7, డిసెంబర్ 2011, బుధవారం

గణేష్ నిమజ్జనం పుణ్యమా అని తెలుసుకోగలిగాను
మా వీధిలో మహిళలకి కూడా ధో మార్ తీన్ మార్ వొచ్చునని. Sep 13 - 2011
మీడియా - పొట్ట కూటి కోసం క్షణం తీరిక లేకుండా ఏదో చూపిస్తూ వాగుతూనే ఉంటారు.
జనాలు సారి నేను - పొట్ట పెంచుకుంటూ ఎక్కడ పని లేక వింటూ చూస్తూనే ఉంటా(ము). Sep 13 - 2011
తప్పొప్పుల విజయానికి కాలం ఓ అడ్డుతెర. Sep 12 - 2011
తప్పు నీది కాకా పోయిన ఎందుకంత ఈజీ గ లొంగిపోతావ్? అని మిత్రుడి ప్రశ్న.
దానికి నా సమాధానం.
వారంటే నాకిష్టం, వారికీ మనసుంది, త్వరగానే తెలుసుకుంటరనే నమ్మకం నాకు ఎలాగు ఉంది,
అంతకు మించి నా బెట్టుతో నేను వారిని కోల్పోధలుచుకోలేదు. Sep 12 - 2011
ఏంటి, మన పనులు కొందరికి పిచ్చిగా అనిపిస్తున్నాయా.
ఖంగారు పడకు తప్పు వారిదే మనది కాదు.  Sep 12 - 2011
మేలుకోనంత వరకు
చైతన్యం మౌనంగానే చూస్తుంది. Sep 9 - 2011
మళ్ళి కొత్తగా హ్యాపీ ని కోరుకోవడమెందుకు Already I Am in. Sep 9 - 2011
ముందు తలేత్తుకోవడం మొదలుపెడితే దించడం మాటే ఉండదు.
ఇక కాలం అంటావా మనం దూసుకుపోతుంటే అది ఎప్పుడు అడ్డురాదు. Sep 9 - 2011
దూరాన కొండలపై తలుకుమనే కాంతులతో వీధి దీపాలు,
చెక్కిలి నిమురుతూ వీస్తున్న చల్లని గాలి,
ముసురుకున్న చీకట్లు,
అప్పుడప్పుడు పలకరిస్తున్న చిన్నచిన్న చినుకులు.
రైలు పట్టాలపై ఒక వైపు నేను మరో వైపు తను
పడిపోకుండా సర్దుకుంటున్న మా ఇరువురి చేతులు.
చాల రోజుల తర్వాత
"నేను తను మరియు స్వీట్ కార్న్" @ మల్కాజ్గిరి రైల్వే ట్రాక్ 10.15 pm..
Sep 8 - 2011
facebook - బెయిల్ కూడా దొరకని ఓ అందమైన జైలు. Sep 8 - 2011
మిత్రమా సాధ్య అసాధ్యాలు మరిచిపో ఓ దర్శకుడిగా కనీసం నీ ఊహలోనైన ఉహకందని ఫ్రేములను చిత్రించుకో. Sep 8 - 2011
మొదటిసారి నిశ్శభ్దాన్ని అస్వాధించాలనే తపన మొదలయింది. Sep 8 - 2011

కన్నీటిని మరిచి చాల కాలమైంది.
మళ్లి గుర్తుచేస్తున్నందు కృతజ్ఞున్ని.
మీ లాంటి మిత్రులను పొందగలిగినందుకు ధన్యుణ్ణి. Sep 7 - 2011
అభిరుచి ఉంటె మంచిదే అది ఇంకొకరి మనో భావాలను దేబ్బతీయనంత వరకు.
మానసికంగా ఎంత స్వతంత్రులమైన వ్యక్తిగతంగా మనం వ్యక్తుల మధ్య ఉన్నామని మరవకపోతే మంచిది. Sep 7 - 2011
అవకాశాన్ని సృష్టించుకుంటాను. వెతుక్కోవడం నాకు తెలియదు. Sep 7 - 2011
జరిగిన తప్పును తలుచుకుంటూ భాధ పడకు మిత్రమా.
ఒక సారి జరిగిన తప్పు మరో సారి జరక్కుండా నీకు తెలియకుండానే నువ్వు జాగ్రత్త పడతావు ఇది చాల సహజం.
ఇక మనసుకు తగిలిన గాయం అంటావా దాని కళ్ళెం ఎలాగు నీ చేతిలోనే ఉంది నచ్చినట్టు మలుచుకోవచ్చు. Sep 7 - 2011
నాకు ప్రాక్టికల్ గ ఎలా ఉండాలో తెలియదు.
తెలిసిందల్ల ఒక్కటే నేను నాలాగే ఉండడం. Sep 7 - 2011
మా తాత తరం మా నాన్న తరం అదే చేసారు ఇప్పుడు నేను అదే చేయాలా.. నా వళ్ళ కావట్లేదు.
ఇక ఎంతకాలం అని ఆడిపోసుకుంటాం "ప్రభుత్వాన్ని - వ్యవస్థని" Sep 7 - 2011
సమాజాన్ని ఉద్ధరించడానికి
-సభలు సమావేశాలు ప్రసంగాలు కొత్త కొత్త పథకాలు ఇంకా ఏవేవో కార్యక్రమాలక్కర్లేదు.
-ఒక్కసారి మానవత్వం గల మనిషిల బ్రతకడానికి ప్రయత్నిస్తే చాలు. Sep 7 - 2011

6, డిసెంబర్ 2011, మంగళవారం

మనం మారం. మార్పుని మాత్రం అందరిలో కోరుకుంటాం. Sep 7 - 2011
వ్యవస్థ కుళ్ళి పోయిందంటారు.
రండి శుబ్రం చేద్దామంటే.
టైం లేదయ్య... అయీన నాకు ఎందుకొచ్చిన గొడవ అని సమర్ధించుకుంటారు. Sep 6 - 2011
ఎంత బీదరికాన్ని అనుబవించిన కాలంతో పాటు జీవన పరిస్థితులు మారుతాయి.
మన సమాజం లో డబ్బు అనేది సమస్యే కాదు. Sep 6 - 2011
భగవంతున్ని నమ్మిన వాడు ఎన్నడు మోసపోడు.
నువ్వు నమ్మవలిసిన ఆ భగవంతుడు ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడు.
నీలో ఉన్న భగవంతున్ని తెలుసుకుంటే ప్రతిది తెలిసినట్టే. Sep 6 - 2011
I love my faults & difficulty's because i have faith on God. Sep 6 - 2011
ప్రేమ కోరేది ఇవ్వలనుకున్నది - ఆత్మీయ అనురాగాన్ని, ఆప్యాయతని, చల్లని చూపుని, ఒక ధైర్యాన్ని అంతే కాని శారీరక సుఖాన్ని కాదు.
ప్రపంచం మొత్తం నిను కాదన్న నీకోసం నేనున్ననే తోడుని, నువ్వేం చేసిన సహిస్తూ నివు కోరుకున్నది ఇవ్వడానికి పరితపిస్తూనే ఉంటుంది ప్రేమ.
అది గుర్తించి అర్ధం చేసుకోగలిగితే ఎవరికీ వారు వారికి అర్ధమైనట్టే.
నీలో ఉన్న ప్రేమని నీవు అర్ధం చేసుకోగలిగితే ఇక సంఘర్షణలకు తావు లేదు. సంఘర్షణలు లేని ప్రేమ ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. Sep 5 - 2011
విద్యతో పాటు జీవితంలో ప్రేమగా ఓర్పుగా సహనంతో బ్రతకడం నేర్పించి నాకు మరో జన్మనిచ్చిన గురువు గారికి సదా నా పాదాభివందనములు. Sep 5 - 2011
అసలు ప్రేమను కోల్పోతే కదా తిరిగి పొందడానికి
ఒక్కసారి అల్లుకుంటే శరీరాన్ని కోల్పోయిన ఆత్మను అతుక్కొనే ఉంటుంది - ఈ ప్రేమ.
అది తెలుసుకోలేక పోతే ఎన్నటికి అర్ధం కాదు - ఈ ప్రేమ Sep 4 - 2011
ప్రేమ మనసులకు సంబంధించింది మనషులకు కాదు.
విడిపోయేది మనుషులు మనసులు కాదు. Sep 4 - 2011
నిజంగా మీకు ప్రేమంటే ఏంటో తెలిస్తే
ఊరికే ఓడిపోనివ్వకండి - ప్రేమని. Sep4 - 2011
ఎవరు ఎలా అర్ధం చేసుకున్న కనీసం ఎవరికీ వారు అర్ధమైతే అదే అద్రుష్టం. Sep3 - 2011
విద్య కనీసం బ్రతకడం ఎలాగో నేర్పించగలిగేధై ఉండాలని నా ఉద్దేశం. Sep 3 - 2011
ఎవరికీ కనిపించని అందాన్ని చూడగలగడమే సృజనత్మకతైతే
అదే అందాన్ని అందరు చూడగలిగేల చూపెట్టడమే ఫోటోగ్రాఫర్ యొక్క కనీస ధర్మం. Sep 3 - 2011
ధర్నాలతో మనమేదో దేశాన్ని ఉద్ధరించనక్కరలేదు.
కనీసం మనం మానవత్వం గల మనుషులుగా ప్రవర్తిస్తే చాలు. Sep 3 - 2011
మ్యూజియం: అప్పుడెప్పుడో రాసుకున్న పిచ్చి గీతాలన్నీ ఇప్పుడు ఏ.సి. గదుల్లో సుఖంగ ఉన్నాయి. Sep 3 - 2011
సామాన్యుడి కనీస అవసరం తీర్చలేని ఏ నినాధమైన, యుద్దమైన, ధర్నాఐన పనికి మాలినవే. Sep 3 - 2011
మనం ఎలా జీవిస్తున్నమనేది పరిస్థితుల పైన అధారపడిలేదు .
పూర్తిగా మన ఆలోచనల చేతల్లో ఆధారపడి ఉంది.. Sep 3 - 2011
జీవితం లో కమిట్ మెంట్స్ చాల ఉంటాయి.
కొన్ని మనం కోరుకున్నవి.
మిగతావి వద్దనుకున్న రుద్దుకున్నవి. Sep 3 - 2011
ప్రతి రోజుని ఆనందించడం తెలియని వారే week ends ని కోరుకుంటారు.
వారి కోసం నా తరపున Happy Weekend.. Sep 3 - 2011
జీవితంలో మనకి చివరికి మిగిలేది
మనల్ని ప్రేమించే వారు, మనం ప్రేమించే వారు కాదు.  Sep 2 - 2011
ప్రేమంటే నాకు తెలియదు.
అందుకే
నను ప్రేమించే తన వద్దే ప్రేమను నేర్చుకుంటూ.
తిరిగి తననే ప్రేమించడం మొదలు పెట్టాను. Sep 2 - 2011
దేవుడు పేదవాడు కాదు.
పేదవాడైతే వాడు దేవుడే కాదు. Sep 2 - 2011
ప్లాస్టిక్ బాగ్ నిషేధం పుణ్యమా అని షాపింగ్ మాల్ నుండి చిన్న చిన్న వ్యాపారుల వరకు మంచి లాబాలనే గడిస్తున్నారు.
ఉచితం గ ఇవ్వకుండా ఒక్కో ప్లాస్టిక్ బాగ్ ని మూడు నుండి ఐదు రూపాయల చొప్పున అమ్ముతున్నారు.
దబాయిస్తే మీరే ఓ సంచి తెచ్చుకోండి అని తాపీగా చెప్తున్నారు. ఇంటికి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ లో ప్రతి రోజు 600 నుండి 800 ప్లాస్టిక్ బాగ్ లు అమ్ముడవుతున్నాయంటే ఊహించొచ్చు ఎంత లాబసాటి బిజినెస్సో.... :p Sep 2 - 2011
నేను చూసిన ఒక్కొక్క క్షణం నన్ను చూడకుండా మొహం తిప్పుకొని నాకు దూరంగా పరుగెడుతున్నాయి.. Sep 2 - 2011