద బెట్టుకొని. నిక్కరు సదురుకోని పడుకొని నా తల పక్కన పుట్నాల గిన్న పెట్టుకొని కొంచెం బెల్లం కొన్ని పుట్నాలను నోట్లో వేసుకొని, నెమ్మదిగా చప్పరిస్తూ, ఊరించుకుంటూ తింటూ, వేప కొమ్మలను, రాలుతున్న వేప పళ్ళను, దానికి ఆవల ఉన్న నీలాకాశం చూస్తూ, ఒక మంచి రాజభోగాన్ని అనుభావిన్చేవాన్ని.
మా బాపు ముందు గది లోకి రెండు వేల రూపాయలు గిరి గిరి కింద అప్పు తీసుకొచ్చి బండలేపించాడు. కొద్ది రోజులకి గిరి గిరి చిట్టి తీరగానే మల్లి అప్పుతీసుకొని కరెంటు పెట్టించాడు. నెమ్మిదిగా రాత్రిళ్ళు మా పడక ఇంటెనక చెట్టుకింద నుండి పంక(ఫ్యాన్) కిందికొచ్చింది. లైట్ వెలుతురున్నా కూడా, ఆ గదిలో వెన్నెల కనిపించేది కాదు.
ఒక్కో సారి పుట్నాలమ్మకి మా అమ్మ భోజనం పెడుతుండేది. అప్పుడప్పుడు జ్వరంగా ఉంటె తను మా ముందు గది పంక కింద నడుం వాల్చేది.
మా అమ్మ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే కాలం చెల్లిందని. మా బాపమ్మనే తన తల్లిలా బావిస్తూ సేవలు చేసేది. మా బాపుని మా బాపు వాళ్ళ చెల్లేని(నాకు అత్తయ్య). పిల్లలు లేని మా బాపమ్మ,తాతయ్య వాళ్ళ తమ్ముడి దగ్గరనుండి దత్తత తీసుకున్నారు. ఆ రకంగా నాకు మా బాపు వాళ్ళ సొంత తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లి దండ్రులు, ఇద్దరు బాపమ్మలు, ఇద్దరు తాతయ్యలు అంతే కాకుండా అమ్మ వాళ్ళ నాన్న ఆ తాతయ్య.
మా అమ్మ చదువుకోలేదు కాబట్టి తనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ల గురించి తెలియదు. కేవలం ఆప్యాయత, అనురాగం తప్ప.
అందుకేనేమో తాతయ్యలు, బాపమ్మలు, మంచన పడితే విసుక్కోకుండా సేవలు చేసేది. చిత్రం ఏమిటంటే. అందరింట్లో అత్త కోడళ్ళ గొడవల గురించి వినపడేది కానీ, మా ఇంట్లో మా అమ్మతో ఎప్పుడు కృతజ్ఞత బావంగా ఉండేవారు. నా చిన్నప్పటినుండి. ఒకరి ఒకరి తర్వాత ఒకరు కల గర్బంలో కలుస్తుండడం, అప్పు తీసుకొచ్చి మరి కర్మ కాండలు చేపిస్తూ బాపు, వచ్చిన వాళ్ళందరిని అరుసుకుంటూ మా అమ్మ (అబ్బో మా చుట్టాల లిస్టు చెప్తే తరిగేది కాదు). నేను ఎందుకో వచ్చిన వాళ్ళతో పెద్దగ కలవలేక పోయేవాణ్ణి. నాకు మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పు తప్ప వేరే శబ్దాలు వినపడలేదు. అందరు తాతయల్లు బాపమ్మలు దూరమయిన పది పన్నెండెండ్లకు గాని శుబకార్యం జరగలేదు మా ఇంట్లో.
అందుకే అనిపిస్తుంది ఆడవారికి, ఎంతో ఓర్పు, సహనం కావాలని, అవన్నీ మా అమ్మకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇన్ని సేవలు చేసిన, తగోచ్చిన మా బాపు దెబ్బల తిప్పలు తనకి తప్పలేదు అన్ని బరించేది. నాకన్నా కొంచెం పొడుగున్న మా అన్న, ఏడుస్తూ మా అక్క, ఆపడానికి ఎంత ప్రయత్నించే వారో. ప్రతి రోజు రాత్రి బాపు వస్తున్నాడంటే గుండెలో దడ మొదలయ్యేది. ముసలోళ్ళు వాళ్ళు చెప్పిన పలితం లేకుండా పోయేది. తన అరుపులు మా గల్లీలో ఉన్న నా యిడు పిలగండ్లమందరికి వణుకే.
ఎంత గొడవ చేసిన కూడా ఒక్కసారికూడా బాపు మమ్మల్ని(నన్ను, అక్కయని, అన్నయ్యని) ఏమనలేదు. అదే మహా బాగ్యం అనుకునేది మా అమ్మ. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది.
అప్పుడుప్పడు పుట్నాలమ్మకి మా అమ్మ పాత చీర ఇస్తే, చీరను ప్రేమగా తాకుతూ. కంట నీరు పెట్టుకునేది. నువ్వు సల్లగుండాలి అవ్వ అంటూ దండం పెడుతుంటే. ఇదంతా అమ్మ కొంగు చాటున నుండి తొంగి చూస్తుండే వాణ్ని. అప్పుడనిపించేది, మనసులకి కావాల్సింది, డబ్బు కాదు ఒక మంచి మాట, చిన్న ఆప్యాయత, ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్ళు. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికి సేవ చేసేది. ఆవును పట్టుకొని ఇంటి ముందుకొచ్చే జంగాయన నుండి మొదలు పెడితే, కూరగాయలు అమ్ముకునే పెద్దమ్మ, చీరాల భద్రయ్య, వయసు పైపడి వంక కర్ర ఉతంతో పొద్దున్నే బన్ను రొట్టె తెచ్చే ఫతిమమ్మ, మెడలు పట్టుకుంటే సరి చేసే డబ్బా కదా అంటి, పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు, మా విధి చివర్లో ఉన్న బాపనామే, పిరికెడు బియ్యం కోసం రోజు వచ్చే ఓ ముసలి తాత వరకు అందరు మా అమ్మ సేవకు ప్రతిఫలంగా మమ్మల్ని దీవించే వాళ్ళు. మా అమ్మ మాకు తెలియకుండానే మా మనస్సులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక. కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికి నను ముందుకు నడిపిస్తుంటుంది.
ఆ రోజు పుట్నాలమ్మ తన ప్రేమను బటానీలు, పుట్నాలతో పెద్ద గిన్న నిండా నింపి ఇచ్చింది. గిన్న నిండా ఉన్న పుట్నాలు బాటనీలను చూడగానే నా మనసు ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. అందుకేనేమో మా పుట్నాలమ్మ ఇప్పటికి నా మనసులో మేదులుతుంటుంది.
తెల్లారి ఆదివారం. దోసెడు నిండా ఒక పేపరులో పుట్నాలు, ఇంకో పేపర్లో బటానిలు కొంచెం బెల్లం జత చేసిపొట్లం కట్టుకొని, సంచిలో పెట్టుకొని, నేను సాబిర్ కొడుకు ఆరిఫ్, పాష భాయి కొడుకు అమ్జాద్, గుండం వాడ అబ్జల్, ఇర్షాద్, ఆరిఫ్ వాళ్ళ చిన్నమ్మ కొడుకు యాకుబ్ పాషా, కాకతీయ కలని రవి గాడు, మచిలిబాజార్ హరి, రాగాపురం అనిల్. అందరం కలిసి ముళ్ళ చెట్లతో నిండిన బాధ్రకాలి చెరువు గట్టు ని ధాటి, గుడిని ధాటి విశాలంగా ఉన్న ప్రదేశంలో అందరు క్రికెట్ ఆడుతుంటే, నేను మాత్రం దూరంగా ఉన్న చెరువును ఆస్వాదిస్తూ ఒంటరిగా నా మనసుకు నేనే ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పుకుంటుండగా, అలసి పోయి ఒక్కొక్కరిగా వచ్చి నా పక్కన చేరే వాళ్ళు . అప్పుడు పొట్లాలు బయటికి తీసి అందరికి ఒక చేతిలో పుట్నాలు ఒక చేతిలో బటానీలు కొంచం బెల్లం పెట్టి. నేను కూడా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ మాటలు లేకుండా ఆస్వాదిస్తూ. దూరంగా పరుచుకొని ఉన్న చెరువుని గుట్టను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ గంటల కొద్ది గడిపేవాళ్ళం.
కొందఱు మన జీవితాల్లో చెరగని ముద్రలు వేస్తారు.
నిజమే కొన్ని అనుబంధాలు తర్కానికి అందవు కేవలం మానవత్వం అనే సన్నని తీగతో మా పుట్నాలమ్మ నా మనసుని అల్లుకుంది.
**
"నారాయణగూడ" "నారాయణగూడ" కండక్టర్ పిలుపుతో మెలకువ వచ్చి జ్ఞాపకాల తీగను తెంపి దబుక్కున కిందికి దూకి టైం చూసుకొని, అరరే టైంతో పాటే నేను కూడా యంత్రికున్నని, ఓ మరమనిషినని గుర్తు తెచ్చుకొని ఆఫీసు కి పయనమయ్యాను.
Saturday, August 6, 2011 at 3:08pm

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)