15, నవంబర్ 2011, మంగళవారం

స్మరణ - My Second Short Story.

ఏదో అలజడి, అంతా చీకటి
కళ్ళు మూసుకునే ఉన్నాను.
మెల్లిగా కళ్ళు తెరిచాను అయినా చీకటే.
రెప్ప మూసినా చీకటే రెప్ప తెరిచిన చీకటే.
ఘడ నిశ్శబ్దం. నా శ్వాసే బిగ్గరగా అరుస్తున్నది నా చెవుల్లో.
ఈ నిశ్శబ్దం ఈ రోజుది కాదు, ఇది కొన్ని సంవత్సరాలనుండి అనుభవిస్తున్నదే.
ఇది నేను సృష్టించుకున్నదే.
గడిపిన క్షణాలన్నీ కాలం చేతిలో ఇంకి పోతు.
అన్ని క్షణాలు జ్ఞాపకాల పేరుతో మనసు వలలో చిక్కుకొని ఓ సారి గిలిగింతలు పెడితే మరో సారి మౌనంగా భాధపెడుతున్నాయి.

మనసు అంచులలో ఎన్నెన్ని అనురాగాలు. స్పురించే ఒక్కొక్కటి.
మొదట అమ్మ వొడి
నాన్న బిగి కౌగిలి
అమ్మమ్మ తాతయ్యల చెక్కిలి ముద్దులు
అన్నయ్య అక్కయ్యల దాగుడు మూతలు
బాబాయి పిన్నమ్మల ఆటవిడుపులు.

బుడి బుడి అడుగుల పరుగులతో
భయలుదేరిన పాటశాల ప్రయాణం.
మొదటి సారి కొత్తగా తెలుసుకున్న పదం స్నేహం.
ఊహ తెలియని తొలి తప్పుతో తొలి కన్నీటి చుక్క టీచర్ గారి బెత్తం దెబ్బ.

చిన్నగ మొదలు పోటి తత్వం,
నేను గొప్పా? నువ్వు గొప్పా?
కాదు నేనే గొప్పా..!
చెడుగుడు పందాలు. మొట్టమొదటి భాహుమతి ఒళ్ళంతా పులకింత.

నేనే సర్వమనే గర్వం.
అది తప్పు.. వివరించిన ఓ పెద్ద నేస్తం
నువ్వు జీవించే ప్రపంచం నీది కాదు.
ఇదే సర్వస్వం కాదు, ఇదే శాశ్వతం కాదు, ఇంకా ఏదో ఉంది. తపించు దానికి అని పలికే ఆ నేస్తం.

మమ్మల్ని వీడిపోయిన మనసులో మమ్మల్ని
గుర్తుపెట్టుకో అని రెండోసారి మనసు లోతుల నుండి వద్దనుకున్న వచ్చిన కన్నీటి చుక్కలతో వీడ్కోలు పలికిన
ఫేర్వెల్ డే..

కళాశాల అదొక కళల శాల

ఏదో పెద్దవన్నయ్యాననే గర్వం
అన్ని కళల కు నాంది.
అప్పుడే మొదలు ప్రతి ఒకటి
ఎంతో మంది కొత్త మిత్రులు,
గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలు పుస్తక రూపంలో పరిచయం.
వేష భాషలు, వినోద యాత్రలు, కాలక్షేపాలు,
చెడు తిరుగుళ్లకు మందలించిన మాష్టారు.

డిగ్రీ మధ్యలో స్కూల్ కెళ్తే.
హార్దికంగా చూపులతో
ఆర్ధికంగా నవ్వులతో పలకరింపులు.
అయినా పాటశాల రోజులే గొప్ప అని తెలుసుకున్న క్షణాలు.

చదువు అంతా పోటి, తట్టుకోలేనంతగా, ఊపిరి తీసుకోలేనంతగా, ఉరుకులు పరుగులు,
ఎంతకి అర్ధంకాని ప్రశ్న ఎంత దూరం ఈ ఉరుకులు పరుగులు.

ఒక్కసారే తళుక్కుమంది మెరుపుల తార నా తార.
సన్నటి నవ్వులు చిన్నగా పలకరింపులు మనసు మమతలతో
ఒకరి భావాలు ఒకరితో. ఎన్నో అందమైన క్షణాలు మా ఇరువురి దోసిల్లో
ఎన్నో మధురానుబుతులు పెనవేసుకున్నాయి మా ఇరువురి చిలిపి ఊహల్లో.
మేమే సర్వస్వం ఈ జగమంతా.

ఏకమవుదాం అనుకున్నాం. అప్పుడే అడ్డు కులమతాలు పట్టింపులు వ్యతిరేకత గొడవలు
మా ఈ జీవితం వ్యర్ధం అనిపించి ఇక్కడే ముగిద్ధామనుకున్నం.

ఛీ... మీరింత పిరికి పందలా ప్రశ్నించిన గొప్ప వ్యక్తి.
ఆర్ధిక సహాయం అంది మరో రోజు

ట్రైనెక్కాం... ఒక కొత్త చోటుకి...
కాస్త బిడియంతో కాస్త మౌనంగా
బొంబాయిలో రిజిస్ట్రేషన్ మ్యారేజ్
కొత్త సంసారం, ఒక కుటుంబం
మొదలయింది నా వేట చిన్న ఉద్యోగం. చిన్న సంపాదన భారి ఖర్చులు.
పొదుపు పాటిస్తూ వెల్ల బుచ్చడం. చుట్టూ కొత్త బాష అంత కొత్తగా ఉంది.
నాకు తెలిసిన విద్యలతో రోజు ఏదో ఒకటి చేస్తూ నాతో పాటే నా భాగస్వామి..

నటన, వ్యాపారం రెండు సమపాళ్ళలో కలిపి చేసిన వంటకు ప్రతిరూపంగా నాలుగేళ్ళలో బొంబాయి లో సొంత ఫ్లాట్ అదొచ్చిన మరో యేడుకు ఓ బాబు.
ఇప్పుడు నా ఇళ్లోక నందనవనం.

చిత్ర సీమలో వేసిన నా అడుగులు మున్దేకే తప్ప వెనక్కి తీసే అవకాశం ఎన్నడు రాలేదు.
అంచలంచెల పేరుతో లెక్కలేనన్ని ఆస్తులు భూములు, షేర్లు, వ్యాపారం వాటితో పాటే శత్రువులు సెక్యురిటి.
నాకు తెలియకుండానే రకరకాల వేషాలతో  నేను పరకాయప్రవేశం చేస్తూ నా మనసుకు నేను ఎప్పుడో దూరమయ్య.
ఆ క్షణంలో.

ఒకసారి నా వాళ్ళను వేత్తుక్కుంటూ నేను, తార, బాబు, సొంత ఇంటికి పయణం.
మసకగా చూసే నాన్నకి మసగ్గానే కనిపించింది క్షణకాలం పాటు గుర్తుకు రాని నా కొత్త రూపం.
అక్కున చేర్చుకొని రోదించింది అమ్మ..
మళ్ళీ ఆ ఇంట్లో ఆనందం. చుట్టాలు, బంధువులు, చిన్నమ్మలు, బాబాయిలు, అత్తమ్మ, మామయ్య, అన్నయ్యలు, అక్కయ్యలు, బావలు, మరదళ్ళు, అల్లుల్లు ఒకటే సందడి.
రెండు నెలలు, ఒళ్ళంతా పులకరింతలతో పండగలతో ఎంత సంతోషమో ఆ క్షణాలు.
ఇంత ఆనందానికి ఎందుకు దూరంయ్యననే నా ప్రశ్నకు సమాధానం నీ నిస్సహాయత అని బదులు పలికింది నా మనసు.
తోచిన సహాయం చేసి తిరిగి నా ప్రాపంచిక గృహానికి ప్రయాణం.

మార్గ మధ్యలో గోరా ప్రమాదం అయినా క్షేమంగా ఆసుపత్రుల్లో.
చుట్టూ పత్రికల హోరు, జర్నలిస్టులు, ఒకటే నలత.

నెల రోజుల్లో నిర్ణయానికొచ్చా సినిమాల నుండి వైదొలిగి, సేవ కార్యక్రమాలకే  ఈ జీవితం అని ప్రకటించా. తార కూడా ఒప్పుకుంది.
మిత్రులే వద్దన్నారు. అయిన వినలేదు.

