15, నవంబర్ 2011, మంగళవారం

నా కోరిక..



పూచే ప్రతి పూలరేక్కలపై సీత కోక చిలకనై వాలిపోవాలని..
తీరం నుండి చూడగా కన్పించే ఆ నింగి నీరు కలిసే చోటికి చేరాలని..
పలికే ఆ మురళి రంధ్రం నుండి విరిసే స్వరాల గాలిని పీల్చాలని..
ఈ చల్లని నీలాకాశపు రేయిలో సుగంధాల ప్రకృతి సోయగంలో సంతోషాన్ని ఆస్వాదించేందుకు చుట్టూ లేడీల పరుగేతలని..

**


దూరం వెళ్తున్న కొద్ది కంటికి చిన్నగా అగుపడుతున్న ఆ ప్రకృతి అందాన్ని ఎప్పటికి నా గుప్పిట్లో దాచుకోవాలని..
ఆ శీతాకాలపు మంచు చినుకులకు పులకరించి నా ఎద సవ్వళ్ళు హాయి జీవితాంతం ఆ హాయి అలాగే నిలిచిపోవాలని..
కమ్మని కలలే కంటున్నా న యద కనులలో ప్రతి ధ్వనించిన సంగితలను అమాంతం మదికి హతుకొని జీవితాంతం కౌగిలించుకోవాలని...


**


కోకిలల మ్రుదుస్వరాలు, సీతాకోకచిలుకల రంగు రెక్కల అందాలు, ఆ పొన్నంగి పిట్ట పై అలుముకొని పడుకున్న తొమ్మిది రంగుల అందాన్ని, జిలిబిలి పలుకుల మైన తుళ్ళి పది పదే పదే పాడే నా మనసు గీతాలను ఎప్పటికి నా చెవులకు వినసొంపుగా వినిపించే రాగాలను పలికించుకోవాలని.

చేపల వేట కోసం నీటిలో విసిరినా వల లాగా  ఈ ప్రకృతి అందాన్ని చివరి వరకు దొంగాలించెందుకు నా శరీరాన్ని వలలాగా విసరాలని...


కమలపు ఆకులపై నిలవలేక అటు ఇటు తిరుగుతున్న నీటి బోట్లపై పడుతున్న సూర్యకిరణ కాంతులతో దగ ధగ మెరుస్తున్న ఆ అందాలను ఒక్కసారిగా నా మదిలో దాచుకోవాలని..
నా మదిలోని భావాలను అక్షర రూపంగ మార్చే ఆ అందమైన బాషను తెలుసుకోవాలని " నా కోరిక.."