15, నవంబర్ 2011, మంగళవారం

ఫోటోగ్రఫి అనగా

ఒక వస్తువు, ఒక విషయం, ఒక స్థలం ఏదైనా కాని దానిలో బాహ్య మరియు అంతర్లీనంగా దాగిన పాత్ర (కారెక్టర్) ని గమనించి, ఆ పాత్రా యొక్క విశిష్టతని గొప్పతనాన్ని దానిలో దాగిన మహత్యాన్ని అనూభూతి చెంది, ఆ పిమ్మట సరికొత్త ఆలోచనతో సరికొత్త తరహాలో ఇతరులు ఊహించని విధంగా, భిన్నంగా అందరు ఒప్పుకునేలా చూపెట్టగలగడమే ఫోటోగ్రఫి.

Photography is Observing the outer & inner character of a Object, Subject, Place.
And feel its essence, Then come up with different approach & Present in a different way which is acceptable, convince most of the People.

ఎవరు ఏ ఫోటోని తీసిన అనుభూతి చెందే తీస్తారు అని మీరు అనొచ్చు. అలా అయితే ఈ మధ్య కాలంలో ఆరు వందల రూపాయల మొబైల్ ఫోన్ నుండి పాతిక లక్షల DSLR ప్రొఫెషనల్ కెమెరా వరకు మనకు లబిస్తున్నాయి. LKG చదువుతున్న పిల్లాడి నుండి పండు ముసలి వరకు అందరు కూడా క్లిక్ మనిపిస్తున్నారు. ఇలా క్లిక్ మానిపించడమేన ఫోటోగ్రఫి అంటే.

అందరికి ఇష్టమే క్లిక్ మనిపించడం అల అయితే ఒక వాణిజ్య ప్రకటన కోసం తీసే ఫోటో కి ఆ ఫోటో ని తీసిన వ్యక్తికి ఆయా కంపెనీలు లక్షల్లో (నిజంగా లక్షల్లో) ఎందుకు పారితోషకం ఇస్తున్నారు.

మరి తేడా ఏంటి. ఇక్కడ మనం ఆలోచించ వలిసింది వ్యక్తినా? పరికరన్నా? పేరునా? డబ్బునా?

అన్నిటి కన్నా ముఖ్యమైనది సృజనాత్మకత. అదే గనక లేక పోతే, ఇవ్వన్ని ఉన్న ఏవి పనికిరానివే. ఎవరు కూడా సృజనాత్మకతని నేర్పించారు. అది ప్రతిఒక్కరిలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. దానిని ఎలా వెలికి తీయాలో నేర్పడమే గురువు యొక్క పని.

మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు మన మస్తిష్కం లో నీగూడంగ దాగి ఉన్నాయి.
మన కళ్ళతో చూసిన విషయాన్ని మనసు ద్వారా ప్రతిస్పందించి మెదడుకి ఉన్న అవగాహనతో నిర్ణయానికి వస్తుంటాం.
ఇది ప్రపంచం మొత్తం లో సాధారణంగా ప్రతి మానవునిలోను జరుగుతుంటుంది. ఈ అవగాహన మరియు ప్రతిస్పంధనల కార్యక్రమం అంత కూడా ఉన్న స్థలం మరియు పరిసరాల పై ఆధారపడి, కట్టుబడి, ప్రతి ఒక్కరికి వేరు వేరు గ ఉంటుంది.

ఉదాహారణకి ఒక కవి తన కంటికి కనిపించే అందాలని మనసుతో ఆస్వాదించి. తనకు ఉన్న సృజనాత్మకమైన కళతో, అవగాహన తోడుతో, దానికి అందమైన భాషనీ జోడించి కవిత రూపం లో వ్యక్త పరుస్తాడు. అది గనక ఎక్కువ మొత్తం ప్రజలని ఆకర్షింప చేస్తూ, ఆలోచింప చేస్తూ, ప్రభావితం చేయగలిగితే ఆ కవిత మరియు కవితని రాసిన వ్యక్తి కొన్ని కాలాల వరకు గుర్తుండి పోతారు.