అబ్బాయి పై చదువులకు పొరుగు దేశానికెళ్ళాడు. తర్వాత డాక్టర్ అయి అక్కడే జీవిత బాగ్యస్వామిని ఎంచుకొని నా వద్దకు వచ్చి అంగీకారం తెలుపమన్నాడు.
వాడికి నాలాగా నా అనుకున్నవ్యక్తులందరు దూరం కాకూడదని ఒప్పుకొని పెళ్లి ఘనంగా అనుకున్న రీతిలో గొప్పగా చేశాను.
వాడి ఆలోచనలతో వాడికి తోచిన విధంగా జీవితాన్ని ఎంచుకోమన్నాను.

పది సంవత్సరాలు తీర్ధయాత్రలకు మరో పదేళ్ళు స్కూళ్ళు, ఆశ్రమాలు కట్టడానికి గడిచాయి.
ఉంది కాబట్టి పూర్తి చేసానన్న త్రుప్తి.

ఆయినా వెలితి

అంత అందరికే అన్నట్టుగా మేము ప్రశాంతం అనుకున్న చోటులో రోజులో గడుపుతున్నాము.
రాజకీయాలు నన్ను ప్రోత్సహించాయి.
ఆయినా వాటికి దూరంగానే ఉన్నా.
ఒకానొక అశుభ సమయాన తారకు గుండె నొప్పి రావటమే ఆలస్యంగా త్వరగానే నా ఒళ్లో కళ్లు మూసింది.
గుండెలో ఏదో భాద.
మూడోసారి నా కంటి నుండి రాలిన మూడ వేదన భాష్పాలు.

మరో కొత్త చోటు కొత్త లోకం మొదలు.
ఎక్కడి దాక ఈ జీవితం ప్రశ్నించుకుంటూనే ఆధ్యాత్మికం.

ఎందరివో గొప్ప వ్యక్తుల ప్రవచనాలు ఎంతగా నన్ను ఆకట్టుకున్నాయో.
భక్తి ప్రవర్తులతో పూజలు ధ్యానం నా జీవితం అయినవి.

నా అనుకున్న మిత్రులు బంధువులు కాలం చెల్లుతున్నారు. వారిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. నా టర్నేప్పుడో అని.
ఆయినా కంటి నుండి చుక్క నీరు రావటం లేదు.
అంత సహజం ప్రతీ సారి భగవద్గీత గుర్తుకొచ్చేది.
భంధం, అనుభంధం, చావు, పుట్టుక, ఏది శాశ్వతం కాదు.
అన్ని ప్రాపంచిక విషయాలే అని తోచెను.

చిన్నగా మటం ఏర్పరిచాను.
పాతిక మంది వేద విధ్యార్ధులతో చుట్టూ చెట్లు చేమలతో ప్రశాంతమైన వాతావరణం,
వేద గురువులు, వేద బ్రాహ్మణులూ, పూలు, పళ్ళు, పక్షులు, ప్రక్కనే కృష్ణుడి మండపం,
పండగలకు ఇతర శుభ దినాల్లో పూజలు, వ్రతాలు, అన్నదానాలు, భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్కటి.

నాకంటూ మిగిలిన డబ్బంతా మాటానికే వెచ్చించి రోజులో సగభాగం ధ్యానంలోనే.
మెల్లి మెల్లిగా చీకటి గదిలోకి అడుగుపెట్టా.
జ్ఞాన దృష్టికై ధ్యానం. నాకు తోచిన విధంగా రోజులు వేల్లబుచ్చుతున్నా.
నేను ఏర్పరుచుకున్నదే ఈ ఘాడ నిశ్శబ్దం.

చెదురు మదురు జీవితానికి చివరి రూపం ఏదో కాదు మౌనమే..

అంతా శూన్యం. శూన్యం లోనే ఉంది వెలుగు అదే దైవం కనిపించేదాక మనసులోతుల్లోకి ఆగని నా పయణం.
అందుకే ఈ ఏకాంతం.

నీవు కన్పించే వరకు ఈ చీకట్లే నా సర్వస్వం.
ఓ దైవం అనే రూపమా నీకై వేచి చూస్తూ
ఓ అల్ప జీవి..

కామెంట్‌లు లేవు: