15, నవంబర్ 2011, మంగళవారం

నా మనసు

ఎంత గొంతు విప్పి పాడిన
ఎవరు వినలేని ఓ మౌన గీతం... నా మనసు.
పరుగులు తీస్తూనే ఉన్న...!
అంగులం కూడా కదలని శిల్పంలా నిశ్చలం... నా మనసు.
నేనే ఓ ప్రశ్న
దానికి సమాధానం నేనే..
ఎవరు ఊహించని మధుర స్వప్నం నేను.
ఎవరు చదవలేని ఓ రహస్య పుస్తకం నేను..
నాకిచ్చిన లోకంలో నన్ను పలకరించే..
ప్రతి మనసు నాకై సృష్టించాడేమో ఆ దైవం.
అని పరితపించెను నేను.

నన్ను ఆహ్వానించే ప్రతి మనసుకు తెలుసో తెలియదో కానీ
నన్ను సృష్టించిన ఆ దైవానికి మరియు నీకు మాత్రమే తెలుసు నేనేoటోనని..
అలంటి నీకు దూరమవుతున్నానని తెలిసి మొదటిసారి
నా మనసు నాకే తెలియకుండా రోదిస్తున్నది నీకు వినిపిస్తుందారా...  

కామెంట్‌లు లేవు: