16, ఏప్రిల్ 2012, సోమవారం

బంధం - బంధనమైతే..?!

నా మిత్రుడు ఒక అమ్మాయిని మూడేళ్ళ నుండి ప్రేమించి క్రితేడాది పెద్దలు లేకుండా పెళ్లి చేసుకున్నారు.
అందరికి తెలిసేలాగే కాపురం పెట్టుకున్నారు.
పర్వాలేదు నాలుగు చేతుల సంపాదన చెప్పుకోవడానికి వారికి సమయమోకటే తక్కువ కాని ఆర్ధికంగా ఎలాంటి ఆపదలు వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి.  ఏమైనా అయితే ఇరువైపులనుండి ఆదుకోవడానికి పెద్ద మొత్తం లోనే ఆస్తిపరులైన ఇరువురి తల్లిదండ్రులు.
ఇక్కడి వరకు ఇక బాగానే ఉందనుకుంటుండగానే....

ఎప్పుడో గాని గుర్తుకురాని నన్ను ఉన్నపళాన రమ్మని ఫోన్ చేయడంతో ఇక వెళ్లక తప్పలేదు.

చినుకు చినుకు కలిసి గాలి వానయినట్టు. ప్రతి అనవసరమైన విషయాలన్నీ వారి అవసరమైనట్టు గులకరాళ్ళు వారికి కొండరాళ్ళ కనిపిస్తున్నట్టున్నాయి. అందుకే ఎక్కడలేని తూఫనంత వారివురి నడుమే.

ఇక ఇదే సందన్నట్టు "పోనీ లేరా ఇది కాకపోతే ఇంకొకతి దీనికన్నా మంచి పిల్లనే తీసుకొచ్చి పెళ్ళిచేస్తా వోదిలేయరా!" అని ఆడి అమ్మ ఆజ్యం పోసింది. ఇక వాళ్ళ అమ్మ ఏమైనా తక్కువ తిన్నదా "అబ్బో ఇగ నువ్వు చేస్తావు నేను చూడాలి. పోనిలేవ్వే నీకోసం పిలగాడు ఇప్పటికి రెడీ గ ఉన్నాడు నిన్ను చేసుకోవడానికి పదవే పదా....." అంటూ వాళ్ళమ్మ పొగలో కిరసనయిలేసి సెగ పెట్టింది.
ఇక నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికొచ్చి రేపోమాపో బంధం పుటుక్కుమనేలా ఉంది.

చదివిస్తే ఉన్నమతి చెడినట్టు అనే మా అమ్మ నోట విరివిగా వినపడే సామెత గుర్తొచ్చింది. నిజమే చదువుతో మేధావి తనంతో పాటు బంధాలను భలపరుచుకోవాలనే విషయం ఎందుకు నేర్చుకోరో... అసలు నేర్పిస్తే కదా.....

ఏంటో బంధాలు ఇంత భలహీనమైనవా?
నాలుగు ముచ్చట్లు, రెండు షికార్లు, ఒక సినిమా, సందు దోరికేతే పార్టీలు, స్ట్రెస్ కి ఫీలయితే కాస్త ఉపశమనానికి, విషయానికి ఓ తోడు.

ఇంకాస్త దూరంగా ఆలోచిస్తే ప్రేమ ఆ తర్వత వీలైతే పెళ్లి లేకుంటే సహజీవనం. ఏదైతేనేమి అన్ని ఇన్ స్టంట్ వ్యవహారాలు ఇన్ స్టంట్ జీవితాలు. చదువు వల్ల ఉద్యగం వల్ల కాస్త ఇండి విజ్యువాలిటి పెరగడమే దీనంతటికి కారణమా?  నా బతుకు నేను బతక గలను నా పరిధిలోకి నువ్వు నీ పరిధిలోకి నేను రాకుండా, నీ స్వతంత్రం నీది నా స్వతంత్రం నాది, అయిన నువ్వంటే ఇష్టం, సర్వస్వం, మనమెప్పుడు ఇలానే కలిసుందాం. సమస్య వొస్తే పరిష్కారించుకుందం.
కాని......... నా గమ్యాలు అవి, నా లక్ష్యాలు ఇవి. వీటికి నీకు అభ్యంతరం లేనంతవరకు మనం ఇలా కొనసాగుధం....

ఏంటో నవ్వొస్తుంది. పదాలకి అర్ధాలు మారుతుంటే..

ఎక్కడికేల్తున్నాయో మానవ సంబంధాలు, స్వచ్చమైన అనుబంధాలు, ఆప్యాయత అనురాగాలు, పాపం ఈ పదాలన్నీ చదువుకోవడానికి, వినడానికి, కథల్లో, కవితల్లో ఉపోయోగించుకోవడానికే మిగిలిపోయేలా ఉన్నాయి.

తప్పెవరిది అని అడిగితే ఓ..... పెద్ద పెద్ద మైకులేసుకొని తెగ లెక్చర్లు ఇవ్వడానికి లగేత్తుకొని వస్తారు.

హు.. మూలలే సరిగా లేనపుడు ఇప్పుడేదో వెలగబెడదాం అనుకోవడం కూడా బ్రమే.