అదే విధంగా మన కళ్ళతో చూస్తున్నదంత కూడా నిజంగా భ్రమే, మన కళ్ళకు కనిపించని మరో విషయాన్నీ, అంతరంగ కనులతో చూడగలిగి, అనుభూతి చెంది, మనకి మనం అంతర్లీనంగా ఒక గొప్ప శక్తిని పొందగలిగిననాడే, మనం మన ఆత్మతో యధార్ధాన్ని చూస్తున్నామని లెక్క. అప్పటి వరకు ఈ సాధారణ కనులతో చూసేది ఏదైనా భ్రమే.

ప్రతి వస్తువుని కూడా ఓ ఆత్మగ పరిశీలించి మనసుతో సంబాషించ గలిగిన నాడే మన ఆత్మ ప్రకృతితో లీనమైనట్టు. అదే అనుభూతికి భాషనూ చేర్చి పరికరం ద్వారా బంధించ గలిగాలి.
ప్రపంచానికి మనం అనుభవించి, అనుభూతి చెందిన విషయాన్ని చెప్పకనే ఆ చిత్రం చెప్పి చూపెట్టగలగాలి. ఆలా పలికే దృశ్యాలు ఎంత ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగితే అంత బాగా మనం ఫోటోను తీయగలిగామని అర్ధం.

"ఫోటోగ్రఫి అనుకున్నంత సాధారణ విషయమేమీ కాదు. అది ఓ అధ్బుతమైన కళ."

"ఒక కవికి, కళాకారుడికి, కళా పోషకుడికి మాత్రమే తెలుసు. నిజమైన కళ విలువ. ఆ విధంగానే ఈ ఫోటోగ్రఫి కళా పోషకులు కూడా ప్రపంచం మొత్తంలోనే కోకొల్లలు. మనసుని కొల్లగొట్టే చిత్రాలని లక్షలు పెట్టి కొనడానికి ఎప్పుడు సిద్దమే."

సరే అనుభూతి చెందాం. ఇతరులకు కనిపించని విషయం మన మూడో కంటికి కనిపించినదనుకుందాం. మరి దానిని ఇతరులు కూడా చూడగలిగి అనుభూతి పరచడం ఎలా?

ఒక అందమైన కవిత రాయడానికి భాష, పెన్ను, పేపర్ ఎలా ఉపయోగపడుతాయో.
సృజనాత్మకతతో కూడిన ఫోటోగ్రఫి అనే కళకి కూడా కెమరా అనే భాష తెలుసుకోగలగడం ముఖ్యం. ఆ భాషను పలికించే పరికరం సహాయంతో వ్యక్తపరచవచ్చు.

ఆ భాషకి ముందు భావం ముఖ్యం. అలాగే ఫోటోగ్రఫి నేర్చుకోవడానికి ముందు మనం భావాన్ని పసిగట్టగాలగాలి.
ప్రతి వస్తువులో, ప్రతి కణంలో, అణువణువులో కూడా అంతర్లీనంగా దాగిన విషయాన్నీ గమనించడం.

ప్రతి వస్తువుకి కూడా ఒక వేళ ప్రాణం ఉన్న వ్యక్తి అయితే అది ఎలా ఉంటుంది. దాని పనితనం, స్వభావం ఇంకా ప్రవర్తన, ఇలా బిన్న తరహాలో ఆలోచించడం మొదలు పెట్టాలి.

వస్తువుతో లీనం అయి. అది ఏ కోణంతో చూస్తే మనం ఊహించిన పాత్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ రకంగ మనం చూసే విధానంలోనే మార్పు తెచ్చుకోగలిగితే మనకు తెలియకుండానే మనలో  ఉన్న సృజనాత్మకత మేలుకుంటుంది.

ఒక విషయం మనం తెలుసుకుంటున్నామంటే ఆ విషయం లాజికల్ గ మన మెదడుని మనసుని సంతృప్తి పరచగలగాలి.
అప్పుడే ఆ విషయం చాల రోజులు వరకు మనలో ముద్ర వేసుకుంటుంది.
అదే విధంగా మనం తీసే ఫోటో కూడా లాజికల్ గ అటు మనసుని మెదడుని వీలైతే ఆత్మని కూడా సంతృప్తి పరచగలగాలి.
అప్పుడే మనం తీసే ఫోటోకి ఓ జీవితం దొరికుతుంది.

కామెంట్‌లు లేవు: