12, జనవరి 2012, గురువారం


నాకంటూ ఒకరున్నారు అనే అనుభూతే గొప్ప ధైర్యన్నిస్తుంది.
కొందరి ధైర్యానికి నేను కారణం అవడం నాకు సంతోషాన్నిస్తుంది.. Nov 8 - 2011

కొన్ని అనుభూతులులకు భాషను వెతకడం కన్నా
మౌనంగా ఆస్వాదించడమే మిన్న.. Nov 8 - 2011
పేస్ బుక్ అంతం కోరుతున్న - మా వీధి లైబ్రరీలు, పార్క్ బెంచీలు, చాయ్ దుకాణాలు, ఇంటి ముందు అరుగులు, రచ్చబండలు. Nov 4 - 2011
పేస్ బుక్ - ఎవరు నావారు కారని తెలిసిన అందరు నావారే అనే వెర్రి భ్రమను కల్పించే ఓ వింత చోటు.. Nov 4 - 2011

హారతి విలువ - ఇస్తున్న వారికి కళ్ళకి అద్దుకునే వారికి ఇద్దరికీ తెలిసి ఉంటె బావుండని నా ఉద్దేశం.
మంచిది అనే ఒక కారణం తప్ప. ఎందుకు చేయాలో తెలియనపుడు చేయకపోవడమే మంచిది. Nov 4 - 2011
Things are going well. I think i am holding Right Thoughts.. Nov 4 - 2011
కమ్మని కవితని కనే కవికి కదిలే మదియే కదా కారణం. Nov 3 - 2011

మిత్రుడి నాన్నగారు మనసులని రిపేర్ చేసే చోటుని ఏర్పాటు చేసాడట అదేనయ్యా కౌన్సిలింగు సెంటరు.
ఎవరిదైన మనసు విరిగితే చెప్పండి. ప్లాస్టర్ వేయడానికి సిద్ధంగ ఉన్నాడు. Nov 3 - 2011

పెరుగుతున్న పెట్రోలు, వంట గ్యాస్ రెట్ల పుణ్యమా అని
కనీసం క్షణకాలం అయిన అట్లాస్ సైకిల్, కట్టెల పొయ్యి మళ్ళీ గుర్తుకొచ్చాయి.. Nov 3 - 2011

నిన్నటి జ్ఞాపకాల్లో అస్తమించి, మళ్ళి ఉదయించాను నేడు.
రేపటికై ఓ అందమైన తీపి గుర్తుని మిగుల్చుకోవడానికి. Nov 2 - 2011
ఫోటోగ్రాఫర్ కి లోకమంతా రంగులమయమే.. Nov 2 - 2011

I am only desiring. Lord is arranging everything.
So credit goes to my lord who staying in me.. Nov 2 - 2011

డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకునే బదులు.
సృజనాత్మకతని పదును పెట్టె పనిలో ఉన్న.. Nov 2 - 2011
వారి అవసరం మనకు ఎంత ఉంటుందో. మన అవసరం కూడా వారికి అంతే ఉంటుంది. కాస్త సమయం అటు ఇటు అంతే.. Nov 2 - 2011
సలహాలు చెప్పే వారు ఎంత మంది ఉన్న చివరికి పూర్తి చెయ్యల్సింది నువ్వే.. Nov 1 - 2011

పాపం నా మిధ నాకే జాలేస్తుంది. మా నాన్నని ప్రేమించలేకపోతున్నాందుకు.
తప్పు తన మందు బాటిలుదే అని తెలిసిన.. మా ముగ్గిరి జీవితాల విషయం మొత్తం తన చుట్టే అల్లుకొని తనతో మొదలైనందుకు..
-నాన్న ఇప్పుడు నేనున్నా వయసులో నీపై జాలి పడడం తప్ప మరో అనుభూతి కలగడం లేదు. Oct 31 - 2011
సృష్టిలో ప్రతి జీవికి కుటుంబం అనేది ఓ సహజ అవసరం అనడం కన్నా ఆత్మ పరిపూర్ణతకోసం సాగించే ప్రయాణంలోని ఓ భాగమే అని నా అభిప్రాయం. Oct 31 - 2011
మిత్రమా మనం ఈ భూమిపై శిక్షని పూర్తి చేయడానికే వచ్చాం. మనిషి జీవితమే అందంగా కనిపించే జైలు. Oct 31 - 2011

అవగాహనా పెరుగుతున్న కొద్ది, ప్రతి వ్యక్తి తమకంటూ తమ చుట్టూ వృత్తాలను గీసుకోక తప్పదేమో.
అవే లేకుంటే బహుశ విమర్శకు తావెక్కడిది.. Oct 31 - 2011
ఇష్టలనేవి వ్యక్తి ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. Oct 31 - 2011

అసాధ్యాలను సుసాధ్యాలు గావించేది నీలో దాగిన ఆత్మ
కళ్ళు మనసు మెదడు బుద్ది కేవలం పనిముట్లు. Oct 31 - 2011

వ్యక్తులపైనే నమ్మకం లేదు.
ఇక అభిప్రాయం ఎలా పుడుతుంది. Oct 31 - 2011
Shit my Modern education never teaches how to maintain a heartful relation ships. They only teaches names Like technology, success, focus, number one, knowledge, time, money, designations etc..  Oct 31 - 2011

తనకేం కావాలో తెలుసుకోవడంలోనే పాతికేళ్ళు గడిచాయి.
తనకు కావాల్సింది సాధించుకోవడానికి ఇంకెన్నాళ్ళు గడిచిపోతాయో.. Oct 31 - 2011

"ఒంటరితనమే ఆనందం అనుకున్న తనకి ఇప్పుడు అదే నరకమై కుర్చుందంట."
ఎన్నో ప్రతిభ పురస్కారాలు, అందరి మన్నలను అందుకొని మరెందరికో ఆదర్శంగా నిలిచినా మా విధిలో ఉండే కళాకారుడు ఇప్పుడేవ్వరికి అక్కరలేకుండా ఒంటరితనంతో అనుక్షణం యుద్ధం చేస్తున్నాడు. Oct 31 - 2011

శిథిలమవుతున్న చరిత్రలో అధ్బుతాలకోసం ప్రయత్నిస్తూ మిత్రుడొకడు చరిత్రలోకెక్కాలనుకుంటున్నాడు.
All The Best.  Oct 31 - 2011

ఆత్మ శక్తిని కొంచెం ఉపయోగించిన చాలు ఎన్నో అధ్బుతాలు సాధించొచ్చు. అని ఎవరో చెప్పారు.
అది నిజమే అనిపించినా పాపం దాని గురించి పట్టించుకునే టైం మనకెక్కడిది.. Oct 31 - 2011
  
ఎంత జాలి గుండైన అప్పుడప్పుడు వాస్తవం లో బ్రతకడం కోసం గరుకు చేసుకోక తప్పదేమో.. Oct 30 - 2011
కొన్ని అనుబంధాలు ఎంత భలమైనవో. అంతే భాధాకరమైనవి. Oct 30 - 2011

ప్రతి కళకి భాష ఉంటుంది.
అది మెదడు తో బేరీజు వేసేది కాదు.
మనసుతో వింటూ, ఆత్మతో ప్రతిస్పందించాలి. Oct 30 - 2011

నీ ఆలోచనలను చీకటి గదిలో భందించకు మిత్రమా.
ఒక్కసారి స్వేచ్చ ప్రపంచంలోకి వచ్చి ఊపిరిపీల్చు.
నీకే తెలుస్తుంది. నీ ఆలోచనలకూ ఎంత బలముందో. Oct 29 - 2011
ఇతరులకు హాని కలిగించనంత వరకు ఏ చోటు ఐన నీ చోటే.. Oct 29 - 2011
ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది - వ్యక్తిత్వం. Oct 29 - 2011

నువ్వు చేసిది సరైనదేనని నీకు నమ్మకం ఉంటే. నిను వెనక్కి లాగే వారిని పట్టించుకోకు.
ఈరోజు హేళన చేసిన వారే, తర్వాత నోర్లు మూసేసుకుంటారు. కొద్దిరోజులకు వారే పొగుడుతుంటారు.. Oct 29 - 2011
కళాకారుడికి లోకమంతా ఒకటే. Oct 27 - 2011
ఏంటి మనల్ని చూసి అసూయపడుతున్నర. మంచిదే మనం సమ్ థింగ్ స్పెషల్ అని వారికి అర్ధమైనట్టే కదా. Oct 25 - 2011

మతాలకతీతంగా జరిగే దీపావళి ప్రతి వారి ఆలోచనల ఆచరణలో సంతోషాల వెలుగుని తీసుకురావాలని కోరుతూ. మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, గురువులు మరియు బంధువులందరికీ మనస్పూర్తిగా దీపావళి శుభాకాంక్షలు..
-రఘు. Oct 25 - 2011
అందరికి కావాల్సింది సంతోషం. సరైన సంతోషం ఎలా ఉంటుందో తెలియకే ఈ కన్ఫ్యుజన్. Oct 21 - 2011
కనుసైగ తోటి కనుదాటి వెళ్లి నా చిరు గుండెల్లో కరగని కలవై నిలిచావని ఎలా తెలపను. Oct 20 - 2011

నువ్వు నా ఎదురుగా నిల్చుంటే - జరిగేదంత కలగా ఉంటే.
నాక్కూడా కన్నీరోచ్చింది - నను విడిచి వెళ్ళే సంగతి నిజమని తెలిసి.. Oct 20 - 2011

నా మనసులో ఏమి దాగుందో కాలానికి తెలియదు.
కాని ముందున్న కాలమంత నాదేనన్న చిన్న భ్రమ. ఆ భ్రమలోనే ఇంతకాలం వేచి ఉన్న. Oct 20 - 2011
నేనే కాదు అందరు కాలం వలలో చిక్కుకున్న వారే.. Oct 20 - 2011
Photography is not my daily Bread. It's my Breath. Oct 19 - 2011
మనం గుర్తించం కాని మౌనంగా మనల్ని అభిమానించేవారు ఎక్కువే. Oct 19 - 2011

గింజుకున్న రానిది యవ్వనం .
కష్టం లేకుండా వచ్చేది ముసలితనం. Oct 19 - 2011
(తెలీకుండానే గడిచిపోయేది జీవితం... ; mahesh cont.)
మార్పు తెలుస్తున్న మోజు తరగదు. అద్దంలో ఇకిలిస్తున్న మన రూపంపై. Oct 19 - 2011
అజ్ఞానితో తలపడకండి. చూసే వారికి అర్ధం కాదు ఎవరు జ్ఞానో..  Oct 19 - 2011
మరణం - ఓ జీవిత కాలపు అనుభవం. Oct 19 - 2011
నిజం నిప్పులాంటిది అది లంచం జల్లులో తడవక మానదు. Oct 17 - 2011

ఈ మధ్య కాలంలో నేనెక్కడికెళ్ళిన విరివిగా కనిపిస్తున్న వాక్యం.
"ఫోటోలు తీయరాదు"
"ఫోటో కీంచ్న మన హే"
"ఫోటోగ్రఫి ఈస్ నాట్ అలోవ్డ్"
-మన దేశం లో అకౌంటిబిలిటి కరువైంది కాబట్టి, పర్మిషన్ ఇచ్చే ధైర్యం కూడా ఏ అధికారికి లేదు. నేను ఎవరిని అడగదలుచుకోలేదు. Oct 17

దూరం మనసుల మధ్య ప్రేమను పెంచి దగ్గరయ్యేందుకు తోడ్పడితే.
మరింత దూరం వారు లేకుండా బ్రతకడం ఎలాగో నేర్పుతుంది. Oct 17

10, జనవరి 2012, మంగళవారం

ఎవరికీ నచ్చినట్టు వారు జీవించొచ్చు - మనం ఒక మనవ సమాజం లో ఉన్నామన్న విచక్షణ జ్ఞానంతో. Oct 17 - 2011
స్వీకరించడానికి, వదిలించుకోడానికి కావాల్సింది కాస్త ఇంగిత జ్ఞానం, కాస్త తెలివి, కాస్త ధైర్యం. Oct 17 - 2011

జీవితం లో కొన్ని పరిచయాలు. జీవిత స్థితి గతినే మార్చేస్తాయి.
అది మంచైనా, చెడైనా పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొనే హక్కు, స్వేచ్చ, తెలివి ఎప్పుడు మన చేతుల్లోనే ఉంది. Oct17 - 2011
మనకు ఎదురయ్యే అనేక సమస్యలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనమే కారకులం. ఇతరులు కాదు. Oct 17 - 2011
అంతరంగానికి చిననాటి జ్ఞాపకాల నీడలే సేధతీర్చుతున్నాయి. Oct 14 - 2011
కనిపించే నవ్వులో దాగిన కన్నీటి రూపాన్ని గ్రహించగలిగేవారు దొరికితే. - అద్బుతం ఈ జీవితం. Oct 14 - 2011
పుట్టుక - చావుకి మధ్యలో వేలడుతున్నదే జీవితం. Oct 14 - 2011

ఇంటినుండి రోట్లో నూరి అమ్మ పంపిన పుదిన పచ్చడితో లంచ్ పూర్తి.
ప్రతి ముద్దలో నెమరు వేసుకొన్నతీపి జ్ఞాపకాలు. మనసునిండా అల్లుకున్నాయి.. Oct 14 - 2011

అత్త కోడళ్ళ సిరియల్ కోసం భర్త కొన్న ప్లాజ్మా టీవీ రేపైర్ కొస్తే అలిగి మాట్లాడని భార్య.
హాఫ్ డే లీవ్ పెట్టి షో రూం కెళ్ళిన నా అమాయక మిత్రుడు. Oct 14 - 2011

ఈ మధ్య కాలంలో ఫోటో ఇస్తే చాలు ఇంటికొచ్చి మరి వోటర్ ఐడి తెచ్చిస్తున్నారు.
ఒకప్పుడు అవసరం కోసం చెప్పులరిగేల తిరిగిన నాకు ఇది కాస్త ఆశ్చర్యం కలిగించిన విషయం. Oct 14 - 2011
అబ్బో కథ రాయడమంటే రివ్యూ రాసినంత ఈజీ కాదని అర్ధమవుతున్నది.  Oct 14 - 2011
నా అలోచనలకు స్థానం లేక పోయిన సర్దుకుపోగలను, ఎదుటివారి ఆలోచనలు నాకు నచ్చితే.. Oct 14 - 2011

డబ్బు అనే పదం మా ఇంట్లో వాళ్ళని ఎప్పుడు వెక్కిరిస్తూ ఉండేది. ఇప్పటికిను.
ఆ పధం మాకే అనుకున్న ఇంకా చాల మందిని వెక్కిరిస్తుందని తెలుసుకోగలిగాను.. Oct 13 - 2011
చరిత్రను నెత్తిన రుద్దుకొని, వృత్తాలని గీసుకొని, ఊరికే అల అంతమవకు మిత్రమా.. Oct 13 - 2011

చేసే తప్పులకు అందరు ఇచ్చుకొనే సులభమైన పేర్లు
కర్మ, అనుభవం. Oct 13 - 2011


నీ అవసరం వారికి లేకపోయినా నీకు వారు కావాలనిపిస్తుంది. కొద్ది రోజులగు వారికి అదే జరుగుతుంది.
ఎంతైనా మార్పు సహజం కదా.. Oct 13 - 2011

నీవు కోరిన వారు నీ మనసుని ముక్కలు చేస్తే.
నిన్ను కోరే వారు ఆ ముక్కలను తిరిగి అతికించే ప్రయత్నం చేస్తారు. Oct 13 - 2011
నీతి సూక్తులు చెవులకు ఎంత ఇంపుగా ఉన్న వాస్తవానికి అవి చాల మంది జీవితాలకి ఎంతో దూరం.  Oct 13 - 2011

వాస్తవానికి ఆత్మీయ అనుబంధాలు అవసరాల కోసమే నిర్మించుకుంటామని కొందరంటారు.
"ఒక్క సారైనా నేను మనిషిని, నాకు మనసుందని గుర్తు తెచ్చుకోవడానికైన కొన్ని బంధాలు అవసరం" అని నేనంటాను. Oct 13 - 2011
జీవించడం ఎలాగో తెలుసుకోనేసరికి ఈ దేహం మన మాటే వినదు. Oct 13 - 2011

మా నాన్న గారి పుణ్యమా అని ఇంట్లో ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో నా చిన్నతనం గడిచింది.
భయం లేకుండా గడిపిన రోజులు చాల తక్కువ. దానికి కారణం నాన్న ప్రేమించే మందు బాటిల్ కావచ్చు.. Oct 13 - 2011

పచ్చని పరువాలను తెగ నరికేసుకొని తిష్ట వేసుకున్న ఈ కాంక్రీటు అడువుల్లో నీ జాడ లేదే. అని అనుకుంటున్నా తరుణంలో చాల సంతోషం వేసింది. చాల కాలం తర్వాత కనిపించిన పిచ్చుకలను చూసి.
"మెరిగెలు వేస్తే వాకిలి నిండా నిండిపోయే ఆ పిచ్చుకల గుంపు నాకు దొరక్కుండా నన్ను ఎంత పరిగెట్టించేవో" ఆ రోజులే వేరు.. Oct 13 - 2011

నా దృష్టిలో మార్పు ఎక్కడో లేదు కలగవల్సింది మన మనస్సులో,
మనమేంటో తెలుసుకొని మసలుకోగలిగితే. ఎప్పుడో కోల్పోయామని బావిస్తున్న కల్మషం లేని మనసు దేహం వదిలే వరకు అలానే ఉంటుంది.
పాపం నా వయసు పెరిగిన నా మనసు మాత్రం అక్కడే ఆ కల్మషం లేని చిన్ననాటి మనసుల మధ్యే తాచ్చడుతున్నది. Oct 12 - 2011
నువ్వు ఎంత వెతికినా చివరికి నాలో మిగిలున్నది నీపై నాకున్న ప్రేమే. Oct 12 - 2011
ఆనందం ఎక్కడో లేదు నా చుట్టే, నా చెంతే, నా లోనే ఉందని చివరికి తెలుసుకొని, రేపనే ఒక క్షణం మిగిలిఉందని మరిచి ఇదే నా చివరి క్షణం అని ఆనందంగ గడపడమే నా పనిగా పెట్టుకున్నాను. Oct 12 - 2011
ఎపుడైతే ఏది నా చేతిలో లేదని, ప్రతి చర్యని నా ప్రమేయం లేకుండానే భగవంతుడు రాసి పెట్టాడని, నాలోనే ఉండి అనుక్షణం నను నడిపిస్తున్నాడని, తెలుసుకున్నరోజే తెలుసుకోగాలిను నేను ఎక్కడో తప్పిపోలేదు. కేవలం నన్ను నేను అర్ధచేసుకోవడం లోనే ఇంత కాలం సతమతమావుతున్నానని.  Oct 12 - 2011

మతిమరుపే నాకో పెద్దవరం.
అదేగనక లేకపోతే ఇంకా చేదు జ్ఞాపకాల కంచెలోనే ఇరుక్కుపోయే వాణ్ణేమో.. Oct 12 - 2011


కొన్ని వందల వ్యక్తుల ఆలోచనల సమాహారం ధూళి అనే మేకప్ ని రంగరించుకొని, మౌనంగా ముడుచుకొని,
సేధతీరుతున్నాయి. మా వీధి లైబ్రేరీలో.. Oct 12 - 2011
Never Think - I Know Many Things. Oct 11 - 2011

దసరా వేడుకలు, ఫోటో షూట్ లు, త్వరలో ప్రారంబం కానున్న ఆర్ట్ మాగజిన్ కార్యక్రమాలు, కథ చర్చలు, సుదూర ప్రయాణాలు, కొత్త పరిచయాలు, కొత్త రుచులు
మరియు మొరాకో దేశపు "కరిమ ఎల్ అజిజి" తో కలిసి బర్కాస్ లో నివాసముంటున్న అరేబియన్ తెగ లపై డాకుమెంటరీ షూటింగ్, అబ్బోఈ వారం మొత్తం అద్దంలో నన్ను నేను చూసుకోలేనంత బిజీ అయ్యానా అని అనిపించింది - పెరిగిన గడ్డం చూసి. Oct11 - 2011