ఏమి  రఘు ఏమ్ మాట్లడట్లేదేంటి నీ ఫ్రెండు కదా అని గుర్రుమంటూ చూస్తూ వెటకారంగా గయ్యిమన్నంత లెవిల్లో మా వాడి అమ్మ అరిచేసరికి తేరుకున్నాను (సాధారణంగా ఆవిడని పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తుంట. వాడి తరువాత నను కొడుకుల చూసుకునేది. ఆమె అంత కోపిష్టెం కాదు గాని ఇక వీడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి వీడితో పాటు నన్ను కూడా పురుగుల చూస్తున్నది. అందుకే అటువైపు వెళ్ళడమే తగ్గిపోయింది.) ఇక అరిచిన అరుపుకి విషయం నా వైపుకు మళ్ళింది అక్కడికి నేనేదో పొడిచేస్తాను అన్నట్టు.

బెదురు బెదురుగా పనమ్మాయి గ్లాసులో నీళ్ళు తెచ్చిస్తే తాగేస్తూ, నేను కిక్కురుమనలేదు. అనడానికి కూడా నా దగ్గర ఏమి లేదు కాబట్టి. ఏదో అలోచిస్తున్నోడిలా మొహం పెట్టి కూచున్న. కాసేపటి గొడవ తర్వత ఇక ఇది తెగేలా లేదని వాడ్ని బయటికి తీసుకొచ్చి కార్లో బయల్దేరాం..

విషయమంత  పూర్తిగా విన్న..

ఇరువైపులా నుండి ఆలో చించాక అర్ధమైన విషయం ఏవిటంటే..
-వారు విడిపోవడానికి కారణం కలిసుండాలనే ప్రేమ లేక పోవడమే.
-అనుక్షణం పని ఒత్తిడి.
-ఎప్పుడు గమ్యాలపై ఆధారపడి, ఆలోచనలు లక్ష్యాలను గురిచేస్తు, కాలం ఇరువురి మధ్యన ఒక ప్రేమ బంధం ఉందనే విషయాన్నే అనిచివేసింది.

ఇక  నేను తనను జాబు మాన్పించు. లేదా నువ్వు జాబు మానేయ్ అని సలహా ఇచ్చాను.
నా సలహాకి వెర్రిగా నవ్వుతు.
నేను జాబ్ మానేసి తన మీద ఆధారపడాల తనని జాబ్ మానేయ్ మనే ధైర్యం లేదు. తన జాబ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని పెళ్ళికి ముందే కట్టుబడి ఉన్నాం అని.
మరి ఎం చేద్దాం అనుకుంటున్నావ్ రా...
ఎం లేదురా బ్రేక్ అప్ అంతే.
మరి ప్రేమ?
తనకే లేనపుడు ఇక నా ప్రేమతో పనేముంది.
తనేమంటుంది?
తను కూడా ఫిక్స్ అయ్యింది. స్టేట్స్ కి వెళ్ళాలని. నేను వద్దన్నాను. అది తనకు నచ్చలేదు. నేను కోరుకున్న కెరీర్ ఇది కాదని వాదిస్తుంది. పైగా ఆరేడు నెలలు కాదు ఏకంగా రెండు సంవత్సరాలు.
పోనీ నువ్ కూడా వెళ్ళు.
వెళ్ళడం నాకిష్టం లేదు రా..

ఇక  నాదగ్గర మాటల్లేవు ప్రశ్నల్లేవు. కాసేపటి తరువాత కారు భయటికి దిగి వాడిని వెళ్ళమని మెల్లిగా నడుస్తూ ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.

మనుషుల్ని సాశిస్తున్నది సమాజమా? జీవనశైలియ? ఆలోచన విధానాల? అభిప్రాయాల? ఎంచుకున్న లక్ష్యాల? చదివిన చదువా? కుటుంబమా? తల్లి దండ్రులా? ఏంటో...
ఒక దానితో ఒకటి ముడి పడి గందరగోళంలో ఇరుక్కొని కొట్టు మిట్టడడమే "ఒత్తిడా!!"

ఆ ఒత్తిడి కి కాస్త ఊరడింపే ఈ పరిచయాల? ఏమో... అవునో... కాదో...

ఎన్ని అనుకున్న ప్రతి దేహానికి ఓక కెమిస్ట్రీ ఉంది. రసాయనిక చర్య ఉందని ఏదేదో చెప్తారు. కాని మనసుందని అది మానసికంగా ఒకరి తోడు కోరుతుందని ఎవరికీ వారికి తెలిసిన. తెలిసే పరిచయాలు మొదలవుతాయి అది ఆకర్షణ అని అనుకునే తావు కూడా మనసుకు రాదూ.

అర్ధంలేని ఒత్తిడికి ఆ పరిచయాలు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఆ బంధం అప్పటికి అల ముడి పడుతుంది.
కాని... జీవితాంతం కలిసుండడానికి చివరికి ఎన్నో విషయాలు పరిగనలోకోస్తాయని, ఒకరంటే ఒకరికి ప్రేమలో మమేకమై, ఒకరికోసం ఒకరుగా, ఇరువురు ఒకటిగా అనే తత్వం కలగక పోవడానికి కారణమేంటి???

ఏమో ఇవన్ని ఆలోచిస్తుంటే అమ్మ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం లో కలిసుంటే అమ్మలక్కలు అదని ఇదని గొడవలోచ్చినా.. ఒకరికొకరు కలిసే ఉండి ఆలోచించుకొని సర్దుకు పోయే గుణం అలవడుతుంది.
అందరి ఆప్యాయతల నడుమ ఏదో ఒక క్షణంలో ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ మొదలవుతుంది. 
పెళ్ళికి వయసులో తేడా ఉండాలి. పెళ్లి అయి నీ జీవితంలోకి అడుగుపెట్టిన తనని మచ్చిక చేసుకొని మనసు పెట్టి చూసుకునే గుణం నీకు రావాలి, నువ్వంటే గౌరవం తనకు రావాలి.
ఒకరిమీద ఒకరికి కచ్చితమైన, నమ్మకమైన ప్రేమ ఉంటె ఎన్ని గొడవలోచ్చిన ఎవరు విడదీయలేరు రా...
కట్టుబాటు తాడిమట్టలు అని పెద్దలు చెప్పిన ముచ్చట పెడ చెవిన పెడితే ఇగ ఇడాకులు ఇస్తారకులు అని అవ్వ అయ్యల ఇజ్జత్ తీస్తారు. మల్లోచ్చేది, వచ్చే టోడూ కూడా పెళ్ళాన్ని వోదిలేసినోడో మొగుణ్ణి వొదిలేసినదో గతి.

నిజమే... ప్రేమ పుట్టాలన్న బంధం కొనసాగాలన్న ఇరువురికి కావాల్సింది కచ్చితమైన నమ్మకం.
తను ప్రేమించిన వాడే సర్వస్వం అని ఆవిడా,
ఆవిడే నా లోకం ఆవిడే లేక పోతే నేను ఏమి కాను.
అనే అంతర్లీన ఆత్మీయ అనుభూతి కలగనంత వరకు ఏ సంబంధమైన - అది పెళ్ళి పేరుతో ముడి పడిన - ప్రేమ మత్తులో అల్లుకున్న అన్ని నీటిలో బుడగల లాంటివే.

ఒకరంటే ఒకరికి ఆత్మీయ భావన కలిగినపుడు, వయసుతో గాని, ప్రపంచంతో గాని, విషయాలతో గాని సంబంధం లేదు.
అలంటి అనుబంధానికి పెళ్లి అనే కట్టుబాటు తంతు కూడా అవసరం లేదనే నా అభిప్రాయం.

ఇక ఆత్మలు ఒకటయ్యాక విడిపోయే అవకాశమెక్కడుంటుంది. అనుక్షణం ఒకరికోసం ఒకరిగా తపిస్తుండగానే కాలం అల గడిచిపోతుంది.

బహుశా అలంటి ఆత్మీయ బంధాలు ఏర్పడాలంటే ఇద్దరు కలిసుండి ఒకరినొకరు అర్ధంచేసుకోవడానికి పెళ్లి అనే ముడితో కట్టేసి అవగాహన వచ్చేవరకు ఉమ్మడి కుటుంబాలనే వ్యవ్యహారం పనికొస్తుందని మా అమ్మ తత్వం. కావచ్చు..

నా మట్టుకైతే ప్రేమ అనే భావన నిజంగా మొదలైతే అది ఎన్నటికి ఆరిపోదు ఆరిపోతున్నదంటే వెలిగించాలని ఎంత ప్రయతించిన అది ఎవరో ఒకరి భావనని భలవంతంగా లొంగ దీసుకోవడమే అవుతుంది.

ప్రేమతో పెనవేసుకున్న బంధం గట్టిధయితే ఆ ప్రేమ బంధం ఎక్కడ యే  పరిస్థితిలో, యే జీవనవిధానంలో ఉన్న ఉన్నంతలో త్రుప్తి పొందుతూ ఆనందంగా గడిపే ప్రయత్నం జరుగుతుంటుందని నా అభిప్రాయం.

ఏంటో  ఆలోచనలన్నీ అర్ధం పర్ధం లేకుండా పారిపోతుంటే జేబులో మోగుతున్న సెల్లు రింగ్ టోన్ తో ఉన్నపలనా ఆగిపోయాయి. ఫోన్ తీసి చూస్తే తాక్షి....
ఎక్కడున్నావ్? ఇంతకి ఏమైనా తిన్నావా? ఎం చేస్తున్నావ్? బయట తిరగకు ఎండలు మండిపోతున్నాయి.. తొందరగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకెన్ని రోజులు మహా అంటే వారంలో ఎగ్జామ్స్ అయిపోతాయి............. అవతలి వైపునుండి తన మాటలు సాగుతూనే సూర్యాస్తమయం అవుతుండగా ఇంటిముఖం పట్టా...

7, ఏప్రిల్ 2012, శనివారం

జీవితం చాల జగ్రతగానే వెళ్తుంది. కాని అనుభవిస్తున్న కొద్ది దాని గమ్యం ఏంటో అంతు చిక్కదు.. 15 Dec 11

ఇరవై ఏళ్ళ జీవితమంతా పక్క వాళ్ళని అనుకరించడానికే సరిపోయింది.
అదంతా వృధా అని తెలుసుకొని నాలా నేనుంటున్న.
ఇప్పుడు నన్ను చూసి అనుకరిస్తున్న వారిని చూస్తుంటే జాలి తో పాటు నవ్వొస్తుంది..
మిత్రమా అనుకరించడం మానేసేయ్ "ఈ ప్రపంచానికి నువ్వు మరియు నీ ఆలోచనలు నిత్య నూతనమే అని తెలుసుకోని ఎప్పుడు నీలా ఉండేందుకు ప్రయత్నించు.." 12 Dec 2011


నా లాంటి వారే ప్రపంచం నిండా ఉన్నట్టున్నారు.
ఎందుకంటే ప్రపంచంతో నాకు సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్న కాబట్టి.. 12 Dec 2011

టెక్నాలజీ పేరుతో ఎంత అభివృద్ధి చెందిన, చరిత్ర కట్టడాల్లో దాగిన మెళకువలు ఎప్పుడు వెర్రిగా సవాలు విసురుతూనే ఉంటుంది..
రహస్యాన్ని చేధించడం నా వళ్ళ కాదు కాని చరిత్రనే నా చిత్రాల్లో బంధించి భధ్రపరచాలనుకుంటున్న. అందులోని భాగమే "హంపి ఫోటో టూర్" 12 Dec 2011
ప్రపంచంలో కలిగే మార్పులన్నిటికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులం నువ్వు నేను.. 12 Dec 2011
శరీరం ముందుకు పరిగెడుతున్న మనసు మాత్రం గతస్మృతుల బాటలో వెనక్కి పరిగేడుతున్నది.. 12 Dec 2011

వర్తమానం భవిష్యత్తుకో చరిత్ర.
ఇప్పుడు అంతగా పట్టించుకోకపోయినా అప్పటికి ఓ అసాధారణమైన మిస్టరి.. 12 Dec 2011
ఆరిచే స్వాతంత్రం నాకున్న అనుచుకోవటానికి కారణం నీ మీదున్న నాకున్న గౌరవమేనా ఏమో.. 11 Dec 2011
విశ్లేషించేంతటి అనుభవం నాకు లేదు. కేవలం ఆస్వాదించటం తప్ప.. 11 Dec 2011
నీ మౌనం చాలు నా మనసును ఆణువణువూ గాయపరిచెందుకు. - 9 Dec11

సమాజం పై నాకు ఎలాంటి అభిప్రయం లేదు. 
ఇప్పటి వరకు నేను ఆలోచించే విధానం బట్టే ఎదుటివారు అల కనబడుతున్నారు.
ఈ మధ్యకాలం లో నాకు కనిపిస్తున్నవారు
కళాకారులు, ఫోటోగ్రాఫర్లు, గాయకులూ, రచయతలు, మత ప్రవక్తలు, ఆధ్యాత్మిక ఆచారులు,ప్రకృతి ఆరాధకులు, సున్నితమనస్కులు..... 9 Dec 11

6, ఏప్రిల్ 2012, శుక్రవారం


నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. కాని ప్రతి ఫీలింగ్ ని డబ్బు తో వ్యక్త పరచడం నాకే కాదు నాలాంటి వారికేవరికి చేత కాదు.
డబ్బు అనే ఒక విషయం మనిషిని నిలువుల మారుస్తుందని నా భయం. అందుకే సాధ్యమైనంత వారకు నేను దానికి దూరం. 8 Dec 11
ఎంత మమకారం లేక పోతే నిన్నటి నుండి ఇంతల వాటేసుకుంటుందా.. ఈ జ్వరం.. 7 Dec 11

ఫొటోస్ తీస్తుంటే.. భయట కనిపించేదంత భ్రమ అన్నాడు ఓ సన్యాసి గారు.
నిజమే ఒక విషయానికి అంటిపెట్టుకొని అదే నిజమైన జీవితం అని కాలం గడపడం కూడా భ్రమే.. 5 Dec 11


నైతిక విలువల పేరుతో మనిషి కొన్ని గీతలని ఎందుకు గీసుకున్నాడో.
ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అర్ధమవుతున్నది. మనిషిల ఆలోచిస్తుంటే.. 5 Dec 11

మరో కాసేపు నిద్ర పోధమనుకున్న కాని ఆ స్వతంత్రం నాకు లేకుండా పోయింది..
తప్పధనుకుంటూ మరి మోసుకొచ్చాను ఆఫీసు కి - నా శరీరాన్ని..
ఏంటి.. ఇక మనసంటావ అది ఎప్పుడో నిన్నటి తీపి జ్ఞాపకాల్లో ఇరుక్కుపోయింది.. 5 Dec 11

మనిషి ఆనందాన్ని వేత్తుక్కుంటూ సాగే ప్రస్థానానికి
చివరికి ఎక్కడినుండైతే మొదలు పెట్టాడో అక్కడే తన ఆనందం ఉందని తెలుసుకోవడమే ముగింపు. 5 Dec 11
అభిప్రాయాలూ తమ సొంత అనుభవాలు. అవి అందరితో ఏకిబవిస్తాయని అనుకోవడం పొరబాటు. 4 Dec 11
ఒంటరిగా గడపలాని మనసు కోరుకోవటం కూడా వ్యసనమే.. 5 Dec 11
ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వధించేవాన్ని అల్పజీవి అని కొందరంటే అల అనుభవించలేని వాణ్ని ముర్ఖుడని నేనంటాను. 4 Dec 11

మనసు భాలేదని అన్నానో లేదు.
అందరు కట్ట గట్టుగొని కౌన్సిలింగు చేయడం చూస్తుంటే...
పాపం నా కౌన్సిలింగుని ఎలా భరించారో నా మిత్రులు అని భాదేస్తోంది :( 3 Dec 11

ఎల్ల కాలం కాక పోయిన కొంతకాలమైన మనసుకు మందుల పనిచేస్తాయి.
అందుకే నేనంటాను కొన్ని పరిచయాలు "మానసిక అవసరాలు". 3 Dec 11


గత నాలుగైదు రోజులుగా నన్ను నేను సందిగ్ధపు వాకిల్లో నిర్ణయాల సంకేల్లో భంధించుకొని ఉన్న.
నా మనసు నాకే ఓ పరాయి వ్యక్తిగా ఎదురుపడుతూ వెకిలిగా నవ్వుతున్నది.
చూడాలి ఇంకెన్ని రోజులు పడుతుందో సంకెళ్ళను తెంపుకొని రెక్కలు కట్టుకొని స్వేచ్చ సౌధంలోకి మళ్లీ ఎగరడానికి. 1 Dec 11
క్షణాల గుప్పిట్లో యుగాల దూరాలు. 1 Dec 11
అనుభవాల గ్రంధం చెదలు పడుతూ మూలుగుతున్నది - వృద్దాశ్రమం అరలో. 26 Nov 11
వారం రోజులుగా ఆగని విందులకు అదుపుతప్పిన నాలుక, పాక్స్ తగ్గిన పొట్ట. :p 26 Nov 11

చూస్తుండగానే మల్లి వొచ్చింది శనివారము.
వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బో ఈ వారంలో చాలానే జరిగిపోయాయి.
కొత్త స్నేహాలతో శ్రీశైలం ఫోటోటూర్, వృద్ధాశ్రమం, మొక్కలు నాటడం, మిత్రురాలి కిడ్స్ ప్లే స్కూల్ ప్రారంభం, సైకిల్ రైడ్, బర్త్ డే పార్టీలు, ధ్యానం, పుస్తకాలు, ఒంటరిగున్న మిత్రులంత జంటలు కావడం, ఆవిడతో కాలక్షేపాలు, రుచికరమైన బోజనాలు మొత్తానికి పేస్ బుక్ కి దూరంగా చాల హాపీగా గడిచింది. 26 Nov 11
మనసులోన ఉప్పొంగే ఎన్నో రంగులను వెలికి తీయడానికి కుంచె కూడా సరిపోదేమో. 24 Nov 11

ప్రయాణాలు జీవితంలో, ముఖ్యంగా మనసులో చెరగని ముద్ర వేస్తాయి.
ఆ ప్రయాణంలో ఎదురుపడే కొన్ని అందమైన క్షణాలు అనుభవించి, ఆస్వాదించి, నెమరువేసుకొని, మరల మరల ఆనందించడమే ఉత్తమం అనిపించింది.
అలాంటి ప్రయాణమే శ్రీశైలం ఫోటో టూర్. మొదటి సారి కెమరాలతో భందించలేని అందమైన అనుభూతులకు లోనయ్యాను. 24 Nov 11

ఏదో ఓ రోజు తను కావలనిపిస్తుంటుంది.
నీకు తను కరెక్ట్ కాధనిపించిన నీకై తాను మారిన ప్రతిక్షణాలు గుర్తొస్తాయి.
నీవు తప్ప మరేమీ ముఖ్యం కాదని ప్రవర్తించిన తన తీరు స్పష్టంగా కనిపిస్తుంది.
నీలో లోపాలని మరిచి అనుక్షణం నీలో మంచిని ఎలా గుర్తించేదో.
నువ్వు ఎంతగా తనను పట్టించుకోక పోయిన తనకు తానుగా నిన్ను ద్వేషించే స్థితికి తను ఎన్నడు రాలేదని తెలుస్తుంది.
ప్రేమించడం ఎలాగో తెలియకపోయినా తనల ఎవరు ప్రేమించలేరన్న స్థితికి చేరుకున్నవని తెలుస్తుంది.

మిత్రమా... ఆరోజుకి నువ్వు చేరుకోకముందే నువ్వే తన సొంతమవు. ఖచ్చితంగా నీకు ఆనందం దొరుకుతుంది.. 17 Nov 11


నీలో ఏమూలో దాగి ఉన్న ఆనందక్షణాన్నితట్టి లేపు.
మౌనంగా కాసేపు ఆస్వాదించు.
కాలుతున్న బాధను అదే చల్లారుస్తుంది.... 17 Nov 11

ఏంటి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేద సంతోషం. ఇప్పటికైనా ఓ మంచి పుస్తకం చదవడం మొదలు పెట్టు..
చాల ఏళ్ళు నేను అదే చేసాను.. 16 Nov 11
మనసుకు స్థిరమైన ఆలోచన చాల ముఖ్యం. అదేలేకుంటే అనుకుక్షణం కల్లోలమే. 16 Nov 2011
నీకు ఏర్పడిన ఈ మౌనం నిన్ను నీవు పరిశోధించుకోవడానికి.. మధన పడడానికి కాదు మిత్రమా.. 16 Nov 2011

నిన్నటి నిశ్శబ్దపు వాకిల్లో
చిరుగాలి కౌగిల్లో
చల్లని రాత్రిలో
పొగమంచులో
తీయటి మంటను ఆస్వాదిస్తూ..
తను నేను పెనవేసుకున్నాం... గొంగడి ముసుగులో....!! 16 Nov 2011

నీ మనసు ఎందులోనైతే ఇమడగలదో అందులోనే లగ్నం చెయ్ ఆనందంతో పాటు విజయం పరిగెత్తుకుంటూ వస్తాయి..
పాతికేళ్లలో నేను తెలుసుకొని అనుభవిస్తున్న అతిగొప్ప సత్యం. 16 Nov 2011

ఇప్పుడు గాడిదలను తాయారు చేసి ప్రపంచానికి అందజేసే పనిలో - మన కార్పోరేట్ కళాశాలలు.
సారీ గాడిద గారు మమ్మల్ని మీతో పోల్చుకున్నందుకు. ఎంతైనా చాకిరి చేయడంలో మీకుసమానం అవుతున్నంగా.. 16 Nov 2011

కళ్ళు ఒక్కో సారి మోసం చేసిన - మనసు చేయదు.
ఓ అది కూడా మోసం చేసిన - కాలం అనే జడ్జ్ ఉన్నాడుగా తీర్పు వినిపించడానికి.. 16 Nov 2011
అనుభవ సారమే అభిప్రాయం. అది కాలంతో కలిసి ప్రతిక్షణం మెరుగులు దిద్దుకోవాలి. అల దిద్దుకోలేని మెదడు చాదస్తపు మొండి వలలో చిక్కుకోక తప్పదు. 15 Nov 2011
వారికంటూ ఓ రోజు ఎందుకు? ప్రతి రోజు పిల్లల రోజే!! కాదంటారా.. 14 Nov 2011
గున్న ఏనుగు మల్లోచ్చింది. ఈ సారైనా తెలుగు సినిమాని నెత్తినెట్టుకుందో లేక తొండంతో కాలికిందకి తోసేసిందో చూడాలి.. 14 Nov 2011

కాలం గడవట్లేదని ఒకరు, టైం సరిపోవట్లేదని మరొకరు, నువ్వేల మానేజ్ చేయగలుగుతున్నవో అర్ధం కావట్లేదని ఇంకొకరు.
మిత్రమా ఏది నీ చేతిలో లేక పోవచ్చు కాని "ఈ క్షణం ఈ రోజు నీకు మాత్రమే సొంతం. ఏది ఏమైనా నిర్ణయం ఎప్పుడు నీ చేతిలోనే ఉంటుంది ". 12 Nov 2011

మిత్రమా నువ్వు నీలా ఉండడంలో నీకెందుకంత నామోషి..
జనాలని దూరం నుండి కాక దగ్గరిగా పరిశీలించడం మొదలుపెట్టు వారు కూడా అచ్చం నీలా నలుగుతున్నవారే.. 12 Nov 2011
మెదడుని కాసేపు మనసుకి అతికించి చూడు. నువ్వు యంత్రానివి కాదని యిట్టె తెలిసిపోతుంది.. 12 Nov 2011

ప్రపంచానికి నువ్వేంటో రుజువు చేసుకోవాడానికి ముందు నీకు నువ్వు రుజువు చేసుకో..
నిజంగా నువ్వంటే ఏంటో నీకు అర్ధమైనప్పుడు ప్రపంచమంతా నీకు తెలియకుండానే దాసోహమనక మానరు..
భహుశ దీనికే ఆత్మశోధన అంటూ ఓ పేరుని తగిలించారని అనుకుంటా... 12 Nov 11

నా పెదాల చూట్టు పెనవేసుకున్న నీ శ్వాసల సవ్వళ్ళు మనసుకు మాత్రమే వినిపించే తాళాలతో నాట్యమాడుతూ, నిదురిస్తున్న నా కనులకు సైతం నీ శ్వాస భంగిమల మెరుపుచిత్రాలు మైమరిపిస్తుంటే...!
మునుపెన్నడూ ఎరగని ఈ వింత భావాన్ని అర్ధవంతం చేసే పదాలకై వెతుకుతూ నా బుగ్గలను అదిమి పట్టి పెనవేసుకున్ననీ దోసిల్లో పసి పాపల మూగబోయాను చెలి.....!! 11 Nov 11

5, ఏప్రిల్ 2012, గురువారం


జీవితమా.. నువ్వు భాహు చిత్రం సుమీ...
చూస్తుండగానే ఎన్నో చిత్రాలని చూపిస్తూ, అనుదినం పాయలుగా చీల్చుకుంటూ,
అనుక్షణం అనుభూతులు లోయలను తవ్వుతూ, ఆలోచనల తీరాన్ని ఉవ్వెత్తున ముంచేస్తూ,
అనుబంధాల కెరటాలని గమ్మత్తుగా మాయం చేస్తూ,
మనసు గాయాల కన్నుగప్పి మత్తుగా ముసుగు చీకట్ల వాకిట్లోనుండి మరో కొత్త ఉదయాన్ని కోరుతూ ఆగని నీ పయనానికి గమ్యాన్ని నిర్దేశించానని అనుకోవడం నా భ్రమే...
నువ్వు నా సొంతమో లేక నేనే నీ భానిసనో ఏమో..
ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో ఈ కీలుబొమ్మ.. 10 Nov 11

సినిమా - ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుందో లేదా ప్రస్తుత పరిస్థితులపై దాని ప్రభావం పడుతుందో అర్ధం కాని పరిస్థితి.. 8 Nov 11

కొన్ని అనుభంధాలకు శరీరంతో సంబంధం లేదు.
భావాన్ని మనసుతో పంచుకుంటూ ఎంతకాలమైన కొనసాగించొచ్చు.. 8 Nov 11

కొన్ని అనుభూతులులకు భాషను వెతకడం కన్నా
మౌనంగా ఆస్వాదించడమే మిన్న.. 8 Nov 11 - 2011

నాకంటూ ఒకరున్నారు అనే అనుభూతే గొప్ప ధైర్యన్నిస్తుంది.
కొందరి ధైర్యానికి నేను కారణం అవడం నాకు సంతోషాన్నిస్తుంది.. Nov 8 - 2011

కొన్ని అనుభూతులులకు భాషను వెతకడం కన్నా
మౌనంగా ఆస్వాదించడమే మిన్న.. Nov 8 -2011
పేస్ బుక్ - ఎవరు నావారు కారని తెలిసిన అందరు నావారే అనే వెర్రి భ్రమను కల్పించే ఓ వింత చోటు.. Nov 4 - 2011

హారతి విలువ - ఇస్తున్న వారికి కళ్ళకి అద్దుకునే వారికి ఇద్దరికీ తెలిసి ఉంటె బావుండని నా ఉద్దేశం.
మంచిది అనే ఒక కారణం తప్ప. ఎందుకు చేయాలో తెలియనపుడు చేయకపోవడమే మంచిది. Nov 4 - 2011
Things are going well. I think i am holding Right Thoughts.. Nov 4 - 2011
కమ్మని కవితని కనే కవికి కదిలే మదియే కదా కారణం. Nov 3 - 2011

మిత్రుడి నాన్నగారు మనసులని రిపేర్ చేసే చోటుని ఏర్పాటు చేసాడట అదేనయ్యా కౌన్సిలింగు సెంటరు.
ఎవరిదైన మనసు విరిగితే చెప్పండి. ప్లాస్టర్ వేయడానికి సిద్ధంగ ఉన్నాడు. Nov 3 - 2011


పెరుగుతున్న పెట్రోలు, వంట గ్యాస్ రెట్ల పుణ్యమా అని
కనీసం క్షణకాలం అయిన అట్లాస్ సైకిల్, కట్టెల పొయ్యి మళ్ళీ గుర్తుకొచ్చాయి.. Nov 3 - 2011

నిన్నటి జ్ఞాపకాల్లో అస్తమించి, మళ్ళి ఉదయించాను నేడు.
రేపటికై ఓ అందమైన తీపి గుర్తుని మిగుల్చుకోవడానికి. Nov 2 - 2011
ఫోటోగ్రాఫర్ కి లోకమంతా రంగులమయమే.. Nov 2 - 2011

I am only desiring. Lord is arranging everything.
So credit goes to my lord who staying in me.. Nov 2 - 2011

డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకునే బదులు.
సృజనాత్మకతని పదును పెట్టె పనిలో ఉన్న.. Nov 2 - 2011
వారి అవసరం మనకు ఎంత ఉంటుందో. మన అవసరం కూడా వారికి అంతే ఉంటుంది. కాస్త సమయం అటు ఇటు అంతే.. Nov 2 - 2011
సలహాలు చెప్పే వారు ఎంత మంది ఉన్న చివరికి పూర్తి చెయ్యల్సింది నువ్వే.. Nov 1 - 2011

పాపం నా మిధ నాకే జాలేస్తుంది. మా నాన్నని ప్రేమించలేకపోతున్నాందుకు.
తప్పు తన మందు బాటిలుదే అని తెలిసిన.. మా ముగ్గిరి జీవితాల విషయం మొత్తం తన చుట్టే అల్లుకొని తనతో మొదలైనందుకు..
-నాన్న ఇప్పుడు నేనున్నా వయసులో నీపై జాలి పడడం తప్ప మరో అనుభూతి కలగడం లేదు. Oct 31 - 2011
సృష్టిలో ప్రతి జీవికి కుటుంబం అనేది ఓ సహజ అవసరం అనడం కన్నా ఆత్మ పరిపూర్ణతకోసం సాగించే ప్రయాణంలోని ఓ భాగమే అని నా అభిప్రాయం. Oct 31 - 2011

అవగాహనా పెరుగుతున్న కొద్ది, ప్రతి వ్యక్తి తమకంటూ తమ చుట్టూ వృత్తాలను గీసుకోక తప్పదేమో.
అవే లేకుంటే బహుశ విమర్శకు తావెక్కడిది.. Oct 31 - 2011
ఇష్టలనేవి వ్యక్తి ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. Oct 31 - 2011

అసాధ్యాలను సుసాధ్యాలు గావించేది నీలో దాగిన ఆత్మ
కళ్ళు మనసు మెదడు బుద్ది కేవలం పనిముట్లు. Oct 31 - 2011

వ్యక్తులపైనే నమ్మకం లేదు.
ఇక అభిప్రాయం ఎలా పుడుతుంది. Oct 31 - 2011
Shit my Modern education never teaches how to maintain a heartful relation ships. They only teaches names Like technology, success, focus, number one, knowledge, time, money, designations etc..  Oct 31 - 2011

తనకేం కావాలో తెలుసుకోవడంలోనే పాతికేళ్ళు గడిచాయి.
తనకు కావాల్సింది సాధించుకోవడానికి ఇంకెన్నాళ్ళు గడిచిపోతాయో.. Oct 31 - 2011


"ఒంటరితనమే ఆనందం అనుకున్న తనకి ఇప్పుడు అదే నరకమై కుర్చుందంట."
ఎన్నో ప్రతిభ పురస్కారాలు, అందరి మన్నలను అందుకొని మరెందరికో ఆదర్శంగా నిలిచినా మా విధిలో ఉండే కళాకారుడు ఇప్పుడేవ్వరికి అక్కరలేకుండా ఒంటరితనంతో అనుక్షణం యుద్ధం చేస్తున్నాడు. Oct 31 - 2011

ఆత్మ శక్తిని కొంచెం ఉపయోగించిన చాలు ఎన్నో అధ్బుతాలు సాధించొచ్చు. అని ఎవరో చెప్పారు.
అది నిజమే అనిపించినా పాపం దాని గురించి పట్టించుకునే టైం మనకెక్కడిది.. Oct 31 - 2011
ఎంత జాలి గుండైన అప్పుడప్పుడు వాస్తవం లో బ్రతకడం కోసం గరుకు చేసుకోక తప్పదేమో.. Oct 30 - 2011
కొన్ని అనుబంధాలు ఎంత భలమైనవో. అంతే భాధాకరమైనవి. Oct 30 - 2011

ప్రతి కళకి భాష ఉంటుంది.
అది మెదడు తో బేరీజు వేసేది కాదు.
మనసుతో వింటూ, ఆత్మతో ప్రతిస్పందించాలి. Oct 30 - 2011

నీ ఆలోచనలను చీకటి గదిలో భందించకు మిత్రమా.
ఒక్కసారి స్వేచ్చ ప్రపంచంలోకి వచ్చి ఊపిరిపీల్చు.
నీకే తెలుస్తుంది. నీ ఆలోచనలకూ ఎంత బలముందో. Oct 29 - 2011
ఇతరులకు హాని కలిగించనంత వరకు ఏ చోటు ఐన నీ చోటే.. Oct 29 - 2011
ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది - వ్యక్తిత్వం. Oct 29 - 2011

నువ్వు చేసిది సరైనదేనని నీకు నమ్మకం ఉంటే. నిను వెనక్కి లాగే వారిని పట్టించుకోకు.
ఈరోజు హేళన చేసిన వారే, తర్వాత నోర్లు మూసేసుకుంటారు. కొద్దిరోజులకు వారే పొగుడుతుంటారు.. Oct 29
కళాకారుడికి లోకమంతా ఒకటే. Oct 27 - 2011
ఏంటి మనల్ని చూసి అసూయపడుతున్నర. మంచిదే మనం సమ్ థింగ్ స్పెషల్ అని వారికి అర్ధమైనట్టే కదా. Oct 25 - 2011
అందరికి కావాల్సింది సంతోషం. సరైన సంతోషం ఎలా ఉంటుందో తెలియకే ఈ కన్ఫ్యుజన్. Oct 21 - 2011
కనుసైగ తోటి కనుదాటి వెళ్లి నా చిరు గుండెల్లో కరగని కలవై నిలిచావని ఎలా తెలపను. Oct 20 - 2011

నువ్వు నా ఎదురుగా నిల్చుంటే - జరిగేదంత కలగా ఉంటే.
నాక్కూడా కన్నీరోచ్చింది - నను విడిచి వెళ్ళే సంగతి నిజమని తెలిసి.. Oct 20 - 2011

నా మనసులో ఏమి దాగుందో కాలానికి తెలియదు.
కాని ముందున్న కాలమంత నాదేనన్న చిన్న భ్రమ. ఆ భ్రమలోనే ఇంతకాలం వేచి ఉన్న. Oct 20 - 2011
నేనే కాదు అందరు కాలం వలలో చిక్కుకున్న వారే.. Oct 20 - 2011
మనం గుర్తించం కాని మౌనంగా మనల్ని అభిమానించేవారు ఎక్కువే. Oct 19 - 2011

గింజుకున్న రానిది యవ్వనం .
కష్టం లేకుండా వచ్చేది ముసలితనం. Oct 19 - 2011
(తెలీకుండానే గడిచిపోయేది జీవితం... ; mahesh cont.)
అజ్ఞానితో తలపడకండి. చూసే వారికి అర్ధం కాదు ఎవరు జ్ఞానో..  Oct 19 - 2011
మరణం - ఓ జీవిత కాలపు అనుభవం. Oct 19 - 2011
నిజం నిప్పులాంటిది అది లంచం జల్లులో తడవక మానదు. Oct 17 - 2011

దూరం మనసుల మధ్య ప్రేమను పెంచి దగ్గరయ్యేందుకు తోడ్పడితే.
మరింత దూరం వారు లేకుండా బ్రతకడం ఎలాగో నేర్పుతుంది. Oct 17 -2011