It is not easy to get love from someone.
It requires a consistent commitment..Oct2 - 2011
We try to admit our mistakes when the others has forgiving in nature.-Oct2 - 2011
It is not that easy to know the heart of a Person, Until a Person believes your heart...Oct2 - 2011

కొందరు మాటలతో లొంగ తీసుకుంటారు.
మరి కొందరు మౌనంతో చంపేస్తుంటారు.
ఎంత సున్నితమైన అప్పుడుప్పుడు రాయిల మారుస్తూనే దానికో మెదడుని అతికించక తప్పదేమో..-Oct2 - 2011
కనీసం ఓ మంచి లీడర్ ని ఎంచుకునే తెలివి లేని నాకు, పోరాటం చేసే హక్కు లేదు.-Sep30 - 2011
-ఈ మనోభావాలనే చాదస్తం, కనీసం కడుపులో ఆకలిని తీర్చిన బావుండేది.-Sep30 - 2011

"ఇగోస్తది అగోస్తది అంటుండ్రు అచ్చేది లేదు సచ్చేది లేదు. నాయన మీది ఏ ఊరైన మీ పొట్టక్కావాల్సింది నాలుగు మెతుకులు. ఆ తర్వాతే అన్నీ...
ఏందో మా పోరగాండ్లు ఎంత చెప్పిన ఇనిపిచ్చుకోరు. నీకేం దేల్వదుర ముసలోడ అంటూ నాకే దగ్గులు నేర్పుతుండ్రు."
-నిజమే జామకాయలమ్ముకునే తాతకున్న అనుభవం ముందు అన్ని యుద్దాలు పనికి రానివే, పనికి మాలినవే... -Sep30 - 2011

సకలం బంద్ పుణ్యమా అని బస్సును ఎక్కక పది రోజులు దాటింది.
నాలుగేళ్ల క్రితం నాటి ఆటో రోజులు మళ్లి వదలకుండా ఆటోలతో పాటు ముందు నిలబడ్డాయి.
నాలుగేళ్ళలో కలిగిన మార్పంత ఆటోల మీటర్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నది.
"ఎం సాప్ ఇంకా ఏ జమానాలో ఉన్నావ్, అన్ని పెరిగినాయి, గిప్పుడు బంధు నడుస్తుంది. అందరికి గీ ఆటోలే దిక్కు సందు జూసుకొని నేనేమి ఎక్కువ జెప్పట్లే ఇంకా తక్కువ జెప్తున్న రేటు."
-"అందరిలాగే నాకు రోజు గడవక మానదు,
అందరిలాగే కొలువుకి పోక మానలేను"
నిజమే ఇప్పుడు మా బొటోలందరికి ఈ ఆటోలే దిక్కు.-Sep30 - 2011
There is no peace in the world. When there is no peace in your heart.-Sep30

Trying to come out from In-security.
Because its driving me to live & work hard..-Sep28 - 2011
రేపటి భాధ కన్నా, ఈనాటి శిక్షే నయం..-Sep27 - 2011
చావాబోతున్నమన్న భయమే, చావు కన్నా భయంకరమైనది. -Sep27 - 2011

నువ్వు లేకుంటే ప్రపంచమే ఉండదు.
నువ్వే లేనపుడు ఇక నీకు ప్రపంచంతో సంబంధం ఏముంటుంది.
మరి నీకెందుకీ తాపత్రయం. -Sep21 - 2011

దేనిని చేరేందుకు ఈ గీతం..?
నీ మనసు చెవులను మూసేసాక.. -Sep 21 - 2011

"ఎన్ని పదాలో పలకాలని ముందుకొస్తు బెదురుగా నిలిచెను కనుల మాటున కన్నిళై.
ఎందుకంత మౌనం ఒక్కసారైనా ఈ కన్నిళ్ళని విను.." - Sep 21 - 2011
ప్రపంచానికి కీడు - మేధావి మౌనం. -Sep21 - 2011
ఈ అందమైన జీవితం మనకే సొంతం అనుకున్న సమయంలోనే వద్దనుకున్న, కాలం మనల్ని బాల్యానికి దూరం చేసింది. ఆ దూరం ఎంత దూరం అంటే కనీసం మన చిన్న నాటి గుర్తులని కూడా చూసుకునే అవకాశం లేకుండా. -Sep21 - 2011

మిత్రమా రెండు మనసుల కలయిక ఓ కెమికల్ రియాక్షన్ అని నీ సైన్సు తో ముడి పెట్టకు.
నేను సైన్సు ని నమ్మను.
పాపం సైన్సు. ప్రకృతి చేతిలో అది ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది. -Sep17 - 2011
ప్రకృతి ఎప్పుడు సైన్సు కు సవాలే. -Sep17 - 2011
జీవితాంతం గుర్తుండడానికి. క్షణకాలం అనుభూతి చాలు. -Sep 17 - 2011
ఒకటో తరగతి, రెండో తరగతి, మూడో తరగతి... తప్ప మధ్య తరగతి అంటే ఎరుగని ఆ చిన్ననాటి రోజులే వేరు.. - Sep 16 - 2011
నిజమే - ఒక్కోసారి మౌనమే అన్నిటికన్నా పెద్ద ప్రశంస. -Sep 16 - 2011

సూర్యుడు అందరికి సమానంగా వెలుతురు పంచినట్టే.
అందరి జీవితాల్లోను వెలుతురు ప్రసాదించాడు భగవంతుడు.
ఆ వెలుతురిని మన ఇళ్ళలోకి మన జీవితాల్లోకి రానివ్వకుండా మనమే అడ్డుకుంటున్నాం. -Sep 16 - 2011
నిజమే తవ్వుతున్న కొద్ది ఎన్ని ఆనందాలో - బాల్యానికున్న మహత్యమే అలాంటిది. -Sep 15 - 2011

ప్రమంచమేమి నువ్వనుకున్నంత చిన్నదేమీ కాదు.
అల అని నీ మనసుకు అందనంత విశాలమేమి కాదు. - Sep15 - 2011

ఊహ తెలిసినప్పటి నుండి మనసులో దాగిన మాటను వ్యక్త పరిచే ధైర్యం నాకు కలగ లేదు.
ప్రపంచంలోనే ఉన్న ప్రపంచానికి దూరంగా ఎవరికి అర్ధం కాకుండా, నేనెవరో తెలియకుండా, మౌనంగా గడిపిన లెక్క లేనన్ని రోజులు ఎన్నో... -హమ్మయ్య ఏదైతేనేమి ఇప్పటికైనా ఆ స్థితి నుండి బయటపడగాలిగాను. - Sep14 - 2011

పప్పు చారు అప్పడాలతో భోజనం పూర్తి.
డోర్ నుండి వీస్తున్న గాలి కిటికీ గుండా పారిపోతుంటే నా ప్రమేయం లేకుండానే బయటికి తొంగి చూడగా చల్లని గాలులతో కూడిన జోరు వర్షం.
-చక్కని చీకటి, వర్షపు సంగీతం మరియు పల్లి పట్టి. @ Home 8.31pm -Sep 14 - 2011


ఆంతరంగికమైన ఎన్నో సమస్యలకు మౌనం చక్కని మందు.
కొంచెం చేదుగా ఉన్న కాలం అందులో కలిసిన కొద్ది కొత్త కొత్త ఆలోచనలనే రుచిని ఆస్వాదించగలం. -Sep 13 - 2011

కల్లాకపటం ఎరుగని బాల్యపు తీపిగుర్తుల్ని మరువని మనసు ఎప్పుడు నిత్య నూతనమే. ఆ మనసులు గల శరీరం అంత త్వరగా కాలం వెంట పరుగులు తీయదు. - Sep 13
మొన్నీ మధ్య నా చిన్న నాటి చూచి రాత బుక్ తీసి చూసా.
బుక్ చివర్లో "తెల్ల బూట్లు కొనుక్కోవడమే నా జీవిత లక్ష్యం" అని రాసుకున్న మాటలు, నవ్వు తెప్పించాయి. Sep 13 - 2011
ఎప్పుడు మాటల కొరతే, కొన్ని భావాలకి. Sep 13 - 2011
అప్పట్లో 75 ఇప్పుడు 55 పర్వాలేదు నా ఒళ్ళు నా కంట్రోల్ లోనే ఉందన్నమాట. Sep 13 - 2011